Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Thursday, June 20, 2024
Thursday, June 20, 2024

ప్రజాస్వామ్యమే విజేత

నిత్య చక్రవర్తి

తాజా లోక్‌సభ ఎన్నికలలో ప్రజాస్వామ్యం అతిపెద్ద విజేతగా నిలిచింది. జూన్‌ 4న ప్రకటించిన ఫలితాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని భిన్నత్వాన్ని నొక్కి చెప్పాయి. 64.2 కోట్లమంది ఓటర్ల నుంచి అధికార పార్టీ బీజేపీకి ఏకైక మొనగాడుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనేది స్పష్టం. గత రెండు నెలలుగా నిరంతరాయంగా చేపట్టిన ప్రధానమంత్రి ప్రచారంలో ఎన్‌డీఏ నిక్కచ్చిగా 400 సీట్లు సాధిస్తుందని, అందులో బీజేపీ లక్ష్యం 370సీట్లుగా ఘనప్రచారం చేశారు. జూన్‌ 4 ఎన్నికల ఫలితాల్లో ఇది ఖాయమని దేశవ్యాప్తంగా హోరెత్తించారు. అయితే ఎట్టకేలకు అతి కష్టంగా ఎన్‌డిఎ సంఖ్య 290, బీజేపీ 240తో సరిపెట్టుకున్నారు. అయితే 2019 లోక్‌సభ స్థానాల కంటే అరవైకుపైగా సీట్లు తక్కువగా ఉంది. ఇండియా కూటమి ఎన్‌డీఏ కంటే కేవలం అరవై ప్లస్‌ సీట్లు మాత్రమే వెనుకబడి ఉంది.
దేశాన్ని ప్రధాని మతపరమైన రొంపిలోకి దించేందుకు తీవ్రంగా యత్నించారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండాలని నినదిస్తూ కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. దేశంలో ఫెడరలిజాన్ని మట్టునపెట్టి అన్ని అధికారాలను కేంద్రీకృతం చేయాలన్న బీజేపీ లక్ష్యం సరికాదని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ప్రాంతీయ పార్టీల పునరుజ్జీవనం, మైనారిటీలో పడిన బీజేపీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వానికి రానున్న రోజులు గడ్డుకాలమే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ పలుకుబడి పూర్తిగా తగ్గింది. తానువిశ్వగురుగా, దైవదూతగా మోదీ ప్రచారంచేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్‌డీఏ మిత్రపక్షాల నుండి మోదీ విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారనేది సుస్పష్టం. మరోపక్క బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గడం సంఫ్‌ు పరివార్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ు పరివార్‌లోని ఇతర విభాగాలను కించపరిచేలా ప్రధానమంత్రి సహా పార్టీలోని ఆయన సన్నిహితులు తాజా ఎన్నికల్ల్లో ఏకపక్షంగా వ్యవహరించారు. హిందూత్వ శక్తుల దృష్టిలో సైతం మోదీ విఫలమయ్యారు.
హిందీ రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలవడం రెండో అంశం. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానాకు సంబంధించినంత వరకు బీజేపీ శిబిరానికి ఇది వినాశనమేనని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌లో కొంతవరకు పట్టునిలుపుకుంది, అయితే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ బీజేపీలో చేరేందుకు యత్నించడంతో కాంగ్రెస్‌ గందరగోళానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పతనం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా బీజేపీ అగ్రనేతల్లో ప్రశ్నార్థకంగా మారింది. అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌-ఎస్‌పి కూటమి క్లిక్‌ అయింది. 2027లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు మరింత ముందుకు దూసుకు వెళ్లనుంది. మూడవది, రాహుల్‌ గాంధీ తాజా ఎన్నికల్లో ఒక బలీయమైన నాయకుడిగా ఆవిర్భవించాడు. కాంగ్రెస్‌ ప్రచారాన్ని భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ అద్భుతంగా నడిపించాడు. హిందుత్వం, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో సహా ప్రధాన సమస్యలపై బీజేెపీ ప్రభుత్వంపై రాహుల్‌ తన ప్రసంగాల్లో తీవ్రంగా దాడిచేశాడు. నిజానికి, సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించగల నాయకుడి పరిపక్వత రాహుల్‌ ఈ ఎన్నికల ద్వారా చూపించారు. 2024 ఎన్నికలలో కాంగ్రెస్‌ లోక్‌సభ స్థానాలను దాదాపు రెట్టింపు చేసింది. దేశంలోని 139 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, ఇండియా కూటమికి సమర్థవంతమైన నాయకత్వంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియా కూటమి చాలా రాష్ట్రాల్లో ఈ ఎన్నికల ద్వారా మంచి పనితీరు కనబరిచింది. నియోజకవర్గ పార్టీల కిందిస్థాయి కార్యకర్తల సమన్వయంతోనే ఇది సాధ్యమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో చాలామంది యువ నాయకులు ఉద్భవించారు. ఇది మంచి పరిణామం. రాహుల్‌గాంధీతో పాటు, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌, ఆదిత్య థాకరే, ఉదయనిధి స్టాలిన్‌, కల్పనా సోరెన్‌, అభిషేక్‌ బెనర్జీ రానున్న రోజుల్లో ఇండియా కూటమికి అగ్రగామిగా ఉండే అవకాశం ఉంది. ఉద్ధవ్‌ థాకరే, ఎంకె స్టాలిన్‌ ఇద్దరూ ఉమ్మడి నాయకత్వంతో బీజేపీ, ఎన్‌డిఏలకు షాక్‌లను ఎలా ఇవ్వగలదో చూపించారు. రానున్న రోజుల్లో దేశంలో రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇండియా కూటమి అన్ని స్థాయిల్లో మరింత బలోపేతం కావల్సిఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ మూడ్‌ నాల్గవ అంశం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం స్థానంలో టీడీపీి-బీజేపీ కలయిక మరో మైలురాయి. అయితే తమిళనాడు, కేరళలో సైతం బీజేపీ తన ఉనికిని స్వల్పంగా మెరుగుపరుచుకుంది. కర్ణాటకలో, 2019 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ తన ఎంపీల సంఖ్యను పెంచుకోగలిగింది. అయితే బీజేపీ-జేడీ(ఎస్‌) కలయిక ప్రభావవంతంగా ఉంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ని బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ దెబ్బతీశాయి. ఒడిశాలో మళ్లీ ప్రాంతీయ బీజేడీని ఎన్నికల్లో బీజేపీ ఓడిరచింది. బీజేపీ చేతిలో ఓ ప్రాంతీయ పార్టీ ఓటమి ఊహించని పరిణామం. ప్రాంతీయ పార్టీల విషయంలో టీడీపీ భారీగా లాభపడగా, వైఎస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్‌, బీజేడీ ఓడిపోయాయి. కానీ మొత్తం మీద, ప్రాంతీయ పార్టీలు అనేక రాష్ట్రాల్లో దూసుకెళ్లాయి. 18వ లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డీఏ ఓట్ల శాతం 46 శాతంకాగా, 2019నాటి గణాంకాల కంటే 2శాతం తక్కువగా ఉంది. 2024 ఎన్నికలలో ఇండియా కూటమి ఓట్ల శాతం 41శాతంతో 8శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్రచారం చివరి రోజుల్లో మోదీ స్థాయి తగ్గడం బీజేపీ ఓట్ల తగ్గుదలకు మరో ప్రధానకారణం. ప్రాంతీయ పార్టీలలో పశ్చిమ బెంగాల్‌లో, తృణమూల్‌ కాంగ్రెస్‌ 2019 నాటి సంఖ్యను 9 నుండి 10 సీట్లతో మెరుగుపరుచుకుంది. టిఎంసి తన ఓట్ల వాటాను 47 శాతానికి మెరుగుపరుచుకుంది. 2024 ఎన్నికలలో 4శాతం పెరుగుదల నమోదైంది. బీజేపీ ఓట్ల శాతం 3 నుండి 37 శాతానికి తగ్గింది. టీఎంసీ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్‌ వామపక్షాల కలయికను ఓడిరచి టీఎంసీ తన సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. వాస్తవానికి 2024 ఎన్నికలలో ఇండియా కూటమి అధికారానికి చాలా దగ్గరగా ఉంది. 2024 మరొక 2004 అయి ఉండాల్సింది. కానీ అది ఇంకా జరగలేదు. పరిస్థితిని నిజాయితీగా అంచనా వేయడానికి, సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి ఇండియాకూటమి నాయకులు సమావేశం అయ్యారు. నరేంద్రమోదీ స్థాయి తగ్గిపోతున్న తరుణంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సభ్యుల ఐక్యతను బలోపేతం చేయడమే వారి ముందున్న తక్షణ ప్రధాన కర్తవ్యం. శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వంటి అనుభవజ్ఞులు ఎన్‌డిఎ భాగస్వాములైన టీడీపీి, జెడీ(యు), షిండే శివసేన వంటి వారితో సంకీర్ణ భాగస్వామ్యంకోసం ప్రయత్నించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img