Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మెజారిటీని కోల్పోనున్న బీజేపీ

నిత్య చక్రవర్తి

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మొదటి ఐదు దశల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 543 సీట్లలో కేవలం 115 సీట్లు మాత్రమే తదుపరి రెండు దశల్లో ఓటింగ్‌కు మిగిలి ఉన్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అగ్రనేతలందరూ బహిరంగ సభలు, టీవీ ఛానళ్లు, వార్తాపత్రికల్లో వరుస ఇంటర్వ్యూలలో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 272, మెజారిటీ మార్క్‌ దాటేసిందని, తదుపరి రెండు దశల్లో 300 ప్లస్‌ను దాటుతుంది ప్రకటిస్తున్నారు. మొదటి ఐదు దశల్లో బీజేపీకి 310కి మించిన సంఖ్యను కూడా హోం మంత్రి అమిత్‌ షా ప్రస్తావించారు. ఇండియా కూటమికి సంబంధించి, మొదటి ఐదు దశల పోలింగ్‌ పోకడలు ఎన్‌డీఏకి వ్యతిరేకంగా జరుగుతున్నాయని, ఎన్‌డీఏ మెజారిటీని కోల్పోతుందనే భావనను కలిగించింది. అయితే రాహుల్‌గాంధీ మాత్రం జూన్‌ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్నికల ప్రచారసభల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి జూన్‌ 4 తర్వాత ఇండియా కూటమి పారీటల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ జూన్‌ 3న తన తండ్రి ఎంకె కరుణానిధి జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు, డిఎంకె కార్యాలయంలోతదుపరి పరిస్థితిని చర్చించడానికి దిల్లీలోని అన్ని ఇండియా కూటమి నాయకులను ఆహ్వా నించారు. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ 200 లోక్‌సభ స్థానాలు దాటదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రచారంలో పేర్కొంటు న్నారు. జూన్‌ 4న అసలు ఏం జరుగనుంది? సుప్రసిద్ధ అమెరికా రాజకీయ శాస్త్రవేత్త, రిస్క్‌ కన్సల్టెంట్‌ ఇయాన్‌ బ్రెమర్‌ ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీకి 295 నుండి 315 సీట్ల మధ్య వస్తాయని, అంటే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. భారతదేశంలో పనిచేస్తున్న గ్లోబల్‌ కంపెనీలు, బ్యాంకులు చేపట్టిన సర్వేలో బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఐదవ దశ తర్వాత, నివేదికలు అనిశ్చితి పరిస్థితిని వ్యక్తంచేశాయి. అగ్రశ్రేణి అమెరికా సంస్థ లోక్‌సభకు హంగ్‌ వచ్చే అవకాశం ఉందని సూచించిందని,
భారతదేశం గురించి తెలిసిన అగ్రశ్రేణి పెట్టుబడి విశ్లేషకులలో, ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా విస్తృతంగా పర్యటించిన రుచిర్‌ శర్మ పరిశీలనల ప్రకారం, మొదటిది, నరేంద్ర మోదీకిగానీ, ప్రతిపక్షానికి అనుకూలంగా ఓటింగ్‌ లేదని పేర్కొన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలు రెండూ పెద్ద సంఖ్యలో మోదీ ఒరవడి సృష్టించాయి కానీ ఈసారి ఇండియా కూటమికి ప్రధాన సానుకూలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రెండవది, ప్రధానంగా దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రామమందిరంతో సహా భక్తి ఉద్యమంతోపాటు భావోద్వేగ సమస్యలు ఓటర్లలో ఉన్నాయి. అయితే ప్రజలు నిరుద్యోగం, పేదరికం, ఆరోగ్య సౌకర్యాలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంటి ఇతర ప్రత్యక్ష సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ముస్లింలను రాక్షసత్వంగా చూపడం, కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేక పార్టీగా అభివర్ణించడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రసంగాలు, మిగిలిన 115 స్థానాల్లో హిందువుల ఓట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. మూడో పాయింట్‌ ..ఇండియా కూటమిలో భాగంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో మొదటి ఐదు దశల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. ఇండియా కూటమి తరపున బీజేపీతో పోరాడుతున్న నియోజకవర్గాలలో బీజేపీపై వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని చెప్పవచ్చు. తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం, బీజేపీి ఆర్థిక, సంస్థాగత బలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తన బలాన్ని నిరూపించుకోలేకపోవడం మరో ప్రధాన సమస్య. 1996, 2004 ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల వ్యవహారం చూస్తే, 1996లో బీజేపీకి 161 సీట్లు, కాంగ్రెస్‌కు 140 సీట్లు వచ్చాయి. వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ 13 రోజుల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతాదళ్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కానీ అది కూడా 1998లో పడిపోయింది. 2004 ఎన్నికలలో, కాంగ్రెస్‌కు 145, బీజేపీకి 138 వచ్చాయి. యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రబుత్వంలో రెండు పర్యాయాలు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా కొనసాగారు.
అయితే 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల దృశ్యం కాస్త భిన్నంగా ఉంటుంది. 2004 లేదా 1996 ఎన్నికల అనంతర వ్యవహారం పునరావృతం కాదు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 303 సీట్లలో ఎన్ని సీట్లు కోల్పోతుందనేది ఇక్కడ ప్రధాన చర్చ. 2019లో మోదీ వేవ్‌లో బీజేపీకి అత్యధిక సీట్లు లభించాయి. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుందనేది స్పష్టం. ఈ సంఖ్య తగ్గినప్పటికీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది. అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 80 సీట్లను కోల్పోవాల్సి ఉంటుంది.
2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత, బీజేపీకి 282 సీట్లు, ఎన్‌డీఏకి మొత్తం 336 సీట్లు అంటే ఇతర ఎన్డీయే పార్టీలకు కలిపి మొత్తం 54 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు, ఎన్‌డీఏకు మొత్తం 353 సీట్లు వచ్చాయి అంటే బీజేపీయేతర ఎన్‌డీయే పార్టీలకు మొత్తం 50 సీట్లు వచ్చాయి. 2024 ఎన్నికలలో ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలకు తగ్గి సంఖ్య 25 నుండి 30 సీట్ల మధ్య ఉండవచ్చు. బీజేపీకి 220 లేదా అంతకంటే తక్కువ వస్తే, ఎన్‌డీఏకి వచ్చే సీట్లసంఖ్య 245 నుండి 250 సీట్లు అవుతాయి. 272 సీట్లుకావాలంటే మరో 20సీట్లుతగ్గుతాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అతిపెద్ద కూటమి అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించినా విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసిఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, బీజేడీ వంటి ఇతర పార్టీల మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమవుతుంది. ఈ రెండు పార్టీలకు ఎక్కువ కాకపోయినా మొత్తం 20 సీట్లు రావచ్చు. ఈ పార్టీల మద్దతు ఎన్‌డీఏ ప్రభుత్వం కొనసాగడానికి సహాయపడవచ్చు.
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మధ్య కొనసాగుతున్న పోరు, ప్రభుత్వ ఏర్పాటుకు హంగ్‌ ఏర్పడితే, నవీన్‌ బీజేపీతో బంధాన్ని తెంచుకుని, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వగలడని ఒక అంచనా. నవీన్‌తో ఇండియా కూటమి నాయకులు, ముఖ్యంగా స్టాలిన్‌, మమతా బెనర్జీ లాబీయింగ్‌ చేయవలసి ఉంటుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి విషయానికొస్తే, తుది ఫలితాలను బేరీజు వేసిన తర్వాత ఆయన తన వ్యూహాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి అసలు ముప్పు ఏ పార్టీతో ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా బీజేపీ-టీడీపీ కలయిక ఆయన రాజకీయ ఆధిపత్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు నాయుడుతో జగన్‌ ఎప్పుడూ ఒకే శిబిరంలో ఉండలేరు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయేకు మద్దతు ఇవ్వకపోవడానికి జగన్‌కు అనేక కారణాలున్నాయి.
కాబట్టి మొత్తం పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీన్ని అమలుచేయాలంటే బీజేపీ సంఖ్యను 220 స్థాయికి తగ్గాలి. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్న నియోజకవర్గాలలో గెలుపుకు తన శాయశక్తులా కృషి చేయాలి. చివరగా, ఇండియా కూటమిలోని ప్రాంతీయ నాయకులు జగన్‌ మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌తో సఖ్యతతో ఉంటే ఇండియా కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యేఅవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img