Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మొక్కుబడిగా అసెంబ్లీ

నీరుకొండ ప్రసాద్‌

రాష్ట్రంలోని వైసీపీి ప్రభుత్వం అయిదేళ్లుగా అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడి తంతుగా నిర్వహించింది. ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ నిర్వహించాలి కాబట్టి బడ్జెట్‌ పద్దులు, వివిధ బిల్లులు ఆమోదించుకునేందుకు మాత్రమే అసెంబ్లీ నిర్వహించారు తప్ప ప్రజాసమస్యలు చర్చించి పరిష్కారం చూపేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదు. ఐదేళ్లలో 54 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. కనీసం ఏడాదికి సగటున 30 రోజులైనా సమావేశం కాని శాసన వ్యవస్థపై అలుముకొన్న చీకట్లకు అద్దం పడుతుంది. రాష్ట్రాల చట్టసభలు ఏడాదికి కనీసం 45 నుంచి 50 రోజులు సమావేశం కావాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఏనాడో సూచింది. కానీ అసెంబ్లీ సమావేశాలను సైతం ప్రహసనంగా మార్చింది వైసీపీి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి పట్టుమని పది రోజులు కూడా శాసనసభా సమావేశాలు జరగ దని పీఆర్‌ఎస్‌, ఓఆర్‌జీ అధ్యయనం వెల్లడిరచింది. సభాసమయం తగ్గించడమే కాదు, చర్చలు లేకుండానే చట్టాలు రూపొందిస్తున్నారు. శాసనసభను అగౌరపరిచే విధంగా అడ్డదారిలో ఆరినెన్స్‌ తెచ్చి బడ్జెట్‌ ఆమోదించుకున్నారు ఆ మధ్య. ఏడాదిపాటు రాష్ట్రానికి దిశా, నిర్ధేశం చేసే బడ్జెట్‌ సమావేశాలను ఒక తంతుగా, మొక్కుబడిగా ముగించారు. కోట్లాది ప్రజలకు సంబంధించిన కీలక బిల్లులపై కూడా ఎటువంటి చర్చలేకుండా మందబలంతో ఆమోదించుకొని అసెంబ్లీని ఉత్సవ విగ్రహంగా మార్చిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లే ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. జరిగే కొద్దీ రోజులు అసెంబ్లీ సమావేశాల్లోనూ అబద్దాలు, సస్పెన్షన్లు తప్ప ప్రజలకు ఒరిగింది లేదు.
అయిదు కోట్ల ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించే రాజ్యాంగ దేవాలయాన్ని తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనే వేదికగా మార్చారు. శాసనసభను కేవలం చట్టాలు చేసే సభగానే, బడ్జెట్‌ పద్దులను ఆమోదించుకునే సభగానే పరిగణించారు తప్ప సగటు జీవి ఈతి బాధలపై అసెంబ్లీలో చర్చజరగలేదు. ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారం చూపడానికి, ప్రజల అవసరాలు తెలియచెప్పడానికి ఒక అవకాశంగా ఉండాల్సిన శాసనసభను అమీ, తుమీ తేల్చుకొనే బరిలామార్చారు. అసెంబ్లీ నిర్వహణను సైతం ఏకపక్షంగా మార్చారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం, పరిష్కరించడం ప్రజా ప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యం. ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులను చట్టసభల నుంచి బయటకు నెట్టి, ప్రజా ప్రతినిధుల హక్కులను, చట్టబద్దంగా వారు చేయాల్సిన విధులను అడ్డుకొన్నారు. అనేక అంశాలను ప్రస్తావనకు తేకుండా చట్టసభల్లో తనకున్న మందబలంతో అడ్డుపడుతున్నారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రతిఅంశాన్ని ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రాథóమిక హక్కును కాలరాచి తన నియంతృత్వ అధికారాన్ని చలాయించారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తున్నా, అన్ని రంగాలు నేలమట్టం అయినా. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, రైతాంగం సమస్యలు, ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు మూసివేత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, బీసీి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి సబ్‌ కాంపోనెంట్‌ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, అప్పులు, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి అనేక అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది. కానీ ప్రభుత్వం సమస్యలు వదిలేసి స్వోత్కర్షకాలు వినిపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రికి భజన చేశారు తప్ప సమస్యలపై చర్చించేందుకు ముందుకు రాలేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రతిపక్షం పైకి సీఎం జగన్‌ ఉసిగొల్పారు. అన్నీ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీని కూడా గుప్పెటపట్టి తమ పరిపాలనలో జరిగిన తప్పులను ఎవరు ప్రశ్నించరాదన్న విధంగా వ్యవహరించారు. చట్టసభలో సమస్యలపై చర్చించకుండా ససేమిరా అనడం, పట్టుపట్టిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి సభా కార్యక్రమాలు జరుపుకోవడం జగన్‌ మార్క్‌ నిరంకుశత్వానికి నిదర్శనం. ప్రజా సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్షాన్ని బయటకు నెట్టడం, చర్చలు లేకుండానే చట్టాలు రూపొందించి, ఆర్డినెన్సులతో పరిపాలించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీలో ప్రతీకారం, ద్వేషం వికృతరూపం దాల్చింది. రాజ్యం వీరభోజ్యం అయి మందబలంతో సభా మర్యాదలు మంట కలిపారు. శాసన సభలో మంత్రులు, శాసన సభ్యులు వాడిన భాష శాసన సభ ప్రతిష్ఠనే మసక బార్చింది. ప్రతిపక్ష నాయకుడుని లక్ష్యంగా చేసి ప్రతి అంశంపై విమర్శలతో, వెక్కిరింతలతో హేళన చేస్తూ అవమానించారు. శాసన సభ చివరి రోజు స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సభాపతిగా ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు. సభాపతిగా అందర్నీ సమాన దృష్టితో చూశానని, ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చాననీ, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా వ్యవహరించానని, సభకు జవాబుదారీగా వ్యవహరించానని, నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని స్పీకర్‌ తమ్మినేని మాట్లాడం పచ్చి అబద్దం. స్పీకర్‌ స్థానానికి వున్న విలువను ఆయన దిగజార్చారు. రాజ్యాంగ పదవికి దహన సంస్కారం చేశారు. గతంలో అనేక మంది స్పీకర్లుగా వ్యవహరించి ఆ స్థానానికీ వున్న ఔన్నత్యాన్ని, ప్రతిష్ఠను, గౌరవాన్ని కాపాడి ఇప్పటికీ ప్రశంసలు అందుకొంటున్న మహనీయులు వున్నారు. అనేక మంది స్పీకర్లుగా బాధ్యతలు నిర్వహించారు, ఎవ్వరూ కూడా ఈ విధంగా ప్రతిపక్ష సభ్యులపై ఏకపక్షంగా, తీవ్ర పదజాలంతో దురుసుగా ప్రవర్తించలేదు. కౌల్‌ అండ్‌ షగ్దర్‌ పార్లమెంటరీ వ్యవస్థలో నిష్ణాతులు, వారి ఆలోచన ప్రకారం స్పీకర్‌ స్థానానికి వుండే ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడాలి. స్పీకర్‌ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, రాజకీయంగా తటస్తంగా వ్యవహారించాలి. రాజకీయ వివాదాలకు దూరంగా వుండాలి. గతంలో స్పీకర్లుగా వ్యహరించిన వారు ఈ విధంగా మాట్లాడి ఎరుగరు. ఎంతో హుందాగా వ్యవహరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో వుండి అందరినీ సమానంగా చూడాల్సిన స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి కొమ్ముకాశారు. ఏదైనా అంశంపై ప్రతిపక్షం పట్టుబడితే తీవ్ర స్వరంతో దురుసుగా మాట్లాడిన సందర్భమూ వుంది. అయిదేళ్లుగా ఏ అంశం పైనా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వలేదు. ప్రతిపక్షం సభలో సమస్యలపై మాట్లాడకుండా మైకులు కట్‌ చేసి ప్రజా సమస్యలపై చర్చకు వచ్చే అవకాశం ఇవ్వకుండా అధికారపక్షానికి అండగా నిలిచారు. ప్రతిపక్ష సభ్యులను యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అనడం, అధికార పార్టీ సభ్యులను మన సభ్యులు అని మాట్లాడటం, ప్రతిపక్ష సభ్యులు తనవాళ్లు కాదంటూ మాట్లాడటం అంటే స్పీకర్‌ స్థానానికి విలువను ఎంత దిగజార్చారో అర్ధం అవుతుంది. వైసీపీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులను కుక్కలతో పోల్చి మాట్లాడుతున్నా స్పీకర్‌ వారిని మందలించలేదు. ఆ మధ్య బ్లాక్‌ క్యాట్‌ కమాండోస్‌ను తొలగిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫినిష్‌ అయిపోతారు అని స్పీకర్‌ తమ్మినేని అన్నారు. ఈ విధంగా మాట్లాడి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిన స్పీకర్‌ అందర్నీ సమాన దృష్టితో చూశానని, ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చాననీ, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా వ్యవహరించానని చెప్పుకోవడం విడ్డురంగా వుంది.
ఫోన్‌: 849625610

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img