London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ఎన్నికల బాండ్ల తీర్పుపై ఎదురుచూపు

కె.రవీంద్రన్‌

ఎన్నికల బాండ్ల కొనుగోలుతో బీజేపీ అనేక వందల కోట్లు ధనం సమీకరించి ఎన్నికల్లో ఖర్చు చేయడం ద్వారా ఎంతగానో ప్రయోజనం, లబ్ది పొందుతుందని ఈ బాండ్లు చెల్లుబాటు కాకుండా తీర్పు ఇవ్వాలని అనేక మంది ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు, ఆసక్తిపరులు అనేక పిటీషన్‌లను గత నవంబరులో సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగే ప్రతిసారి బాండ్లను విక్రయించడం ద్వారా అన్ని పార్టీల కంటె ఎక్కువగా బీజేపీనే ప్రయోజనం పొందుతోంది. అందువల్ల ఈ బాండ్ల చెల్లుబాటును తిరస్కరించాలని ఇప్పుడు జరుగుతున్న బాండ్ల విక్రయం న్యాయమైనది కాదని, దీనికంటె మరింత న్యాయమైన విధానాన్ని సుప్రీంకోర్టు రూపొందించి ప్రకటించాలని కూడ పిటీషన్‌దారులు కోరారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే బాండ్ల కొనుగోలు వ్యవహారాన్ని అనుమతించరాదని పిటీషన్‌దారులు విజ్ఞప్తి చేశారు. పాలక పార్టీ అక్రమ మార్గంలో నిధులను సేకరిస్తున్నారని అందువల్ల బాండ్లను రద్దు చేయాలని తమ పిటీషన్‌లలో కోరారు. బీజేపీ తర్వాత పెద్ద పార్టీ అయిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పాలక బీజేపీ పొందుతున్న నిధులలో పదింట ఒకటవ వంతు మాత్రమే కాంగ్రెస్‌ పొందుతున్నది. ఇతర జాతీయ పార్టీలు కాంగ్రెస్‌ కంటే మరింత తక్కువ నిధులను పొందుతున్నాయి. ఇతర రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాలను ఏర్పర్చుకునేందుకు బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వార నిధులను సమీకరించి వాటిని ఖర్చు చేస్తున్నదని పిటీషన్‌లలో వివరించారు. అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధంగా ప్రయోజనం పొందటానికి వీలుగా మార్పులు చేయాలని కోరారు. రాజకీయ నిపుణులు, విశ్లేషకులు బీజేపీ అక్రమ మార్గంలో నిధులను సమీకరిస్తున్నదని విమర్శ చేసినప్పటికీ పాలక పార్టీ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతనే మొదటిసారిగా ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందుతోంది. బీజేపీ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతుందని పిటీషన్‌దారులు పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే మొత్తం నిధులలో కాంగ్రెస్‌కు పదవవంతు మాత్రమే లభిస్తుంది. ఎన్నికల బాండ్ల ద్వార లభించే నిధులను కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌లలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేసి కీలుబొమ్మ ప్రభుత్వాలని ఏర్పరచి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం పాలనను నడుపుతున్నదనేది చాలాకాలంగా ప్రజలకు తెలిసిందే. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలను అనుసరిస్తూ ఎన్నికల బాండ్లను గట్టిగా సమర్థిస్తోంది. 1998 లో ఇంద్రజిత్‌గుప్తా కమిటీ చరిత్రాత్మకమైన నివేదికను అనేక సిఫారసులతో న్యాయ కమిషన్‌కు అందజేసింది. ఎన్నికలకు న్యాయంగా ప్రభుత్వ నిధులను అందజేయటం ద్వారా న్యాయంగా ఎన్నికలను నిర్వహించడానికి వీలు కలుగుతుందని స్పష్టం చేస్తుంది. ఈ సిఫారసులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పాలక బీజేపీ ఈ నివేదికను అసలు బయటపెట్టలేదు. దీన్ని అంగీకరించటానికి కూడ సిద్ధంగా లేదు. ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫారసులలో రెండు పరిమితులను పేర్కొన్నది. ముందుగా గుర్తింపు కలిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కమిటీ కోరింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు నిధులు కేటాయించకూడదని ఆ కమిటీ సిఫారసు చేసింది. తక్కువ గడువు రాష్ట్ర నిధులను కేవలం గుర్తింపు పొందిన పార్టీలకు, లేదా అభ్యర్థులకు కొన్ని సౌకర్యాలను మాత్రమే కల్పించాలి. ఈ నివేదికను రూపొందించే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని గమనించి ఎన్నికలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధులను అందించకుండా పాక్షికంగా నిధులను అందజేయాలి. 1999 లో లా కమిషన్‌ ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫారసులను ఎక్కువ భాగం ఆమోదించింది. పాక్షికంగా నిధులు ఇవ్వడం సాధ్యమవుతుంది కాని పూర్తిగా ఇవ్వటం సాధ్యం కాదని లా కమిషన్‌ తెలియజేసింది. ఆయా పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించాలని ఖర్చుచేసిన నిధుల పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కి అందజేయాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫారసులకు పదేళ్ల ముందు సంస్కరణల కమిషన్‌ పరిమితులకు లోబడి ఎన్నికల వ్యయాన్ని అందించాలని సిఫారసు చేసింది. అయితే 2001లో రాజ్యాంగంపై సమీక్షిస్తూ ఎన్నికలకు ప్రభుత్వం నిధులను సమకూర్చాలన్న సిఫారసు ఏమీ చేయలేదు. నిధులను సమకూర్చే సామర్థ్యం ప్రభుత్వాలకు ఉన్నదా లేదా అని కూడ సమీక్షించాలని కోరింది. నిధుల ఖర్చు విషయంలో పారదర్శకత ఉండాలని కమిషన్‌ కోరింది. దేశ ఎన్నికల వ్యవస్థపై సుప్రీంకోర్టు తగిన సిఫారసులను చేసే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img