Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మహా పంచాయత్‌ జయప్రదం చేయాలి

కె.వి.వి. ప్రసాద్‌

పంటలకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ, మార్చి 14వ తేదీన న్యూదిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ను నిర్వహించనున్నారు. రైతు, కార్మిక ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు ఈ మహాపంచాయత్‌ జరుగుతోంది. వేలాదిమంది రైతులు, కార్మికులు పాల్గొని మోదీ కళ్లు తెరిపించి డిమాండ్‌ చేయాలని కిసాన్‌ సంయుక్త మోర్చా, కార్మిక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.2021లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ నల్లచట్టాల రద్దు కోసం రైతాంగం 13 మాసాలపాటు నిర్వహించిన చారిత్రాత్మకమైన పోరాట విరమణ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రైతాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ మార్చి 14న మహాపంచాయత్‌ నిర్వహించాలని కిసాన్‌ సంయుక్త మోర్చా, కేంద్ర కార్మిక, ప్రజాసంఘాల సమన్వయ సమితులు నిర్ణయించాయి. న్యూ దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మార్చి 14న జరిగే భారీ కిసాన్‌ మజ్దూర్‌ బహిరంగ సభ జరగనుంది. మహాపంచాయత్‌ జయప్రదం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి రైతులు, కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయా సంఘాల నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 22న దిల్లీిలో పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, హర్యానా, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన 100 మందికిపైగా రైతుసంఘాల ప్రతినిధులు పాల్గొని ఐక్య కార్యాచరణ రూపొందించారు. 14వ తేదీకి ముందుగా అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించి కిసాన్‌ మహాపంచాయత్‌కు తరలి రావాల్సిన ఆవశ్యకతను తెలియచేప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 26 నుండి 29 వరకు అబూదాబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.) సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 26న క్విట్‌ డబ్ల్యుటీఒ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు. రైతు, కార్మిక, ప్రజాసంఘాల కార్యకర్తలతోపాటు ప్రజానీకం పెద్దయెత్తున పాల్గొన్నారు. పల్లె నుండి దిల్లీ దాకా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. డబ్ల్యు.టి.ఒ. నుండి వ్యవసాయాన్ని దూరంగా ఉంచాలని భారతదేశ ఆహార భద్రతను తాకట్టుపెట్టే చర్యలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, రైతుల రుణభారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఒక్క పర్యాయం రుణమాఫీ చేయాలని, రుణవిమోచన చట్టం తేవాలని అభివృద్ధి చెందిన దేశాలు డిమాండు చేస్తున్న విధంగా సుంకాలను తగ్గించడం ద్వారా మార్కెట్‌ ఎగుమతిదారులకు అందుబాటును పెంచే ప్రతిపాదనలను భారత ప్రభుత్వం వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా భాగస్వామ్య సంఘాలు డిమాండు చేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం దక్కించుకోవాలనే తపనతో ప్రముఖ రైతు నాయకులు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌, ప్రముఖ వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్త డా॥ యం.యస్‌. స్వామినాథన్‌లకు భారత రత్న పురస్కారాలను ఇచ్చింది. కానీ దేశ రైతాంగం కోరుతున్న గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం, రుణ మాఫీ, వ్యవసాయ సబ్సిడీల కొనసాగింపు తదితర డిమాండ్లతోపాటు రైతు చట్టాల ఉపసంహరణ సందర్భంగా కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేసేందుకు సిద్ధంగా లేదు. గతంలో రైతాంగ ఆత్మహత్యలను నిరోధిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలులాంటి వాగ్దానాలను మోదీ అటకెక్కించారు. రైతుల మనసుల్లో మోసకారిగా ముద్ర వేసుకున్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే జీతగాడిగా మారిపోయారు. ఈ దశలో రైతులకిచ్చిన హామీల అమలుకోసం కిసాన్‌ సంయుక్త మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక కేంద్ర ప్రభుత్వ దుర్నీతిని ఎండగడుతూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. వివిధ దశలలో ఆందోళనలు కొనసాగుతున్న నేపధ్యంలో కొన్ని రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో దిల్లీ నిర్వహించాయి. రైతులు దిల్లీకి రాకుండా మోదీ నరహంతక ప్రభుత్వం మరోమారు హర్యానా సరిహద్దుల్లోనే రైతాంగాన్ని నిలిపివేసింది. రైతుల ఉద్యమంపై అవాకులు, చెవాకులు పేలుతూ రహదారులపై పలు రూపాల్లో అడ్డంకులు సృష్టించింది. శాంతియుతంగా సమస్యను పరిష్కరిద్దామన్న మంచి మనసు మోదీ ప్రభుత్వానికి లేక పోవడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హర్యానా ప్రభుత్వం రైతాంగంపై దమనకాండకు పూనుకొని కాల్పులు జరిపింది. పంజాబ్‌కు చెందిన యువ రైతు శుభకరణ్‌ సింగ్‌ నేెలకొరిగారు. మరో నలుగురు రైతులు ఉద్యమస్థలిలో గుండెపోటుతో మరణించారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. అనేక ట్రాక్టర్లు పోలీసులు జరిపిన దాడిలో ధ్వంసమయ్యాయి. మొదటి దశ ఉద్యమంలో సుమారు 740 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వేలాదిమంది రైతులపై కేసులు పెట్టబడ్డాయి. అయినా నరేంద్రమోదీ కార్పొరేట్‌ గుండె ఏ మాత్రం కరగలేదు. చలించలేదు. ఇక మిగిలింది రైతులకు పోరాటమే మార్గం.
ఏపీ రైతు సంఘం ప్రధానకార్యదర్శి, సెల్‌:9490952737

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img