Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మనం మరిచిన మరో గాంధీ`ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌

రెండు శతాబ్దాల బ్రిటిష్‌ వారి వలస పాలన నుండి భారతదేశ విముక్తికి పోరాటం చేసిన ఎందరో మహనీయులు అఖండ భారతావనిలో కుల,మత, ప్రాంతంతో పని లేకుండా యావత్‌ భారత్‌దేశ స్వతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుడు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌. అహింసను అనుసరించి గాంధీజీ సత్యాగ్రహ బాటలో ప్రయాణించిన మహనీయుడు మన గఫార్‌ ఖాన్‌(సరిహద్దు గాంధీ). పార్టీ అధ్యక్ష పదవిని త్వజించి, ప్రజాసేవయే పరమార్ధంగా ఐక్య భారత్‌ కోసం ఆంగ్లేయులను ఎదిరించిన భారతదేశ రెండవ గాంధీ, ఖాన్‌ అబ్దుల్‌్‌ గఫార్‌ ఖాన్‌. తమను పాకిస్తాన్‌లో కలుపుతుంటే తోడేళ్లకు మమ్ములను వదిలేస్తున్నారు అంటూ ఆవేదన చెందిన వ్యక్తి గఫార్‌ ఖాన్‌. ఆయన కన్నుమూసిన రోజున దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది సరిహద్దులు చెరిగిపోయాయి. ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ ఖుదాయ్‌ ఖిద్మత్‌గార్‌ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్‌ పాలన నుండి భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రముఖ నాయకుడు. 1890 ఫిబ్రవరి 6న ఉస్మాన్‌ జాయీ పెషావర్‌ వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో జన్మించిన ఖాన్‌, గాంధీజీ అహింసాత్మక పోరాటాలకు ప్రేరణ పొంది, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1915-1918 మధ్య 500 గ్రామాలను పర్యటించి విద్యా సామాజిక ఆవశ్యకతను తెలియజేశారు. 1929 లో ఖుదాయ్‌ ఖిద్మత్‌గార్‌ (దేవుని సేవకులు) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ హింసాత్మకతకు వ్యతిరేకంగా పోరాడటానిక, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడానికి పనిచేసింది.1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఖాన్‌ అరెస్ట్‌ అయ్యారు. అయినప్పటికీ దేశానికి స్వాతంత్య్రం వచ్చేంతవరకు తన పోరాటం ఆగలేదు. 1942 లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మళ్లీ అరెస్ట్‌ అయ్యారు. 1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఖాన్‌ పాకిస్తాన్‌లో ఉండి, అక్కడ ప్రజాస్వామ్య స్థాపన కోసం బలమైన పోరాటం చేశారు. గఫార్‌ ఖాన్‌ సిద్ధాంతాలు హింసాత్మకతకు వ్యతిరేకంగా, అహింసాత్మక పోరాటాలకు బలమైన మద్దతు ఇచ్చారు. ఖాన్‌ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం చేశారు. మత సామరస్యాన్ని బలంగా నమ్మిన వ్యక్తి ఖాన్‌. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక ముఖ్యమైన నాయకుడు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం చేసిన యోధుడు. ఖాన్‌ 1988లో పాకిస్తాన్‌లో మరణించారు. అఖండ భారత్‌ను ప్రేమించిన నాయకుడు దేశ విభజనను వ్యతిరేకించి ఎర్ర చొక్కాల ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రముఖుడు, జాతీయవాది, భారతరత్న పొందిన మొదటి భారతేతరుడు. గాంధీ, నెహ్రూలకు అత్యంత ప్రీతిపాత్రుడు సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం.
(ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ జయంతి సందర్భంగా)
పూసపాటి వేదాద్రి
9912197694

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img