Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

మానవ హక్కుల యోధ

మన న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొంతమంది వ్యవహరిస్తు న్నారని, ఇంతకు ముందున్నది స్వర్ణయుగం అని వాదిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ 600 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాయడం పెద్ద వివాదానికి దారి తీసింది. న్యాయ స్థానం తీర్పులను ప్రభావితం చేయ డానికి, న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసం చెదిరి పోయేలా చేయడానికి ఇలా చేస్తున్నారని ఈ లేఖలో ఆరోపించారు. ఈ లేఖ మీద సంతకం చేసిన వారిలో ప్రసిద్ధ న్యాయవాది హరీశ్‌ సాల్వే, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మనన్‌ కుమార్‌ మిశ్రా కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. న్యాయ స్థానంలో బెంచీలను ఏర్పాటు చేయడంలో ఏదో మాయ జరుగుతోందని ఆరోపిస్తూ అలాంటి వారిని ఈ లేఖలో దుయ్యబట్టారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే వీరు ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతోంది. ఇలాంటివారి వైఖరిని ఖండిస్తూ ప్రసిద్ధ మానవ హక్కుల న్యాయవాది ఇందిరా జై సింగ్‌ ‘‘ది వైర్‌’’, ‘‘ది ఇండి యన్‌ ఎక్స్‌ ప్రెస్‌’’ లో రెండు వ్యాసాలు రాశారు. ఇందిరా జైసింగ్‌ ఈ లేఖ వెనక ఉన్న బండారాన్ని బయట పెట్టారు. ఇందిరా జై సింగ్‌ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడేవారే. ఆమె లాయర్స్‌ కలెక్టివ్‌ అని ఓ సంఘం నిర్వహిస్తున్నారు. ఇది స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ లైసెన్సును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. విదేశీ విరాళాల నియం త్రణా చట్టాన్ని లాయర్స్‌ కలెక్టివ్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించి 2019లో లైసెన్సు రద్దు చేశారు. బొంబాయి హైకోర్టు లైసెన్సును రద్దు చేయడాన్ని నిలిపివేస్తూ తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకుంది. ఆ కేసు ఇప్పటికీ విచారణ లోనే ఉంది. ఇందిరా జైసింగ్‌ అణగారిన వర్గాల తరఫున నిలబడతారు. మహిళా పక్షపాతి. 1986లోనే ఆమెను బొంబాయి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా గుర్తిం చింది. 2009లో ఆమె అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌గా నియమితు లయ్యారు. ఈ స్థానంలో నియమితులైన మహిళల్లో ఆమే మొదటి వారు. ఆమె న్యాయవాద వృత్తి చేపట్టినప్పటి నుంచీ మానవ హక్కుల, మహిళా హక్కుల పరిరక్షణకోసం పోరాడుతూనే ఉన్నారు. మహిళలపై వివక్ష చూపడాన్ని ఆమె ఎప్పుడూ సహించలేదు. మేరీ రాయ్‌ కేసులో ఆమె న్యాయవాది. ఆమె వాదన నెగ్గినందువల్లే కేరళలో క్రైస్తవ మహిళలకు సమానమైన వారసత్వ హక్కులు దక్కాయి. మహిళల విషయంలో ప్రసిద్ధ పోలీసు అధికారి కేపీఎస్‌ గిల్‌ హద్దు మీరి ప్రవర్తించినప్పుడు ఐఏఎస్‌ అధికారి రూపన్‌ డియోల్‌ బజాన్‌ తరఫున వాదించింది కూడా ఇందిరా జైసింగే. కేపీఎస్‌ గిల్‌ పై చట్టరీత్యా చర్య తీసుకోవలసి రావడం జై సింగ్‌ వాదన ఫలితమే. లైంగికంగా వేధించిన వారికి శిక్ష పడేట్టు చేసిన మొట్ట మొదటి ఉదంతం ఇదే. తండ్రి ఎలాగైతే పిల్లలకు సంరక్షకుడో తల్లి కూడా సంరక్షకురాలే అన్న భావన కలగడానికి గీతా హరిహరన్‌ కేసులో జై సింగ్‌ వాదనలే ప్రధాన కారణం. మహిళలు క్రౌర్యానికి గురైనప్పుడు, భర్త వదిలేసినప్పుడు విడాకులు తీసుకోవడానికి అవకాశం కల్పించడంలో జై సింగ్‌ అద్వితీయమైన పాత్ర పోషించారు. అంతకు ముందు కేరళలో క్రైస్తవ మహిళలకు ఈ సందర్భంలో విడాకులు తీసుకునే అవకాశం ఉండేది కాదు. తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్‌ ప్రభుత్వం వేటాడినప్పుడు ఆమె తరఫున వాదించింది కూడా జైసింగే. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదులుగా నియమించే ప్రక్రియను కూడా ఆమె సవాలు చేశారు. అవసరమైనప్పుడు సుప్రీంకోర్టుతో ఢీకొనడానికి కూడా ఇందిరా జైసింగ్‌ వెనుకాడలేదు. నూపుర్‌ శర్మ మీద మహమ్మద్‌ ప్రవక్తను అవమానించా రని అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనప్పుడు వాటన్నింటినీ ఒకే విడతలో పరిశీలిం చాలని పోరాడి సాధించిందీ జై సింగే. భోపాల్‌ గ్యాస్‌లీక్‌ బాధితుల తరఫున సుప్రీంకోర్టులో యూనియన్‌ కార్బైడ్‌ కార్పొరేషన్‌ మీద ఇందిరా జై సింగ్‌ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. పంజాబ్‌లో హింసాకాండ జరిగి నప్పుడు చట్ట విరుద్ధంగా కొనసాగే హింసాకాండను, మనుషులు అమాంతం మాయమైపోవడం, 1979 నుంచి 1990 మధ్య మూకుమ్మ డిగా అనేక మందిని సమాధిచేసిన సందర్భంలోనూ బాధితు లకు బాసటగా నిలిచింది ఆమే. మైన్మార్‌లో రొహింగ్యా ముస్లిం లను భద్రతాదళాలు హత్య చేయడం, అత్యాచారాలకు పాల్ప డడం, చిత్ర హింసలు పెట్టినప్పుడు ఐక్యరాజ్య సమితి ఇందిరా జై సింగ్‌ను నిజనిరా ్ధరణ కమిషన్‌ సభ్యురాలిగా నియమించింది. జై సింగ్‌ పర్యావరణ పరి రక్షణ కోసం చేసిన పొరాటాన్నీ విస్మరించలేెం. 1981లో ఆమె ప్రారం భించిన లాయర్స్‌ కలెక్టివ్‌ ప్రధాన ఉద్దేశం స్త్రీ వాదం, వామపక్ష వాదం, అన్నింటికన్నా ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన సంస్థే. 1986లో సామాజిక న్యాయం, భారత చట్టాల ప్రకారం మహి ళల సమస్యల మీద దృష్టి నిలపడానికి ఆమె లాయర్స్‌ మాసపత్రిక కూడా నిర్వహించారు. ఈ క్రమం అంతా చూస్తే న్యాయవాద వృత్తిలో కొన్ని మౌలిక విలువలకోసం ఆమె కొనసాగించిన పోరాటం రూపు కడ్తుంది. 2005లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం నిలబడేతత్వం ఉన్న వ్యక్తి కనకే 600 మంది న్యాయ వాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వెనక ఎవరున్నారో నిర్భయంగా బయట పెట్ట గలిగారు. చట్టాలకు సంబంధించి ఆమె అయిదారు గ్రంథాలు రాశారు.
అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img