Monday, January 30, 2023
Monday, January 30, 2023

కాప్‌లో పేద దేశాలను మాట్లాడనివ్వరే?

బుడ్డిగ జమిందార్‌

ఒక వైపు ప్రకృతి వినాశనానికి కారణమవుతున్న ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణాధిపతులుగా ప్రచారం చేసుకొంటూనే పేద దేశాలకు సహాయం చేయటమనే పేరుతో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ, ఆ మొత్తాన్ని కూడా పరిపూర్ణంగా విడుదల చేయక కాలం గడుపుతున్నాయి. 47 దేశాలలో గడచిన 50 సంవత్స రాలలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అతివృష్టి, అనావృష్టి, కరవులు, అడవులను కాల్చటం, వరదలు వలన మరణించారు. పర్యా వరణ వినాశనానికి గురవుతున్న పేద దేశాలకు మాట్లాడే హక్కు, స్థోమత కాప్‌ సమావేశాల్లో దొరకటం లేదు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని స్కాట్‌లాండ్‌లో ప్రసిద్ధి చెందిన నగరం గ్లాస్‌గోవ్‌లో కాప్‌ 26 సమా వేశాలు అక్టోబరు 31న ప్రారంభమయ్యాయి. నవంబరు 10 వరకూ జరిగే కాప్‌ 26లో 200 దేశాలు పాల్గొంటున్నాయి. చైనా, రష్యా అధ్యక్షులు అన్‌లైన్‌లో పాల్గొంటున్నారు. పారిస్‌లో జరిగిన కాప్‌ 21 నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చాలా దేశాలు పట్టుబడుతున్నాయి. అసలు భూతాపం పెరగటమే లేదని పారిస్‌ ఒప్పందాలను ట్రంప్‌ నీరు గార్చాడు. అతివృష్టి, అనావృష్టి, వరదలు, అడవుల మంటలు, ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ ధృవాల్లోని మంచు కొండలు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరగటం, కార్బన్‌ డై ఆక్సైడ్‌ల ప్రభావంతో గ్రీన్‌ గ్యాసులు పెరిగి వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పు రావటం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పర్యావరణ ఉద్యమం నానాటికీ పెరుగుతోంది. పారిశ్రామిక విప్లవం నాటి ముందు పరిస్థితులు ఉష్ణోగ్రతల్లో రావాలంటే కనీసం 3 డిగ్రీల సెంటీగ్రేడ్లు తగ్గాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. కనీసం 2050 నాటికి 1.5 డిగ్రీల వేడిని తగ్గించాలని గ్లాస్‌గోవ్‌ కాప్‌ 26లో నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.
కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌గా పిలిచే కాప్‌ సమావేశాలు 1994 నుండి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. భూతాపం పెరగనీయకుండా చర్యలు గైకొనటానికి గ్రీన్‌ గ్యాస్‌ (వాహనాలు వెలువరించే కాలుష్యం, పరిశ్రమల్లో ఉపయోగించే శిలాజ ఇంధనం ద్వారా 65 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌, అడవుల మంటలు, వ్యవసాయ పంటలు కాల్చటం ద్వారా 11 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌, 16 శాతం మీథేన్‌ ద్వారానూ గ్యాస్‌ ఉద్గారాలు ఏర్పడుతున్నాయి) తగ్గించాలనేది ప్రధాన ధ్యేయం. ఉద్గారాలపై ఆచరణలో ప్రపంచాధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమై తీర్మానాలు చేస్తున్నప్పటికీ కార్పొరేట్‌ కంపెనీలు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తూనే ఉన్నాయి. వీరికి ప్రభుత్వాలు ఆశ్రితపాతంగా మద్దతు పలుకుతున్నాయి. స్వల్పకాలంలో అధిక లాభార్జనే ధ్యేయంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నూతనంగా రకరకాలుగా వినిమయ వస్తువుల్ని మార్కెట్లలోకి విడుదల చేయడం ద్వారా భావి తరాల భవిష్యత్తును లెక్కజేయక ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఒక వైపు ప్రకృతి వినాశనానికి కారణమవుతున్న ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణాధిపతులుగా ప్రచారం చేసుకొంటూనే పేద దేశాలకు సహాయం చేయటమనే పేరుతో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ, ఆ మొత్తాన్ని కూడా పరిపూర్ణంగా విడుదల చేయక కాలం గడుపు తున్నాయి. 47 దేశాలలో గడచిన 50 సంవత్సరాలలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అతివృష్టి, అనావృష్టి, కరవులు, అడవులను కాల్చటం, వరదలు వలన మరణిం చారు. పర్యావరణ వినాశనానికి గురవుతున్న పేద దేశాలకు మాట్లాడే హక్కు, స్థోమత కాప్‌ సమావేశాల్లో దొరకటం లేదు. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలతో పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక దీవులు మునిగిపోయే ప్రమాదమేర్పడుతున్నది. ప్రపంచ జనాభాలోని 1 శాతం ధనికులు ద్వారా పెరుగుతున్న వ్యర్థ గ్యాసులు 50 శాతం పేద ప్రజానీకం చేస్తున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఫలితంగా 10 మందిలో 9 మంది కాలుష్య వాయువులను పీల్చుకొంటున్నారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఉన్న జి20 దేశాలు ప్రపంచంలో ఇంచుమించు 80 శాతం గ్రీన్‌హౌస్‌ వ్యర్థ వాయువులను విడుదల చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 5 శాతం జనాభా ఉన్న అమెరికా, 5 వ వంతు జనాభా కల్గిన చైనా దేశాలు రెండూ వాతావరణ మార్పు నకు ప్రధాన కారణాలవుతున్నాయి. భూతాపం పెరుగుతుండటంతో తరచూ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ప్రతీ సంవత్సరం అంతకుమించి పెరుగుతున్నాయి. 198099 సంవత్సరాలలో 4212 ప్రకృతివైపరీత్యాలురాగా 20002019 మధ్యకాలంలో 7348కి పెరిగాయి. వైపరీత్యాల వల్ల మరణాల సంఖ్య 11.9 లక్షల నుండి 12.3 లక్షలకు, బాధితులు 325 కోట్ల నుండి 403 కోట్లకు పెరగగా, ఆర్థిక పరంగా నష్టాలు 1.63 లక్షల కోట్ల నుండి 2.97 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. 198099 మధ్య 1389 వరదలు, 1457 తుపానులు రాగా 20002019 మధ్య వరదలు 2394 రాగా తుఫానులు 2043కు పెరిగాయని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రపంచ సగటు సముద్ర నీటి మట్టం 1993 నుండి ఇప్పటికి 3.6 అంగుళాలు పెరిగింది. 20వ శతాబ్దంలో ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్‌ పెరిగింది. కేవలం 201019 మధ్య 467 రకాల జీవజాతులు అంతరించిపోయా యని గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది. రానున్న కాలంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఇలాగే కొనసాగితే మొత్తం మీద 35,765 గ్రూపులు అంతరించిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. భవిష్యత్తులో తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే 3040 రకాల చేప జాతులు, 2390 ఉభయ చరాలు, 1848 జాతుల క్రిములు, 1481 పక్షి జాతులు, 1449 పాకే జంతువులు, 1317 క్షీరదాలు (పాలిచ్చే జంతువులు), 742 రకాల నీటిలో జీవించే జాతులు, 237 రకాల పగడాలు, 203 జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదముందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. అనేక జాతుల మరణాలతో, కర్బన వ్యర్థాలతో భవిష్యత్తు మానవాళి మనుగడకే ప్రమాద ముంది గనుక పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం కోసం పర్యావరణ ప్రేమికులమైన మానవులంతా ఉద్యమించవల్సిన సమయమిది. లేకుంటే భవిష్య త్తు చరిత్ర మనల్ని క్షమించదు. ఆధునిక వ్యవసాయంలో ఉపయోగించు ఎరువులు, క్రిమి సంహాకర మందులతో రేణువుల ఉద్గారాలు నానాటికీ ఎక్కువవు తున్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అగ్రి బిజినెస్‌, హైబ్రీడ్‌ పంటల పేరిట మోతాదుకు మించి రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహించిన బేయిర్‌, మోన్‌సాంటో లాంటి బహుళజాతి కంపెనీలు స్వదేశీ వంగడాల్ని, వ్యవసాయ విధానాల్ని నాశనం చేసి ఇప్పుడు మరలా సేంద్రీయ వ్యవసాయం పేరిట మార్కెట్ల లోకి ప్రవేశించి అధిక లాభాలను రెండు వైపుల నుండీ ఆర్జించటం శోచనీయం.
భూతాపం పెరగటంతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లటమే గాక అనేక ఆరోగ్య సమస్యలు గుండెకు సంబంధించినవి, కలరా, మలేరియా వంటివి మరలా విజృంభించటం, ఆస్థమా, మానసిక రుగ్మతలు వ్యాపించటం జరుగు తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. అడవులను నరికేయటం, కాల్చటం, భూతాపా నికి కారణమవటమే గాక జంతువుల నుండి మానవులకు వ్యాధులు సంక్రమిస్తా యని, అట్టి మహమ్మారుల్లో కోవిడ్‌ ఒకటని ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. అధిక లాభాల కోసం లాటిన్‌ అమెరికాలో కొండలపైనున్న అడవులను నరికి కాఫీ పంట వేసిన కార్పొరేట్‌ వ్యవసాయ దారులు అనతికాలంలోనే పచ్చటి కొండలను రాళ్ళ దిబ్బలుగా చేసారని ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ చెప్పారు. కాప్‌ 26 వంటి సమావేశాల కంటే ముఖ్యమైనది మానవ చైతన్యం, ప్రకృతిని నాశనం చేసేవానిపై తిరుగుబాటు లేనిదే రానున్న కాలంలో భూతాప సమస్య పరిష్కారం కాదనేది వాస్తవం. అదే సమయంలో ఉత్పత్తి రవాణా రంగాలలో ఉపయోగించే పెట్రోలు, డీజిలు, బొగ్గుకు బదులు ప్రత్యామ్నాయ, పునరుత్పాదక శక్తి గల ఇంధనాల పరిశోధనలు, వాడకం నేటి అవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img