Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కనీస మద్దతు ధర చట్టం అవశ్యం

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌

పంటలకు కనీస మద్దతుధర కల్పిస్తూ చట్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా అన్నదాతలు మళ్లీ ఆందోళనబాట పట్టారు. పండిరచిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తేవాలని, 60ఏళ్లు నిండిన రైతులకు,కూలీలకు నెలకు రూ 3వేలు పించన్‌ ఇవ్వాలని, రైతు రుణాల రద్దును కోరుతూ పంజాబ్‌,హర్యానా,యుపి తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లు ఇతరవాహనాలతో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢల్లీి నగర శివార్లలో నిరవధికంగా ధర్నా చేస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కనీస మద్దతు ధరను కాగితాలకే పరిమితం చేసి, అమలుకు చట్టం చేయకుండా విపరీత జాప్యం చేయడం, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కోకపోవడం కర్షకులు మళ్లీ ఉధృత ఆందోళన ప్రారంభించడానికి ప్రధాన కారణం. కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా, సంయుక్త కిసాన్‌ మోర్చాల పిలుపు మేరకు రైతు బృందాలు ఫిబ్రవరి 13న రాజధాని ఢల్లీి వైపు కదిలాయి. పంజాబ్‌ రైతులు హర్యానా మీదుగా శంభు – అంబాలా- ఖ నూరీ-జింద్‌ అంతర్రాష్ట్ర సరిహద్దులకు చేరుకోగా వారిని హర్యానాలో ప్రవేశించకుండా అక్కడి బీజేపీి ప్రభుత్వం అడుగడుగునా ఇనుప తీగెలుముల్లకంచెలు, ఇతర అడ్డుగోడలు నిర్మించి అన్నదాతలు ముందుకు రాకుండా అడ్డుకున్నది. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద రాయ్‌తో కూడిన మంత్రుల బృందం రైతునాయకులు జగ్జిత్‌ సింగ్‌, స్వరన్‌ సింగ్‌ పాంథర్‌ ప్రభృతులతో నాలుగుసార్లు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మినప, కంది, పెసర, మొక్కజొన్న, పత్తి పంటలను కొంటా మని కేంద్రం హామీ ఇచ్చినా, ఐదేళ్ల కాంట్రాక్టు మెలిక పెట్టడంతో రైతు సంఘాలు అందుకు అంగీకరించలేదు. దేశ జనాభాలో ఇప్పటికీ 43శాతం పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆలంబనగా జీవనం సాగిస్తున్నారు. దుర్భిక్షాలు, కరవులు, వరదలు, అకాలవర్షాలు, వడగండ్లు, గాలి ఉధృతి వంటి ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ఒడిదుడుకులేకాక ప్రభుత్వాల నిర్లక్ష్యం, విధాన వైఫల్యాలు, దళారీలు, వ్యాపారుల దోపిడీ వల్ల కూడా అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంటలకు సరైన ధరలు లభించక ఎన్నో కష్ట నష్టాలకు గురవుతున్నారు. ఇట్టి పరిస్థితులలో పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ కేంద్రం చట్టం తెస్తెనే అన్నదాతలకు కొంతయినా ఊరట కలుగుతుంది. మనదేశం 1960వ దశకం ఆరంభంలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. అమెరికా నుంచి పీఎల్‌ 480కింద గోదుమలు, ఇతర ఆహారధాన్యాలు వస్తేనే మన ప్రజల కడుపులు నిండేది. ఈ విపత్కర పరిస్థితిని అధిగమించడానికి ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని అప్పటి పాలకులు హరితవిప్లవం తేవాలని నిర్ణయించి పరిశోధనలను ప్రోత్సహించారు. హరిత విప్లవ పితామహుడైన డా.ఎం.ఎస్‌ స్వామినాథన్‌ బృందం సారథ్యంలో మన శాస్త్రవేత్తలు ఎన్నో అధిక దిగుబడినిచ్చే వరి, గోదుమ సంకర రకాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ట్రాక్టర్లు ఇతర ఆధునిక సేద్యపరికరాలను కూడా అందించి, రుణసదుపాయం కూడా కల్పించడంతో మన రైతులు ఇబ్బడి ముబ్బడిగా పంట సిరులు కురిపించారు. పండిరచిన పంటలను కనీస మద్దతు ధరలకు కొంటామని కేంద్రం హామీ ఇచ్చి అందుకోసం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని ప్రారంభించి వరి, గోదుమల కొనుగోలును ప్రారంభించింది. హరిత విప్లవం ప్రధానంగా పంజాబ్‌, హర్యానా, పశ్చిమ యూపీలో అమలు జరిగి అక్కడి రైతులు పాడి పంటలతో సమృద్ధి సాధించడానికి తోడ్పడిరది. వర్షాధారంగా పంటలు పండిరచే రైతులకు ఎలాంటి సాయం అందడం లేదనే విమర్శలు రావడంతో కనీస మద్దతు ధరలు 23పంటలకు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చి అరకొరగా అమలు చేస్తున్నది. చెరకు,మొక్కజొన్న,పత్తి, కంది, మినుము,పెసర,శెనగ,కొబ్బరి తదితర 23పంటలకు 1967లో కేంద్రం కనీస మద్దతు ధరలు హామీ ఇచ్చింది. అయితే వీటికి చట్టపరమైన హామీ ఏదీ లేదు. ఏటా వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఈ సిఫార్సులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. లేదా ధరలు కొంత మెరుగు పరచి ప్రకటించవచ్చు. వరి, గోదుమ, చెరకు పంటలకే మద్దతు ధరలు వర్తింప జేస్తున్నందున పంజాబ్‌, హర్యానా, పశ్చిమ యూపీకే ఫలితాలు దక్కుతున్నాయి. ఇలా కనీస మద్దతు ధర పంటల కొనుగోళ్లలో విధించే మండి పన్నులు ఆయా రాష్ట్రాలకు పెద్ద ఆదాయవనరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు అప్పుడప్పుడు పప్పు దినుసులను కనీస మద్దతు ధరలకు కొంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వరి పంటనే కొంటున్నారు. తెలంగాణలో రబీలో ఎక్కువగా పండిరచే దొడ్డు రకం వరిని కొనడానికి ఎఫ్‌సీఐ, కేంద్రం నిరాకరించడంతో ఏడాది క్రితం వివాదం రగిలిన సంగతి తెలిసిందే. వరి, గోదుమ మద్దతు ధరలు ప్రధానంగా మిగులు ఉండే పెద్ద రైతులకే దక్కుతున్నాయని, చిన్న, సన్నకారు రైతులు కల్లాల లోనే దళారీలు, మిల్లర్లకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల రైతులు అందుకోసం దిల్లీ శివార్లలో ఉధృత ఆందోళన సాగిస్తున్నారు. బహిరంగ విపణిలో ఒక స్థాయికి కంటే ధరలు తగ్గినప్పుడు మాత్రమే ఎంఎస్‌పి విధానం అమల్లోకి వస్తుంది. అది సగం సమయాలలో మాత్రమే అవసరమవుతుంది. ప్రభుత్వం కనీస మద్దతు ధరలకు సేకరణ ప్రారంభించగానే మార్కెట్లో వాటి ధరలు పెరుగుతాయి. అందువల్ల ఎక్కువకాలం కొనసాగించనవసరంలేదు. మోదీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పంటల బీమా పథకం వల్ల అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక పంటలకు నష్టం జరిగినపుడు, మార్కెట్‌లో ధరలు పడిపోయినపుడు రైతులకు ఎలాంటి బీమా పరిహారం అందలేదు. అది మోదీ ప్రచారానికి వాడుకున్న విఫల పథకంగా మిగిలిపోయింది. కనీస మద్దతు గ్యారంటీ అనేది ఉపాధి హామీ పథకం వంటిదే. కరవు దుర్భిక్షాలు వచ్చినపుడు కూలీలకు ఉపాధి కల్పించినట్లు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తే రైతులకు ఉపయోగపడుతుంది. దేశంలో రుతుకుతుంబాల ఆర్థిక స్థితిగతులపై 70, 77వ జాతీయ నమూనా సర్వే గణాంకాలను పరిశీలిస్తే సేద్యం ఆదాయం కంటే వేతన ఆదాయం పెరిగినట్లు తేలింది. రైతు కుటుంబాల నెలసరి సగటు ఆదాయం రూ 10వేలు కాగా రుణభారం తగ్గలేదు. పల్లెలు, సేద్యపు రంగంలోనే దారిద్య్రం ఎక్కువున్నట్లు వెల్లడి అయింది. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ బూటకంగా మిగిలిపోయింది. దేశంలో 80కోట్లమందికి ఉచిత బియ్యం సరఫరాను పొడిగించడం దారిద్య్రం తగ్గలేదనడానికి నిదర్శనం. ఒకప్పుడు పెద్ద పెద్ద విస్తీర్ణాలుగా ఉన్న భూకమతాలు తరాలు మారి కుటుంబాలు విడిపోయి ఐదెకరాల లోపు ఒకటి, రెండెకరాల చిన్నవిగా మారడంతో సేద్యం లాభదాయకంగా లేదు. ప్రస్తుతం దేశంలో అలాంటి చిన్నవి14.1కోట్ల కమతాలున్నాయి. పట్టణాలు,నగరాలలో ఎక్కువ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు లేనందున వారంతా విధిలేక పల్లెల్లోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. పారిశ్రామిక, సేవా రంగాలలో అవసరమైన ఉద్యోగాల వృద్ధి లేదు. వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగక పోవడం కూడా మన సేద్యపురంగ దుస్థితికి కారణం. మండి చట్టాలలో సవరణలు, పంట ఎగుమతులపై నిషేధాలు సడలించడం, కాంట్రాక్టు సేద్యం, కౌలు రైతులకు రుణ సదుపాయం, మండిల అనుసంధానం, పంటలమార్పిడి కి ప్రోత్సాహం కొంత మెరుగు పరిచినా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తేనే అన్నదాతలకు మెలుజరిగేది.
సీనియర్‌ జర్నలిస్ట్‌
9440990381

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img