Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కవి షెల్లీ నిండైన సోషలిస్టు

జెన్నీ ఫర్రెల్‌
సుప్రసిద్ధ ఇంగ్లీషు కవి పర్సీ బిషె (పిబి) షెల్లీ కవితా రచనలు నేటికీ చదు వరులను, విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇంగ్లీషు పాఠ్య పుస్తకాల్లోను ఆయన కవితలున్నాయి. 200 ఏళ్ల క్రితమే ఆయన ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఆయన కల్పనా కవిత్వం నేటికీ సజీవమే. అంతర్జాతీయంగా సుప్రసిద్ధులైన ఇంగ్లీషు కవుల జాబితాలో ఆయన తప్పనిసరిగా ఉంటారు. ఆయన జీవించింది నెల రోజుల తక్కువగా 30 ఏళ్లే. 1822లో జులై 8న ఆయన మరణించారు. ప్రపంచ ప్రజలకు విప్లవ సిద్ధాంతాన్ని అందించిన ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ షెల్లీ పట్ల చివరి కంటా ఎంతగానో ఆసక్తి చూపేవారు. ఆయన లండన్‌కు చేరక ముందే ఇంగ్లీషులో వచ్చిన విప్లవ రచనలు అనువాదం చేసేవారు. ఆయన అనువాదాల పట్ల ఇంగ్లీషు, జర్మనీ కార్మిక వర్గం ఎంతగానో ఆసక్తి చూపేది. సోషలిస్టు భావజాలం వెలుపల ఉండే రచయితలలో షెల్లీని గురించి అంతగా తెలియదు. గొథె, హెయిన్‌లకు కూడా షెల్లీతో పరిచయాలు లేవు. అయితే అత్యంత ప్రసిద్ధ కవులలో ఒకరైన బిరాన్‌కు షెల్లీ బాగా తెలుసు. ఇంగ్లాండ్‌లో బిరాన్‌, షెల్లీలు అణగారిన తరగతుల ప్రజలను గురించి లోతుగా అధ్యయనం చేశారని ఎంగెల్స్‌ విప్లవ సిద్ధాంత కర్త కారల్‌ మార్క్స్‌ కుమార్తె ఎలయనార్‌ మార్క్స్‌కు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. షెల్లీసోషలిజం అంశంపైన ఆమె అనేక ఉపన్యాసాలు చేశారు. ఆ ఉపన్యాసాలను జర్మనీ సోషల్‌ డెమొక్రటిక్‌ పత్రికల్లో ప్రచురించారు. షెల్లీ రైతులు, కార్మికులపై అధ్యయనం చేశారు. ఫ్రెంచి విప్లవం తర్వాత సస్సెక్సులో పెద్ద ధనవంతుల కుటుంబంలో షెల్లీ జన్మించారు. ఎగువ తరగతి కుటుంబీకుడైన షెల్లీ ఎటన్‌ కాలేజీలో చదివారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోనూ చేరారు. బ్రిటన్‌లో 18వ శతాబ్ది చివర, 19వ శతాబ్దిలో రాజకీయ కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహార పదార్థాల కోసం ప్రజలు దాడులు చేశారు. ఐర్లాండ్‌లో లుడిట్‌ తిరుగుబాటు (19వ శతాబ్దిలో వచ్చిన యంత్రాల వల్ల పనులు కోల్పోతామని కార్మికులు చేసిన తిరుగు బాటు) జరిగి తీవ్ర అశాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రాన్సులో తమ కార్మిక వర్గాన్ని కూడా ఈ ఉద్యమం ఆవరించవచ్చునన్న భీతిలో ప్రభుత్వం కార్మికులను అణచివేసింది. రాడికల్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయ తలపెట్టిన వారిని జైళ్లలో నిర్బంధించగా వారి విడుదల కోసం యువ షెల్లీ విస్తృత ప్రచారోద్యమం చేపట్టారు. ఎటన్‌లో ఉన్నప్పుడు చేసిన రచనల్లో హేతువాద భావాలను వ్యక్తం చేశారు. అప్పుడు హేతువాదంపై బ్రిటన్‌ ఉక్కుపాదం మోపేది. 1811లో షెల్లీని అక్సుఫర్డ్‌ యూనివర్సిటీ నుండి బహిష్కరించారు. ఇంట్లోనూ ఆయన రచనలను తిరస్కరించారు. ఈ విశ్వంలో దేవుడున్నాడన్న రుజువులు ఏమీ లేనందున హేతువాదం ఆనాడు అవసర మని భావించారు. షెల్లీ 19 ఏళ్ల వయసులోనే తన కంటే మూడేళ్ల జూనియర్‌ అయిన హరియత్‌ వెస్ట్‌ బ్రూక్‌ను ప్రేమించి స్కాట్‌లాండ్‌కి వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. రాడికల్‌ ప్రచార కార్యకర్త విలియం గాడ్విన్‌్‌ను షెల్లీ అనుసరించారు. గాడ్విన్‌ 1793లో ‘పొలిటికల్‌ జస్టిస్‌’ పుస్తకాన్ని వెలువరించారు. షెల్లీ గాడ్విన్‌లు మహిళల పురుషుల సమానత్వం కోసం ప్రచారం సాగించారు.
1812లో షెల్లీ, హరి యత్‌ డబ్లిన్‌ చేరుకున్నారు. అక్కడ కాథిలిక్‌ల ముక్తికి, యూనియన్‌ల నిషేధం ఎత్తి వేయాలని విస్తృతంగా, ఉధృతంగా ప్రచారం గావించారు. ఐక్య ఐర్లాండ్‌లో ది ప్రెస్‌ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన జర్నలిస్టు పీటర్‌ ఫిన్నెర్టీని జైలు నుండి విడుదల కోసం షెల్లీ ఒక వ్యాసం రాశారు. ఆయన విడుదల కోసం ప్రచార ఉద్యమం చేపట్టాలని కోరుతూ కరపత్రం రాసి పంపిణీ చేశారు. యునైటెడ్‌ ఐర్లాండుకు చెందిన రాబర్ట్‌ ఇమ్మెట్‌ అందరికీ సమాన హక్కుల రిపబ్లిక్‌ కోసం పోరాడేందుకు అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలని బహి రంగంగా పని చేశారు. షెల్లీ ఆయన మార్గాన్ని అనుసరించాలని ఇమ్మెట్‌ను ఎంత గానో అభిమానించారు. పత్రికా స్వేచ్ఛ, న్యాయ సమానత్వం కోసం ఇమ్మెట్‌తో కలిసి పని చేశారు. అమెరికా విప్లవం స్ఫూర్తితో డబ్లిన్‌లో డిక్లరేషన్‌ ఆఫ్‌ రైట్స్‌ (హక్కుల ప్రకటన) ముద్రించి పంపిణీ చేసిన ఇమ్మెట్‌ను షెల్లీ ఆరాధించారు. ఐర్లాండ్‌లో ఒక రాడికల్‌ వార్తా పత్రికను తీసుకురావాలని ఇమ్మెట్‌ ప్రయత్నిం చారు. అయితే షెల్లీ తన జీవితాంతం శాంతియుత పోరాటానికే ఇష్టపడ్డారు. వ్యవసాయ కార్మికులు, రైతుల మెరుగైన జీవన పరిస్థితుల కోసం పోరాడేందుకు షెల్లీ వేల్స్‌కు వెళ్లారు. 1813లో షెల్లీ పైన హత్యాయత్నం జరిగింది. ఐర్లాండ్‌లో అత్యంత సంపన్నుడు, భూస్వామి రాబర్ట్‌ లీసన్‌ తదితరులు ఈ హత్యాయత్నం చేశారని తెలిసింది. ఈ ఘటన అనంతరం షెల్లీ వేల్స్‌ నుండి ఐర్లాండ్‌కు చేరుకున్నారు. రాజకీయ హక్కుల కోసం గాడ్విన్‌ ఆయన స్నేహితుడు థామస్‌తో కలిసి మానవ హక్కులు కావాలని షెల్లీ లండన్‌లో కరపత్ర ప్రచారం సాగించారు. ఈ సమయంలోనే షెల్లీ ఆయన భార్య హరియత్‌లు తాము కలిసి ఉండటం కష్టమని నిర్ణయించుకున్నారు. అనంతరం 1814లో షెల్లీ గాడ్విన్‌ కుమార్తె మేరిని ప్రేమించాడు. ఈ ఘటన తర్వాత ఇద్దరు కలిసి యుద్ధంతో అతలాకుతలమవు తున్న ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌కు వెళ్లారు.
1814 నవంబరులో హరియత్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే మేరీ, షెల్లీ వివాహం చేసుకున్నారు. 1815లో మేరీకి గడువు కంటే ముందే ఆడ శిశువు జన్మించి కొద్ది రోజుల తరవాత మరణించింది. బిరాన్‌తో పాటు షెల్లీ, మేరీ ఇంగ్లండుకు 1816 చివరిలో చేరారు. ఈ సమయంలోనే హరియత్‌ నీటిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేరీని వివాహం చేసుకున్న తరవాత కూడా హరియత్‌ పోషణ వ్యవహారాలను షెల్లీనే చూశారు. మేరీ కుటుంబం షెల్లీపై ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ఇద్దరు పిల్లలను ఒక మతాచార్యుడి వద్ద ఉంచారు. ఆ తరవాత వారు ఇద్దరు కూడా షెల్లీ మరణానికి ముందు 1822 జూన్‌లో మృతి చెందడంతో ఆయన మనస్సు తీవ్రంగా గాయపడిరది. మార్క్స్‌ కుమార్తె ఎలియనర్‌ మార్క్స్‌ సోషలిజంపై షెల్లీకున్న అభిప్రాయాన్ని ఇలా వెల్ల డిరచారు. ‘‘స్వాతంత్య్రం కోసం పోరాడే సమయంలో షెల్లీ బూర్జువా వర్గం వైపు ఉన్నారు. ఆ వర్గం కార్మిక వర్గంపై అణచివేతకు పూనుకున్నప్పుడు షెల్లీ బూర్జువా లపై తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. 19వ శతాబ్దంలో ఉన్నవాళ్లకు, లేనివాళ్లకు మధ్య తీవ్ర పోరాటమే జరిగింది. అప్పుడు షెల్లీ కార్మికుల వైపే ఉన్నారు.’’ షెల్లీ ఆలోచన ఎల్లవేళలా ప్రేమ భావనతోనే ఉన్నది. బూర్జువా పాలన ఉన్న సమాజం షరతులపై షెల్లీ తిరుగుబాటు ప్రకటించారు. చర్చిని కూడా ఆయన వ్యతిరే కించారు. మానవ జీవితంలో ప్రేమ అనేది నిజమైన మానవత్వాన్ని, మనిషి జీవి తానికి లక్ష్యాన్ని నిర్దేశించే శక్తి ఉంది అని షెల్లీ తన రచనల్లో పేర్కొన్నారు. మానవ త్వానికి శత్రువులైన మతవాదులను, వారి అణచివేత చర్యలను వ్యతిరేకించారు.
1819 తరవాత ఆయన పద్య, గద్య రచనలన్నీ ఇటలీ భాషలో సాగాయి. ఈ దశలోనే ఆయన రచనలు ఉన్నత స్థితికి వెళ్లాయి. ఆయన రచించిన ఉత్తమమైన పద్యం ఒడె టుది వెస్ట్‌ విండ్‌. ఆయన రచనల్లో విప్లవ భావజాలం మానవత అత్యున్నత స్థాయి, ప్రేమ ఎక్కువగా కనిపిస్తాయి. గ్రీకు పురాణాల నుండి ఆయన అనేక అంశాలను ఉదహరించడం కనిపిస్తుంది. పద్య సాహిత్యం శక్తిని, సమాజంలో దాని పాత్రను, కవుల బాధ్యతను షెల్లీ చాలా రచనల్లో నొక్కి చెప్పారు. సమాజం పట్ల 200 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు బహుశా నేటికీ సమకాలీనత కలిగి ఉన్నాయి.
(పీపుల్స్‌ వరల్డ్‌ సౌజన్యంతో)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img