Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మన రక్షణ వ్యవస్థ బలోపేతం

భారత్‌ అమ్ముల పొదిలోకి అధునాతన ఆయుధాలు జలమార్గాల్లో మెరుగుపడనున్న నిఘా సహకారానికి అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. మన దేశానికి పక్కలో బల్లెంలా మారిన పాక్‌, చైనా లాంటి దేశాలకు దడ పుట్టించే ప్రిడేటర్‌ డ్రోన్స్‌ దూసుకొస్తున్నాయి. భారత్‌ చేతిలో ఈ డ్రోన్స్‌ అస్త్రాలు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించనున్నాయి. భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా ఈ శెభవార్త అందించింది. భారత్‌కు 31 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్‌ ప్రభుత్వ యంత్రాంగం ఆమోదం తెలిపింది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగనుంది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) పేర్కొంది. ఈ నిర్ణయంతో దాదాపు 4 బిలియన్‌ డాలర్లు విలువైన భారీ ఒప్పందానికి ముందడుగు పడిరది. అమెరికా నుంచి కొనుగోలుచేసే డ్రోన్ల వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. తద్వారా జల మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. గత ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంక్యూ-9బీ డ్రోన్ల ఒప్పందంపై ప్రకటన చేశారు. ‘‘మానవరహిత విమానాలను భారత్‌కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. రెండు దేశాల వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయాలన్న జాతీయ భద్రతా లక్ష్యాలను నెరవేరుస్తుంది. మన ప్రధాన రక్షణ భాగస్వామి, ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుందని అమెరికా డీఎస్‌సీఏ వెల్లడిరచింది. ప్రతిపాదిత విక్రయం సముద్ర మార్గాలలో మానవ రహిత నిఘా, నిఘా పెట్రోలింగ్‌ చేపట్టడం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు బెదిరింపులను ఎదుర్కోగల భారత్‌ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. భారత్‌ తన మిలిటరీని ఆధునీకరించడంలో నిబద్ధతను ప్రదర్శించింది. ఈ లోహవిహంగాలు, సేవలను తన సాయుధ దళాలలోకి చేర్చుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం : భారత్‌కు 31 సాయుధ ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్‌లను అమ్మే ఒప్పందానికి అమెరికా విదేశీ వ్యవహారాలశాఖ ఆమోదం తెలిపింది. ఈ డ్రోన్లతోపాటు వీటికి అమర్చే క్షిపణులు, ఇతర నిఘా పరికరాలను కూడా భారత్‌కు అందివ్వనున్నట్లు అమెరికా రక్షణశాఖ తెలిపింది. సుమారు రూ.33 వేల కోట్ల (నాలుగు బిలియన్‌ డాలర్ల) విలువైన ఈ ఒప్పందంపై చాలా ఏళ్లుగా భారత్‌, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. సైనిక అవసరాల కోసం ఈ డ్రోన్‌ల కొనుగోలుపై భారత్‌ 2018 నుంచి ప్రత్యేక ఆసక్తి కనబరిచింది. ఆయుధాల కొనుగోళ్లలో రష్యాకు దగ్గరవుతున్న భారత్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నంగా అమెరికా ఆమోదాన్ని చూస్తున్నారు. డ్రోన్ల కొనుగోలుకు అమెరికా సమ్మతి లభించడంతో భారత్‌కు పెద్ద అడ్డంకి తొలగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఒప్పందానికి సమ్మతి తెలపాలంటే, ‘‘అమెరికాలో సిక్కు వేర్పాటువాద నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్ర’’పై భారత్‌ దర్యాప్తు చేయాలని అమెరికా చట్టసభ సభ్యులు గత సంవత్సరం డిమాండ్‌ చేశారు. హత్య కుట్ర విచారణకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో తమ వైఖరిని మార్చుకున్నామని డెమొక్రటిక్‌ ఎంపీ బెన్‌ కార్డిన్‌ చెప్పారు. డ్రోన్ల విక్రయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ గురువారం అక్కడి పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ డ్రోన్ల కాంట్రాక్ట్‌ను ‘జనరల్‌ అటమిక్స్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్స్‌’ కంపెనీకి అప్పగించినట్లు పెంటగాన్‌ తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌కు 31 సాయుధ ఎంక్యూ -9బీ స్కైగార్డియన్‌ డ్రోన్‌లు, కమ్యూనికేషన్‌, నిఘా పరికరాలు అందించనున్నారు. వీటిలో 170 ఏజీఎం-114ఆర్‌ హెల్‌ఫైర్‌ క్షిపణులు, చిన్న వ్యాసం గల 310 లేజర్‌ బాంబ్‌లు, కచ్చితత్వంతో పనిచేసే గ్లైడ్‌ బాంబులు కూడా ఉన్నాయి. భారత్‌ పంపించే ఎల్‌వోఆర్‌కు అమెరికా కాంగ్రెస్‌ స్పందించి ఫారెన్‌ మిలటరీ సేల్స్‌ కార్యక్రమం కింద లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్సీ (ఎల్‌వోఏ) జారీ చేస్తుంది. మరో వైపు భారత్‌లో భద్రతా వ్యవహారాలపై కేంద్ర కమిటీ ఆమోద ముద్ర వేశాకే జనరల్‌ అటమిక్స్‌తో తుది ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ కంపెనీ భారత్‌లో మరమ్మతులు, నిర్వహణ, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టుపై సంతకం చేసిన తొలి రెండేళ్లలోనే కనీసం 10డ్రోన్లను అందుకొనే అవకాశం ఉందని భారత్‌ ఆశిస్తోంది. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు కొన్ని డ్రోన్లు చొప్పున దళాల్లో చేర్చే అవకాశం ఉందని రక్షణశాఖ అంచనా వేస్తోంది.

  • ఇస్కా రాజేష్‌ బాబు, 9397399298

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img