Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బ్రిటన్‌లో లేబర్‌పార్టీ ముందంజ

బెన్‌ చాకో

బ్రిటన్‌ పార్లమెంటుకు జరగనున్న ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ముందంజలో ఉన్నదని తాజా సర్వే తెలియజేస్తోంది. అకస్మికంగా జనరల్‌ ఎన్నికలను ప్రధానమంత్రి రిషి సునాక్‌ బుధవారం ప్రకటించారు. టోరీల పాలనలో 14ఏళ్లపాటు ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. జులై 4వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. దీనికి ఒక వారం ముందు ప్రస్తుత పార్లమెంటు రద్దవుతుంది. లేబర్‌పార్టీ 20శాతం ముందంజలో ఉందని సర్వే వెల్లడిరచింది. దేశంలో ద్రవ్యోల్బణం 2.3శాతానికి పడిపోవడంతో ప్రధానమంత్రి ఆందోళనకు గురయ్యారు. తిరిగి ఎన్నికలు జరిగితే తనకు అనుకూలంగా ఉంటుందని ప్రధాని సునాక్‌ భావించారు. అధికారిక సర్వేప్రకారం ప్రభుత్వం తిరిగి గెలుపొందుతుందని అంచనాలున్నాయి. నాలుగేళ్ల క్రితం సెలవుల పథకాన్ని ప్రకటించి అమలు చేశారు. అలాగే ఆర్థిక సుస్థిరత సాధించామని ప్రకటించారు. 1997లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌పార్టీ విజయం సాధించింది. లేబర్‌పార్టీ పాలనలో పరిస్థితులు మెరుగవుతాయని ఆశించారని అయితే మెరుగుపడలేదని సునాక్‌ అన్నారు. సునాక్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం నేడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నదని చెప్పారు. తనకు స్టార్మర్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీల మధ్య పోరు జరగనుందని అన్నారు. గతంలో టోరీల ప్రభుత్వం అక్టోబరు లేదా నవంబరు వరకు కొనసాగుతుందని భావించారు. అయితే ఇందుకు భిన్నంగా కామన్స్‌ పార్టీ రోజువారీ కార్యకలాపాలను పరిశీలించి ఎన్నికలను ప్రకటించారు. ఆకస్మికంగా ఎన్నికలు జరపాలని సునాక్‌ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. వలసవచ్చినవారిని రువాండాకు విమానాల ద్వారా తిరిగి పంపాలని భావించినప్పటికీ అది ఇంతవరకు సాధ్యంకాలేదు.
ఈ సారి తమకు భారీ మెజారిటీతో గెలుపు సాధ్యమవుతుందని లేబర్‌ పార్టీ సంతోషం వ్యక్తంచేస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. భారీ మెజారిటీతో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని లేబర్‌పార్టీ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. గత వారం లేబర్‌పార్టీ నాయకుడు సిర్‌కెయి విజయం సాధిస్తామని ప్రకటించారు. వామపక్ష ఎంపీ జాన్‌ మెక్‌డొనాల్డ్‌ ఇలా చెప్పారు. ‘‘మార్పునకు ఇది సమయం. 14ఏళ్ల కన్సర్వేటివ్‌ ప్రభుత్వం సమాజాన్ని తీవ్రంగా దిగజార్చింది. మా పాఠశాలలను, కాలేజీలను, వాతావరణాన్ని, ఆర్థికస్థితిని దిగజార్చింది.’’ టోరీ ఎంపీలలో అనేకమంది సునాక్‌ ఎన్నికల వ్యూహాన్ని సందేహిస్తున్నారు. ప్రధాని తీసుకున్న చర్యలు అప్రతిష్ట పాలయ్యాయని, పార్టీని ముందుకు నడిపిస్తున్న ప్రధాని పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నారన్నారని టోరీ ఎంపీ ఒకరు పేర్కొన్నారు. లేబర్‌పార్టీ టోరీలకంటే 20శాతం ఆధిక్యతలో ఉన్నట్లుగా ప్రజాభిప్రాయం తెలియజేస్తోంది. రానున్న నెలల్లో టోరీల పరిస్థితులు మెరుగవుతాయని చెప్పేందుకు ఎలాంటి ఆస్కారంలేదు. ఆర్థిక పరిస్థితి సరిగా లేదని జరగనున్న ఎన్నికలే స్షష్టం చేస్త్తున్నాయి. గత 14ఏళ్లుగా జీవన ప్రమాణాలు ఎక్కడవేసిన గొంగళి లాగా అక్కడే ఉన్నాయి. ప్రజలుచేసే ఖర్చులను చూస్తేనే ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం పడిపోవడంతో జీవనం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టోరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పౌల్‌ నొవాక్‌ ఇలా చెప్పారు. ‘‘జీవన వ్యయ సంక్షోభం ఇంకా పూర్తిగా తొలగలేదు. ప్రతిరోజూ ప్రజలు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చేఆదాయం తమ అవసరాలు తీర్చుకునేందుకే పోరాటం జరుపుతున్నారు’’ అని అన్నారు.
ఈ సంవత్సరం జీవనప్రమాణాలు మరింత పడిపోయాయని 58శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. టోరీల 14ఏళ్ల పాలన ప్రజలకు అధ్వాన్నమైన పరిస్థితులను కల్పించింది. ఆదాయం రోజురోజుకూ తగ్గిపోతూ ప్రజలు అప్పుల పాలయ్యారు. గాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం దాడిచేసి ప్రజలను అతిక్రూరంగా చంపుతుంటే బ్రిటీష్‌ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంపై ప్రజలు తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నారు. ఇజ్రాయిల్‌కు మద్దతు తప్పనిసరిగా ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది. వామపక్ష లేబర్‌పార్టీ అకస్మిక ఎన్నికలు స్టార్మర్‌ నాయకత్వంలో జరిగితే నష్టం కలగజేస్తుందేమోనని వామపక్ష లేబరుపార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసంతృప్తిని కొందరు నాయకులు ప్రకటిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లేబర్‌పార్టీ నాయకుడు జర్మీ కార్బిన్‌ను నాయకుడిగా మినహాయించారు. కార్బిన్‌కి ప్రజలలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపధ్యంలో ఇస్లింగ్టన్‌ నియోజకవర్గంనుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని గత వారం కార్బిన్‌ ప్రకటించారు. లేబర్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పార్టీ అనుమతించలేదు. పార్టీకి చెందిన మరో యువ నాయకురాలు లిన్నే మహమ్మద్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆమె పలస్తీనాకు చెందిన వారు. కటే దోవ్‌ ఇలాచెప్పారు ‘‘మనం టోరీలను ఓడిద్దాం…14ఏళ్ల కన్సర్వేటివ్‌పార్టీ అనుసరించిన పొదుపు విధానాలు బ్రిటన్‌ను ధ్వంసంచేశాయి. మనం ప్రజలకుచేస్తున్న సేవలు, ఎన్‌హెచ్‌ఎస్‌ విధానాలు నిధుల లభ్యతను దెబ్బతీశాయి. ప్రైవేటీకరణ చేసిన నీటి సరఫరా కలుషితమై వస్తోంది. ఇళ్ల లభ్యత సంక్షోభం పెరిగింది. కొద్దిమంది సంపన్నులు సంతోషంగా బ్యాంకుకు వెళ్లగలగుతున్నారు. ట్రేడ్‌యూనియన్‌ ఉద్యమం నిలకడగాఉంది. ప్రజలు ముందుగా రిషిసునాక్‌ను డౌనింగ్‌స్ట్రీట్‌ నుండి నెట్టివేయాలని ఇదే తమ ప్రథమ కర్తవ్యమని భావిస్తున్నారు. లేబర్‌పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించనట్లయితే మన రైల్వేలను తిరిగి ప్రభుత్వరంగ సంస్థగా మార్చుకుంటాము. అలాగే శ్రమజీవులతో కొత్త ఒప్పందాన్ని చేసుకుని అమలుచేస్తాం. దేశంలో సమ్మిళితమైన సామాజిక, ఆర్థిక మార్పును తీసుకురావడానికి ప్రధమ చర్యలను చేపడతాం. టోరీలను ప్రభుత్వంనుండి దింపివేసేందుకు ప్రజలను సమీకరించడమే మన లక్ష్యం అని సోషలిస్టు, ట్రేడ్‌యూనియన్‌లు నడిపే లేబర్‌పార్టీ ఎంపీలు జరాప్‌ాసుల్తానా నుంచి లాన్‌ లవేరి వరకు, జాన్‌ మక్‌డెనాల్డ్‌ నుంచి అప్సనా బేగం వరకు నాయకులు ప్రముఖపాత్ర వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img