London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

అల్లూరి చరిత్ర వక్రీకరణ

పడాల వీరభద్రరావు

బెండపూడి సాధు అని పిలిచే వెంకట రామ బ్రహ్మానంద మహర్షి అన్నవరం సమీపంలో ఉన్న బెండపూడిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నేను అవతార పురుషుడిని, నేను అల్లూరి సీతారామరాజునని ప్రచారం చేసుకొని ప్రజలను మభ్యపెట్టి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిం చారు. ఇప్పటికీ కొందరు బెండపూడి సాధు చరిత్రను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకోవడానికి బెండపూడి సాధువే సీతారామరాజు అని ప్రచారం చేయడం విచారకరం. హిందువు అయితే హిందూధర్మశాస్త్ర ప్రకారం వచ్చిన ఆదాయంలో 10 వ శాతం దానధర్మాలుగా సమర్పించు కోవాలని ధనవంతుల దగ్గర సొమ్ము, రైతులు దగ్గర ధాన్యం సేకరించి, ఆశ్రమంలో నిత్య అన్నదానం చేస్తూ బెండపూడి సాధువుగా వెంకట రామ బ్రహ్మానంద మహర్షి చలామణి అయ్యాడు.
7 మే 1924న కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో మేజర్‌ గుడాల్‌ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజును ఒక చింతచెట్టుకు కట్టి తుపాకీతో కాల్చివేయగా రామరాజు వీరమరణం చెందారు. ఆ శవాన్ని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట తీసుకువెళ్లి శవపరీక్షలుచేసి అక్కడే ఖననం చేశారు. ఆ శవ పరీక్షల సమయంలో తుపాకీ గుళ్లకుబలై శరీరం నుంచి రక్తం కారుతున్న ఫోటోలు విడుదల చేశారు. ఆ ఫోటోను, శవ పరీక్ష నివేదికలను కలెక్టర్‌ రూథర్‌ ఫర్డుకు పంపించగా, ఆ నివేదికను రూథర్‌ఫర్డు పరిశీలించి రామరాజు బ్రిటిష్‌ సేనలపై కాల్పులు జరపడంతో జరిగిన ఎదురు కాల్పుల్లో రామరాజు మరణించాడని ప్రకటించాడు. ఆనాడు ఆ ఫోటో, వార్త ఆంధ్రపత్రికలో ప్రముఖంగా ప్రచురించడమైంది. నేనే సీతారామ రాజును అని చెప్పుకుంటున్న ఈ బెండపూడి సాధు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఇది అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధన చేసిన నా దృష్టికి వచ్చింది. వీడెవడు అని ఆరా తీశాను. బెండపూడి సాధువు అని పిలిచే వెంకట రామ బ్రహ్మానందం మహర్షి అసలు విషయం బయటపడిరది. ఆయనపై దిల్లీ తదితర ప్రాంతాల్లో హత్య, అత్యాచారాలపై పోలీసులు కేసులు నమోదుచేసినట్లు బయటపడిరది. ఒక కేసులో ఈయన్ని పోలీసులు నిర్బంధించారు. ఆ కేసులో పోలీసులు నుంచి తప్పించుకోవడానికి నేను అల్లూరి సీతారామరాజునని చెప్పి తప్పించుకున్నాడు.
జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ‘‘చౌ-చౌ’’ మాస పత్రికలో 1962 నవంబర్‌ దీపావళి ప్రత్యేక సంచికలో బెండపూడి సాధు అవతార పురుషుడా? అని ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం ప్రచురించిన తర్వాత బెండపూడి సాధువు అసలు రూపం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఎనమండుగురు భార్యలు, ఎందరో స్త్రీలను వశంచేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ కాలంలో అల్లూరి సీతారామరాజు తల్లి సూర్యనారాయణమ్మ ఆమె చిన్న కుమారుడు సత్యనారాయణరాజు వద్ద జగ్గంపేట ప్రాంతంలో ఉన్న బూరుగుపూడి గ్రామంలో ఉంటుంది. సత్యనారాయణ రాజుతో నాకు పరిచయాలు ఉన్నాయి. అందువల్ల బూరుగుపూడి వెళ్లి సూర్యనారాయణమ్మని, మరి కొంతమందిని తీసుకుని బెండపూడి సాధువు ఆశ్రమంపై దండయాత్ర చేశాము. ఆశ్రమంలో ఉన్న సాధువు వద్దకు సూర్యనారాయణమ్మని దగ్గరగా తీసుకువెళ్లి ఇతను మీ కుమారుడు రామరాజా అమ్మ అని అడిగితే…మా రామరాజుకు ఇతనికి పోలికలే లేవు బాబు…ఇతను మా అబ్బాయి కాదు…మా అబ్బాయి ఎప్పుడో చనిపోయాడు కదా అన్నారు. దానిపై నేను కోపగించుకుని సీతారామరాజు తల్లి…ఈమె మాటలు విన్నావు కదా… ఇకమీదట నేనే సీతారామ రాజునని అంటే సహించేదిలేదు. నీ మీద పోలీస్‌ కేసు పెడతాం. నీ ఆశ్రమం పునాదులతో సహా పెకలించివేస్తా అని హెచ్చరించాను. ఎనమండుగురు భార్యలతో, ఎంతోమంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్న నీలాంటి వాడికి, స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగంచేసి అశువులు బాసిన సీతారామరాజుకు పోలికలా ! ఇకమీదట నేను సీతారామరాజునని ప్రచారం చేసుకున్నట్లు తెలిస్తే సహించేదిలేదని హెచ్చరించాను. దానిపై నా పేరు వెంకట రామ బ్రహ్మానంద మహర్షి అని నేను సీతారామరాజును కాదని, ఇక మీదట నా గురించి పత్రికలో ఏ శీర్షికలు ప్రచురించవద్దని ఆయన స్వదస్తూరితో 3 డిసెంబర్‌ 1962 న నాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ కాపీని ‘‘చౌ-చౌ’’ పత్రికలో ప్రచురించాను. ఇలా బెండపూడి సాధు చరిత్రలో ఆధారాలతో సహా ఉండగా ఇప్పటికీ కొందరు బెండపూడి సాధు చరిత్రను అడ్డుపెట్టు కొని పబ్బం గడుపుకోవడానికి బెండపూడి సాధువే సీతారామ రాజు అని ప్రచారం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించి ఇటువంటి ప్రచారాలుచేసే వారిని నిలదీసి ఎదుర్కోవాలి.

అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు
సెల్‌: 9493281776.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img