Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

బెంగాల్‌లో బీజేపీకి మరో భంగపాటు

శంకర్‌ రే

ఈ ఉప ఎన్నికల విజయాలు జాతీయ రాజకీయాల్లో తృణమూల్‌ ప్రాధాన్యతను మరింత పెంచాయి. కాషాయ మూకల వ్యతిరేక పార్టీలను ఒక్క దగ్గరకు చేర్చే నిర్ణయాత్మకమైన నాయకుల్లో ఒకరిగా మమతా బెనర్జీ గుర్తింపును ఇంకాస్త పెంచాయి. నియంతృత్వ ధోరణులు అనుసరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఫాసిస్టు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పోరాటానికి తనకున్న ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాన్ని మమతా బెనర్జీ మరోమారు నిరూపించుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు 7 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో గుర్తించాల్సిన ప్రాధాన్యతాంశాలు రెండు ఉన్నాయి. ఊహించినదానికంటే గొప్ప విజయాన్ని తృణమూల్‌ అందుకోవడానికి ఉపకరించిన రెండు అంశాల్లో ఒకటి మహిళల ఓట్లు అధికంగా రావడం కాగా కాషాయ ఓటు బ్యాంకుగా ఉన్న ‘మతువా’ కులస్తులు దాన్నుంచి బయటపడడం. దినహతలో ప్రమాణిక్‌, శాంతిపూర్‌లో సర్కార్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడానికి కారణం ఈ మతువాల ఓట్లే.

మతతత్వ పోకడలతో జనాన్ని ముప్పతిప్పలు పెడుతున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్‌లో మరోమారు భంగపాటు ఎదురైంది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ పార్టీని ప్రజలు ఛీ కొట్టారు. తద్వారా మతోన్మాద సంకుచిత రాజకీయాలు ఇక్కడ చెల్లవని గట్టి సందేశాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కాషాయదళాలు, బీజేపీ మత పన్నాగాలు పారవని గట్టి చెంపదెబ్బ కొట్టినట్టుగా స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఉప ఎన్నికల్లోనూ తృణమూల్‌ కాంగ్రెస్సే పూర్తి ఆధిక్యతను కనబర్చింది. భారీ ఓట్ల మెజారిటీతో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడానికి మరో గట్టి కారణమూ ఉంది. అదే పెట్రోలు, వంట గ్యాసు మొదలుకుని ఇంధన ధరలను అడ్డూ అదుపూ లేకుండా పెంచేయడం. బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కాపాడుకోవడానికీ పోరాడాల్సిన అగత్యంలో పడేలా బెంగాల్‌ ప్రజలు తమ ఓటు తీర్పు ఇచ్చారు. నాలుగు స్థానాల్లోనూ సగటున తృణమూల్‌ కాంగ్రెస్‌ 75 శాతం ఓట్లు సంపాదించింది. ఈ పార్టీ తీసుకొచ్చిన సామాజిక సంక్షేమ పథకాలు ప్రజలను బాగానే ఆకట్టుకున్నాడనడానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో మత కల్లోలం నేపథ్యంలో తమ పార్టీ శాంతిపూర్‌ నియోజకవర్గంలో సాధించిన ఓట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ ఓట్లతో ఘన విజయం సాధిస్తుందన్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సుబేందు అధికారి విషగర్వాన్ని, మత పిచ్చిని బెంగాల్‌ ప్రజలు తమదైన తీర్పుతో అణిచేశారు. బీజేపీ హిందూత్వ రాజకీయాలను తిప్పికొట్టారు. మతం పేరుతో ఓట్లు రాబట్టుకోవాలనే దురాశతో సుబేందు అధికారి బాధ్యతారాహిత్యంగా చేసిన ప్రకటనపై ఇప్పుడు బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకులు మల్లగులాలు పడుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బ్రజ కిషోర్‌ గోస్వామి 63,800 ఓట్ల తేడాలతో బీజేపీ అభ్యర్థిని ఓడిరచారు. ఇదే స్థానంలో ఐదు నెలల క్రితం బీజేపీ అభ్యర్థి జగన్నాథ్‌ సర్కార్‌ 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. శాంతిపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన రాణాఘాట్‌ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో సర్కార్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికల విజయాలు జాతీయ రాజకీయాల్లో తృణమూల్‌ ప్రాధాన్యతను మరింత పెంచాయి. కాషాయ మూకల వ్యతిరేక పార్టీలను ఒక్క దగ్గరకు చేర్చే నిర్ణయాత్మకమైన నాయకుల్లో ఒకరిగా మమతా బెనర్జీ గుర్తింపును ఇంకాస్త పెంచాయి. నియంతృత్వధోరణులు అనుసరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఫాసిస్టు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పోరాటానికి తనకున్న ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాన్ని మమతా బెనర్జీ మరోమారు నిరూపించుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు 7 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో గుర్తించాల్సిన ప్రాధాన్యతాంశాలు రెండు ఉన్నాయి. ఊహించినదానికంటే గొప్ప విజయాన్ని తృణమూల్‌ అందు కోవడానికి ఉపకరించిన రెండు అంశాల్లో ఒకటి మహిళల ఓట్లు అధికంగారావడం కాగా కాషాయఓటు బ్యాంకుగా ఉన్న ‘మతువా’ కులస్తులు దాన్నుంచి బయటపడడం. దినహతలో ప్రమాణిక్‌, శాంతిపూర్‌లో సర్కార్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడానికి కారణం ఈ మతువాల ఓట్లే.
నాలుగు స్థానాలకు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న స్థానం దినహత. ఇక్కడ పోటీ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉదయాన్‌ గుహ మునుపెన్నడూ చూడని గొప్ప విజయాన్ని అందుకుని రికార్డు సృష్టించారు. బీజేపీ అభ్యర్థి అశోక్‌ మండల్‌ను 1,63,089 భారీ ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిరచారు. అత్యధిక ఓట్ల తేడాతో ఘన విజయం అందుకున్న రికార్డు ఇంతకుముందు తృణమూల్‌ అభ్యర్థి మహ్మద్‌ అబ్దుల్‌ ఘనీ పేరుతో ఉంది. ఆయన ఈ ఏడాది జరిగినఎన్నికల్లోనే 1,30,000ఓట్లు తేడాతో విజయం సాధించారు. అంతకంటే ముందు 2001లో సీపీఎంకు చెందిన మందరాణి దాల్‌ 1,08,000 ఓట్ల తేడాతో గెలిచి రికార్డు నెలకొల్పారు. ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో గుహ కేవలం 57 ఓట్ల తేడాతో నిషిత్‌ ప్రమాణిక్‌ చేతిలో ఓడిపోయారు. నిషిత్‌ ప్రస్తుతం కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థితరపున ప్రధాన ప్రచారకర్తగా వకాల్తా పుచ్చుకున్న ప్రమాణిక్‌ తలఎత్తలేని స్థాయిలో ప్రజలు అతనికి అవమానకరమైన ఓటమిని ఇచ్చారు. గుహకు రికార్డు విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం పోలైనఓట్లలో కనీసం పావు వంతు కూడా ప్రమాణిక్‌ తన పోలింగ్‌బూత్‌లో సాధించలేక పోయారు. మండల్‌దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఖర్దా స్థానంలో తృణమూల్‌ అభ్యర్థి శోభన్‌ దేవ్‌ చటోపాధ్యాయ్‌ ఇంతకుముందు ఇక్కడ తృణమూల్‌ అభ్యర్థిగా ఉన్న కాజల్‌ సిన్హా కంటే 28 వేల ఓట్లు అధికంగా పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగిన రెండు రోజులు తర్వాత కాజల్‌ సిన్హా ఆకస్మికంగా మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక అవసర మైంది. తృణమూల్‌ ఎమ్మెల్యే జయంత నస్కార్‌ మరణం కారణంగా ఉప ఎన్నికలు జరిపిన గోసబ నియోజకవర్గంలో తృణమూల్‌ అభ్యర్థి సుబ్రత మండల్‌ కూడా భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img