Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మోదీ పాలనలో సమాఖ్యస్ఫూర్తి విచ్ఛిన్నం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ఒకటి ఇండియా అనగా భారతదేశం. అది రాష్ట్రాలు యూనియన్‌గా ఉండాలని చెప్పింది. సమాఖ్య విధానం ద్వారా దేశం జాతీయ స్వభావాన్ని సంతరించుకుంది. దేశంలో రాజకీయ వికేంద్రీకరణ ఉంది. దానితోపాటు బలమైన కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. దేశ నిర్మాణంలో అంతర్‌ రాష్ట్ర సంబంధాలు సైతం ప్రముఖపాత్ర వహిస్తాయి. ఫెడరలిజం ద్వారానే దేశపాలనా విధానం కొనసాగుతుంది. రాజ్యాంగంలోని 12వ భాగం, ఆర్టికల్‌ 264 నుంచి 293 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాలను గూర్చి వివరించింది. రాష్ట్రాలకు రావలసిన గ్రాంట్లు, నిధులు, ఆస్తి వ్యవహరాలు, కాంట్రాక్టులు గురించి వివరించింది. కేంద్ర ప్రభుత్వ విధించిన పన్నులు, వాటిలో రాష్ట్రాలకు రావలసిన వాటా తదితర అంశాలు స్పష్టం చేశారు. అంతర్‌ రాష్ట్ర వ్యాపార, వాణిజ్య సరళిలో జరిగే సేవలపై పన్నులు విధించి, పార్లమెంటుచేసే చట్టాన్ననుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బలహీనమైన, అవసరమైన రాష్ట్రాలకు రెవెన్యూ సహాయక గ్రాంటుల రూపంలో కొంత నిధిని అందిస్తుంది. ఆయా రాష్ట్రాలలోని షెడ్యూల్‌ తెగల జనాభా ప్రాతిపదికన అభివృద్ధి సాధించిన రాష్ట్రాలతో పాటు సమతుల్యతను సాధించేందుకు ప్రత్యేక గ్రాంట్ల ద్వారా కేంద్రప్రభుత్వం సహాయం అందించాలి. ఈ విధంగా భారత రాజ్యాంగం సమాఖ్య స్పూర్తిని సూచించింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం వాంఛించింది. అందుకు కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వచించింది. ఆర్థికలోటు, వ్యవస్థీకృత ద్రవ్యమార్కెట్‌ నుంచి రుణాలు, విదేశీ సహాయం వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. కానీ రాష్ట్రాలకు పరిమితమైన వనరులు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆర్థిక పరిపుష్టి విషయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ ఆధారపడి ఉంటాయి. గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడుతున్నదని, రాష్ట్రాల హక్కులను హరించి, వివక్షత ప్రదర్శిస్తున్నట్లు వివిధ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రాల పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, న్యాయబద్దంగా రాష్ట్రాలకు రావల్సిన గ్రాంట్లు, నిధులను విడుదల చేయకుండా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అస్తవ్యస్తం చేస్తున్నారనే విమర్శ తరచుగా వినిపిస్తున్నది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని పేర్కొంటున్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులుఇచ్చి ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్రాలకు కేటాయింపులలో అన్యాయం చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉందని, సమానత్వ సూత్రానికి తిలోదకాలు ఇవ్వటం ప్రజాస్వామ్యంలో అరిష్టమని పేర్కొంటున్నారు.
కర్నాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిరసనగా ఫిబ్రవరి 7, ఫరీదా న్యూ దిల్లీలో కర్నాటక రాష్ట్ర మంత్రులతో సహా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఫిబ్రవరి 8వ తేదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎల్‌డిఎఫ్‌ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు దిల్లాలో నిరసన చేపట్టారు. ఈ నిరసనకు మద్దతుగా దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, భగవత్‌ మాన్‌, తమిళనాడు రాష్ట్ర మంత్రి పి.త్యాగరాజన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ నాయకులు అబ్బల్‌ వహాబ్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ మౌనంగా ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర నాయకత్వం మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం వివక్షతకు నిరసనగా రాష్ట్ర వ్యాపితంగా ఎల్‌డిఎఫ్‌ భాగస్వామ్య పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. కార్మికసంఘాలు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్దఎత్తున ప్రదర్శనలు, వీధి సమావేశాలు నిర్వహించారు. సీపీఐ, కేరళ కాంగ్రెస్‌ (మణి), ఎన్‌సీపీ ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌, కాంగ్రెస్‌ (సెక్యులర్‌), జనతాదల్‌(సెక్యులర్‌) పార్టీలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఏకకాలంలో రాష్ట్ర వ్యాపితంగా 1500 సభలను వీరు నిర్వహించారు. కేంద్ర పన్నులలో రాష్ట్రానికి రావల్సిన న్యాయబద్దమైన వాటాను, పెండిరగ్‌ గ్రాంట్‌ల విడుదలను వీరు డిమాండ్‌ చేశారు. కేరళ రాష్ట్ర గుణపరిమితి కేంద్రం తగ్గించింది. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల రుణ పరిమితి పూర్తయినా వారికి అదనంగా రుణాలు మంజూరు చేస్తూ కేంద్రం వివక్షతను చూపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల అమలుకు ఇచ్చే నిధులను సైతం కేరళ రాష్ట్రానికి విడుదల చేయలేదు. గత నాలుగు సంవత్సరాలలో కేరళ రాష్ట్రం రెండు భారీ వరదలకు గురై తీవ్రంగా నష్టపోయింది. ఆర్థిక రంగంలో తీరని నష్టాలను చవిచూసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహాయం, చేయూత అందకపోగా, వచ్చిన విదేశీ సాయాన్ని కూడా నిరాకరించింది. రాష్ట్ర రెవెన్యూలో వచ్చినలోటును భర్తీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాల నిధులను, కేంద్ర పథకాల నిధులను తక్షణం విడుదల చేయాలని కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డు (కెేఐఐఎన్‌బీ) కేరళ సోషల్‌ సెక్యూరిటీ ఫైనాన్స్‌ (లి) (కేఎస్‌ఎస్‌పీిఎల్‌) రుణాల పబ్లిక్‌ రుణాల నుంచి మినహాయించాలని కేరళ ప్రభుత్వం కోరుతోంది. 2017`2023 మధ్య కాలంలో రాష్ట్రానికి రావలసిన అనేక సహాయాలను నిరాకరించడం వల్ల 107,000 కోట్లు తమ రాష్ట్రానికి నష్టం జరిగిందని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్‌ ప్రయోజనాలకోసం సరిపడ పన్నును కేంద్రం తగ్గించటం వల్ల రాష్ట్రాలను ఆదుకోవటంలో కేంద్రం వెనుకంజ వేస్తున్నది. పరోక్ష పన్నుల ద్వారా పేద వర్గాలపై భారం వేస్తున్నది. కేంద్రానికి వచ్చే సెస్సులు, సర్‌చార్జీలు పెంచి వేయటం వల్ల కూడా రాష్ట్రాలకు రావల్సిన పన్నుల వాటా తగ్గిపోయింది. కేంద్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాల పీక నొక్కివేసే చర్యలకు కేంద్రం పూనుకుంటున్నది. ఈ రకమైన ఆర్థిక వివక్షత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. దీనితో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాదిరాష్ట్రాలు అనే భేదభావం పెరిగిపోతున్నది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో వైరుధ్యాలు చోటుచేసుకుంటున్నాయి. కర్నాటక, పంజాబ్‌, తమిళనాడు, బెంగాల్‌ రాష్ట్రాలు సైతం ఈ రకమైన వివక్షతకు గురవుతున్నాయి. వర్తమానార్థిక సంవత్సరంలో వస్తు సేవల పన్నుపరిహారం ఇవ్వనందున 2వేల కోట్లకుపైగా నష్టపోయామని, మొత్తం మీద 57 వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని కేరళ ప్రభుత్వం ప్రకటించటం రాష్ట్రాల పరిస్థితికి అద్దంపడుతోంది.
రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఎన్నికైన ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో రాజ్యాంగ అధిపతులుగా కేంద్రం నియమించిన గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ల జోక్యం పెరిగిపోయింది. వారు రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను నెలల తరబడి ఆమోదించకుండా ఇబ్బందులు కల్పిస్తున్నారు. గవర్నర్లు కేంద్రం తొత్తులుగా వారి రాజకీయ అవసరాలమేరకు రాష్ట్రాలతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆలనా పాలనా వ్యవహారాలు సజావుగా సాగకుండా గుదిబండలుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. తరచుగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణలకు తలపడుతున్నారు. రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన తీరులో వీరి వ్యవహారశైలి ఉంటున్నది. కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ విభేదాలు ఉండవచ్చును. అన్ని రాష్ట్రాలలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు ఉండకపోవచ్చు. కానీ అక్కడ కేంద్రం కావాలని సంక్షోభాలను సృష్టించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, దిల్లీ, పంజాబ్‌, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఇటువంటి ఘర్షణలకు గవర్నర్‌ వ్యవస్థ కేంద్ర బిందువు కావటం విమర్శలకు గురైంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో సమాఖ్యస్పూర్తిని గుర్తుచేస్తూ తీర్పులు ఇచ్చినప్పటికీ కేంద్రం వాటిని లక్ష్య పెట్టటంలేదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 1983లో సర్కారియా కమిషన్‌ 247 నిర్ధిష్ట ప్రతిపాదనలను సిఫార్సు చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. సర్కారియా కమిషన్‌ రాజ్యాంగ మార్పులు కోరినా వాటిని పట్టించుకునే నాధులు కరువయ్యారు. 2007 ఏప్రిల్‌ 27న మదన్‌మోహన్‌ పూంచే అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఒక కమిషన్‌ నియమించారు. 2010 మార్చి 30న 273 సిఫార్సులను ఆ కమిషన్‌ ఇచ్చింది. అయినా రాజ్యాంగ మౌలిక స్పూర్తి అయిన రాష్ట్రాల సమాహారమే కేంద్రం అనే భావన కలగటం లేదు. సమాఖ్యస్పూర్తిని ధ్వంసం చేస్తే దేశం ఐక్యంగా ముందుకువెళ్లటం కష్టం. ప్రస్తుత అనుభవం దృష్ట్యా సమాఖ్య స్పూర్తితో రాష్ట్రాల ప్రయోజనాల సంరక్షణ అందరి కర్తవ్యంగా ఉంది.

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
సెల్‌: 9490952093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img