Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

దిక్కుతోచక మీడియా పై దాడులు!

విచక్షణా జ్ఞానం కోల్పోవడం రెండు సందర్భాల్లో మాత్రమే జరుగు తుంటుంది. ఒకటి ఎదుటివారిని ఏదో విధంగా దెబ్బతీసి తాము ప్రయో జనం పొందాలనుకొన్నప్పుడు, రెండవది తాము ఆత్మ రక్షణలోపడి నైతిక బలం కోల్పోయి తమ కోటలకు బీటలు వారే ప్రమాదం ఏర్పడినప్పుడు ఇటువంటి వినాశకాల విపరీత బుద్దులు పుడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా తన పరిపాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శిబిరంలో కలవరం మొదలైంది. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేం దుకు ప్రజలు సిద్ధపడుతున్నారన్న విషయం గ్రహించిన జగన్‌లో, పార్టీ శ్రేణుల్లో అక్కసు, అసహనం పెరిగిపోతు న్నాయి. నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి. ఆ విషయాన్ని గుర్తించిన వైసీపీ నాయకులు విజ్ఞత కోల్పోయి మీడియా సంస్థలపై, విలేకర్లపై దాడులకు తెగబడుతున్నారు. జగన్‌ ఏలుబడిలో పత్రికా స్వేచ్ఛపై ఎన్నడూ లేనంతగా దాడులు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ ఈ విధంగా జర్నలిస్టులపై, పత్రికలపై దాడులు జరగలేదు. విలేకర్లపై హత్యాయత్నా లకు పాల్పడటం, పత్రికా కార్యాలయాలపై రాళ్ల దాడులు చేయించడం వంటి ఫ్యాక్షన్‌ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు. రాష్ట్రంలో పత్రికా కార్యాలయాలు, జర్నలిస్టులుపై జరుగుతున్న దాడులను చూస్తే అసలు పత్రికా స్వేచ్ఛ ఉన్నదా అన్న అనుమానం కలుగుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్‌ నిర్వహించిన సిద్ధం సభలో వెళ్లిపోతున్న జనం ఫొటోలు తీసినందుకు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫొటో జర్నలిస్టుపై వైసీపీ మూకలు జెండా కర్రలతో దాడి చేయడం, వెంటాడి కొట్టడం, కింద పడేసి కాలితో తొక్కుతూ చంపే ప్రయత్నం చెయ్యడం దుర్మార్గం. వైసీపీ నాయకుడి అవినీతి, అక్రమాలు కళ్లకు కట్టేలా కథనం రాసినం దుకు కర్నూలులో వందల మంది వైసీపీ గుండాలు ఈనాడు కార్యా లయంపై దాడి చేసి విధ్వంసం చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. విలేకర్లపై భౌతిక దాడులు చేెయడం అనాగరికం. ప్రజా స్వామ్యంలో నిజాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత జర్నలిస్టులదే అలాంటి వారిపై అమానుషంగా దాడి చేయడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని విధంగా పాత్రికేయులపై వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు తీవ్రం అయ్యాయి. ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టుపై వైసీపీ గుండాలు దాడి చేసిన తీరు వారి ఉన్మాదానికి పరా కాష్ట. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు, జర్నలిస్టుల విధి, వారి బాధ్యత, అధికారంలో ఉన్న వారు హక్కులను కాపాడాలి. కానీ దానిని విస్మరించి విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడటం దారుణం. పత్రికా విలేకరులకే స్వేచ్ఛలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, నిరసిస్తే తట్టుకోలేక విచక్షణా రాహిత్యంతో ప్రజాస్వామిక హక్కుల పీక నులిమి వేయడానికి జగన్‌ ప్రభుత్వం సిద్ధపడిరది. ప్రశ్నించే గొంతులను, మీడియాను ఏదో ఒక విధంగా అణచి వేయడమే ఎజెండాగా పెట్టుకొన్నారు. తమ అధి కారాన్ని బీటలు బారుస్తుందన్న భయంతో, తమ తప్పులు ఎత్తిచూపే మీడియా, తమ తప్పులు రాసే కలాలు, ప్రశ్నించే గొంతులు ఉండ కూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మెరుగైన సేవలందించి వారి అభిమానం పొందాల్సిన వారు పగ, ప్రతీకారాలతో, అధికార బలంతో మీడియాను అణచివేసి తాను బలపడాలనుకోవడం చేతకానితనం అవుతుంది. ప్రజల పక్షాన నిలుస్తున్న మీడియాపై దాడులు చేసే చర్యలకు పూనుకోవడం బాధాకరం. ప్రజలకు దన్నుగా నిలుస్తున్న మీడియాపై దాడి చేస్తున్నారు. పత్రికా స్వేచ్చను, భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కబళించే కుట్రలకు పాల్పడుతున్నారు. తమకు ఎదురు రావడమే మహాపరాధమన్నట్లు వ్యవహరిస్తూ రాజ్యాంగం ప్రసా దించిన మౌలిక హక్కులను కాల రాస్తున్నారు. పత్రికలు తీవ్రంగా విమర్శించినప్పుడే పత్రికా స్వాతంత్య్రానికి నిజమైన గౌరవం దక్కినట్లు అన్నారు మహాత్మాగాంధి. ఆ స్ఫూర్తి పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమాల్లో పరిమళించినప్పుడే భావ ప్రకటనా స్వేచ్చ గుభాళిస్తుంది. అత్యున్నత రాజ్యాంగం గల దేశం మనది. అది వ్యక్తి స్వేచ్చకు భరోసాగా నిలుస్తుంది. మీడియా గొంతు నులిమేందుకు జీఓ 2340 జారీ చేసింది జగన్‌ ప్రభుత్వం. నిజం మాట్లాడినా, నిజాలు రాసినా, చూపినా ఏకంగా అక్రమ కేసులు పెడుతూ. దాడులకు దిగుతున్నారు. పత్రికా స్వేఛ్చా స్వాతంత్య్రాలపై కత్తి కట్టి మీడియా స్వాతంత్య్రానికి సమూలంగా గోరీకట్టే నిరంకుశ ధోరణిని తుంచి వేయకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగిం చదు. నిరంకుశానికి, అహంకారానికి చిరునామాగా నిలిచిన జగన్‌కి అసలు ప్రజాస్వామ్య లక్షణాల పొడగిట్టదు. కానీ ప్రభుత్వ అవినీతి, అక్ర మాలు ఎత్తిచూపడం మీడియా వృత్తి ధర్మం, అవి పట్టించుకోకుండా మీడియా మౌనంగా వుంటే ప్రభుత్వం చేస్తున్న నేరాల్లో, ఘోరాల్లో పాలు పంచుకున్నట్లే అవుతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల సభల్లో ఫొటోలు తీసే ఆస్కారం లేకపోతే ఇక ఎన్నికలు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? జగన్‌ తనది రాచరిక పాలన అనుకొంటున్నారా? ఆయన పెత్తందారులను మించిపోవడమే కాదు నియంతలా వ్యవహరిస్తున్నారు, మీడియా, ప్రతిపక్షాలు తనకు, తన ప్రభుత్వానికి భజన చేయాలని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అదెలా సాధ్యం? మీ సొంత మీడియా ప్రతిపక్షం పై, ఇతర మీడియా సంస్థలపై నిత్యం విషం కక్కడం లేదా? తమ లోపాలను ఎత్తిచూపితే సవరించు కోవడం విజ్ఞులు లక్షణం. అలా కాకుండా మమ్మల్నే ప్రశ్నిస్తారా? ఫొటోలు తీస్తారా? అంటూ దాడులకు తెగబడతారా?ఉన్నది ఉన్నట్లు చూపిస్తే, రాస్తే ఉలుకెందుకు? వాస్తవాలను విస్మరించి అంతా బ్రహ్మండం అని, ఇతరులు కూడా ఆదే నమ్మాలని, తన మీడియా చెప్పేవే వాస్తవాలని, అవే చూడాలని, అవే చదవాలని జగన్‌ ముఠా భావిస్తుందా? ప్రతిపక్షాన్ని, నచ్చని మీడియాను అణచివేత కోసమే అధికారంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది తప్ప, ప్రజలను ఉద్దరించడానికి వచ్చినట్లు లేదు. పాలనా వైఫల్యాలను, అక్రమాలను, అవినీతిని దాచిపెట్టి జనాన్ని కుడి, ఎడమల దగా చెయ్యాలన్న దురుద్దేశంతో మీడియాపై దాడులు చేస్తున్నారు. తప్పును తప్పుగా చెప్పకూడదు, చూపకూడదు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? మీరు ఏం చేసినా నోరు ఎత్తవద్దని హుకూం జారీ చేస్తే మీడియా చేతులు కట్టుకుని నిలబడలా? నిజాలు ప్రజల ముందుంచడం మీడియాది నేరమా? ప్రభుత్వ వైఫల్యాలు లేనప్పుడు, మీ పరిపాలన బ్రహ్మండం అయినప్పుడు మీడియా అంటే అంత అసహనం ఎందుకు? మీడియా నోరు, కళ్లు, చెవులు మూస్తే ప్రజలకు దిక్కెవ్వరు? ఒక పక్కన అంతా బ్రహ్మండం అని చెప్పుకుంటూ, సిద్ధం అంటూ సవాళ్లు విసురుతూ మీడియాకు ఎందుకు భయపడు తున్నారు? అవినీతి డబ్బుతో రాజకీయ ప్రయోజనాల కోసం రూ1246 కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యం స్థాపించి నచ్చని మీడియాపై, ప్రతిపక్షంపై మీరు విషం కక్కవచ్చా? మీ సొంత మీడియాలో నిరాధార ఆరోపణలతో కధనాలు రాయవచ్చు, చూపవచ్చా? కానీ మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను, అక్రమాలను, అవినీతిని ఇతర మీడియా సంస్థలు రాయకూడదు, చూపకూడదా? పత్రికలూ, కొన్ని టీవీ చానల్స్‌ ప్రజాహితం కోసం, ప్రజల్ని చైతన్యం చేయడం కోసం పని చేస్తాయి. కావునా పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే పుట్టగతులు ఉండవనే విషయాన్ని జగన్‌ గుర్తించాలి. అన్యాయాలకు, అవినీతికి, అరాచకానికి, చేతకాని తనానికి భజన చేయడానికి మీడియా మీ గడిలో బానిస కాదు? అసమర్ధ పాలనతో మసకబారిన ప్రతిష్టను కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన పాపం తనకు చుట్టుకోకుండా వుండేందుకు మీడియాపై, విలేకర్లుపై దాడులకు తెగబడటం జగన్‌ పాలనలో పరాకాష్ఠకు చేరింది.
నీరుకొండ ప్రసాద్‌
9849625610

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img