Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

లొంగుబాటు రాజకీయాలు

చలసాని వెంకటరామారావు

‘‘చతురంగ బలో రాజా జగతీ వశ మానయేత్‌’’ అంటే చతురంగ బలములు కలిగిన రాజుకు జగత్తంతా వశమవుతుందని దీని అర్ధం. ప్రస్తుతం దేశంలో మోదీ చేస్తున్న రాజకీయాలకు ఇది పూర్తిగా సరిపోతుంది. ఒకప్పుడు చతురంగ బలాలు అంటే గజబలం, అశ్వ బలం, రథ బలం, కాల్బలం. ఇవి ఎవరి చేతుల్లో ఉంటే వారిదే విజయం. ఆధునిక భారతదేశ రాజకీయాలలో చతురంగ బలాలు అంటే అధికారం, డబ్బు, కార్యకర్తలు, మతం. బీజేపీకి వీటికి కొరత లేదు. తన చతురంగ బలాలను వినియోగించి బీజేపీ దేశంలో దుష్ట, అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నది. పార్టీ ఫిరాయింపు లను, చీలికలను ప్రోత్సహిస్తున్నది. మణిపూర్‌లో జాతుల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి ఆ రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చింది. కశ్మీరు, హర్యానా, కర్నాటక, యూపీ, దిల్లీలో మత కలహాలను సృష్టిస్తున్నది. మహారాష్ట్రలో ఎంతో కాలంగా అస్థిత్వంలో ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, శివసేన పార్టీలను ముక్కలు చెక్కలు చేసింది. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ప్రలోభం, ఒత్తిడితో లొంగదీసి ఎన్డీయే కూటమిలోకి వచ్చేటట్లు చేశారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రిని ఈడీ కేసులో ఇరికించి దీర్ఘకాలంగా జైలులో ఉంచారు. ఎన్డీయే కూటమిలో, బీజేపీలో చేరకపోతే ఆమ్‌అద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు తప్పదని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నాయకుడు కేసీఆర్‌ కుమార్తె కవితను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే కేసీఆర్‌ బీజేపీతో రాజీపడి కవిత అరెస్టు నుంచి బయటపడ్డారు. బీజేపీతో రాజీపడిన దానికి బీఆర్‌ఎస్‌ ్ట అధికారాన్ని కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకుంది. తమిళనాడులో అన్నా డీఎంకే నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే బీజేపీ ప్రయత్నం నెరవేరలేదు. యూపీలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్‌ఎల్‌డిని తిరిగి ఎన్డీయే కూటమిలోకి తీసుకురావటంలో బీజేపీ దుష్ట పాత్ర వహించింది. ఇంకా కేరళ, తమిళనాడు, పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేసేందుకు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ‘‘సిద్ధడు అద్దంకి వెళ్లను వెళ్లాడు, రాను వచ్చాడు’’ అన్నట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబునాయుడు నిలకడలేని రాజకీయా లను అనుసరిస్తున్నారు. 2014లో బీజేపీతో కలిసి ఎన్నికలలో పాల్గొని అధికారంలోకి వచ్చారు. కేంద్ర మంత్రి వర్గంలో తెలుగుదేశం పార్టీ చేరింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కొంతకాలం కలిసి కాపురం చేసినవారు తరువాత కాలంలో ఒకరికొకరు విడాకులు తీసుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న మరో ప్రతిపక్ష రాజకీయ పార్టీ వైసీపీతో బీజేపీ పరోక్ష పొత్తు కొనసాగించి 2019 ఎన్నికలలో వైఎస్‌జగన్‌ అధికారంలోకి రావటంలో తోడ్పడ్డారు. అప్పటి నుంచి బీజేపీ వైఎస్‌జగన్‌కు మద్దతుఇస్తూ చంద్రబాబును దూరంగా ఉంచింది. జగన్‌ ప్రభుత్వ అక్రమాలకు, జగన్‌పై ఉన్న కేసులలో పరోక్ష మద్దతును కొనసాగించింది. అయినా రాష్ట్రంలోని అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పార్లమెం టులో, రాజ్యసభలో ప్రజా వ్యతిరేక అనేక బిల్లులకు మద్దతు ఇచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికలలో సైతం రెండు పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన ఎటువంటి షరతులు లేకుండానే బీజేపీకి మద్దతు ప్రకటించాయి. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినప్పుడు కూడా పార్లమెంటు వేదికపై రెండు పార్టీలు బీజేపీకి అను కూలంగా ఓటు చేశాయి. బీజేపీకి రెండు పార్టీలు చెక్కభజన చేసినప్పటికి బీజేపీ వైసీపీని దగ్గరకు తీసుకుని తెలుగు దేశాన్ని దూరంగా ఉంచింది. అయినా తెలుగుదేశం పార్టీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాన్ని నిర్వహించలేదు. వారికి అవసరమైన అన్ని సందర్భాలలోను సహాయ సహకా రాలు అందించింది. ఐదు మాసాల క్రితం చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినప్పటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీకి ఎటువంటి సహకారాన్ని ఇవ్వలేదు. రోజుల తరబడి లోకేశ్‌ దిల్లీలో ఉన్నప్పటికీ కేంద్ర పెద్దలు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం`జనసేన పార్టీ 2024 ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించి సంయుక్త ప్రచారం కూడా ప్రారంభిం చాయి. ఈ దశలో బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురం దేశ్వరి చేపట్టారు. ఆమె చంద్రబాబు అరెస్టును ఖండిరచినా, కేంద్ర పార్టీ మాత్రం మౌనం పాటించింది. కేంద్రం మద్దతుతోనే చంద్రబాబును జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేసిందని తెలుగుదేశం శ్రేణులతో సహా అందరూ భావిం చారు. మోదీ ప్రభుత్వ మతతత్వ విధానాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లో తీవ్ర వ్యతిరేకతకు కారణంగా నిలిచాయి. బీజేపీతో కలిసి గతంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కోల్పోయిన తెలుగుదేశం ఈ ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉండాలనే తలంచింది. ఇన్నాళ్లు సందిగ్థంలో ఉన్న బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో వైసీపీ ప్రభ సన్నగిల్లి టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలు పెరగాయని భావించి చంద్రబాబును చర్చల నిమిత్తం దిల్లీకి ఆహ్వానించింది. ఆ మేరకు చంద్రబాబు ఈ నెల 8 వ తేదీ దిల్లీలో హోంమంత్రి అమిత్‌షాతో పొత్తుపై చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీని కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీనితో రాష్ట్ర రాజకీయాలు గందర గోళంగా మారాయి. తప్పనిస్థితిలో ఎన్డీయేలో చేరాల్సి వస్తోందని, త్యాగాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని చంద్రబాబు నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. అనేక మంది తెలుగుదేశం నాయకులు సైతం ఈ పరిణామాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీలు అమలు చేయకుండా, ఇంతకాలం తెలుగు దేశాన్ని శత్రువుగా చూసిన బీజేపీతో పొత్తు ‘‘చవిటి చేలలో విత్తనాలు చల్లిన ట్లుగా’’ ఉందని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాజధాని విషయంలో, పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్‌ వంటి అంశాలలో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని అటు వంటి పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశ్యమని అనేకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతో స్థాపించారని, కానీ నేడు చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిల్లీ పాదు షాల దగ్గర తాకట్టు పెట్టటం తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలకే విరుద ్ధమని వారు పేర్కొంటున్నారు. తెలుగుదేశాన్ని బీజేపీ అడుగడుగునా అవమా నాలకు గురిచేసిందని, నారాసుర రక్తచరిత్ర పేరుతో వైసీపీ అవమానిస్తే బీజేపీ జగన్‌కు మద్దతు ఇచ్చిందని, అడుగడుగునా జగన్‌ను కాపాడుతూ వచ్చిందని అటువంటి బీజేపీతో నెయ్యం ‘‘తమ గోతిని తామే తవ్వుకున్నట్లుగా’’ ఉందని దీనివల్ల లక్షలాది మైనారిటీల ఓట్లను కోల్పోవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడవలసిన ఒక రాజకీయ పార్టీ (తెలుగుదేశం) ఈ విధంగా దిగజారి పోవటం, పిరికితనంతో వ్యవహరించటం సరికాదని, రాజకీయాలలో హత్యలే కాని ఆత్మహత్యలుండవని అనేకమంది పేర్కొంటున్నారు. సదాశయం తో, పేదల సంక్షేమం కోసం స్థాపించిన పార్టీని స్వార్ధ, అవకాశవాద రాజకీయా లకు బలి చేయటం ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కటమేనని వారు భావిస్తున్నారు. తన మీద ఉన్న కేసులతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ బీజేపీకి లొంగిపోయారనీ, చంద్రబాబు మాత్రం పిరికితనం, అధైర్యంతో లొంగిపోవటం పట్ల చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ పెద్దల చెరలో తెలుగు ఆత్మగౌరవం చిక్కుకుందని, రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన బీజేపీకి సలాం చేస్తూ గులాములుగా మారిపోయాయి. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి సరిపెట్టిన మోదీ ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుకు ప్రయత్నించటం వెనుక కుట్ర దాగి ఉందని, మోదీ ట్రాప్‌లో చంద్రబాబు ఇరుక్కుంటే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్లేనని అనేకులు భావిస్తున్నారు. ‘‘కత్తిని పట్టుకున్నవాడు కత్తికే బలౌతాడు’’ అన్నట్లు బీజేపీ పంచన చేరితే చంద్రబాబు సైతం బలిపీఠం ఎక్కక తప్పదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టే హక్కు చంద్రబాబుకు లేదు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటే పొరపాటు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర క్షమించదు.
సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు
సెల్‌: 9490952093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img