Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ఆదిలోనే ప్రధానికి ఎదురు దెబ్బలు

బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆదిలోనే పాలనలో, రాజకీయాల్లో గట్టి ఎదురుదెబ్బలే తిన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే పాలనకు సంబంధించి ఏమాత్రము సామర్థ్యాన్ని చూపింది లేదు. 2024 జూన్‌ 9 న ప్రధానిగ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నానన్న అభిప్రాయం లేకుండా పార్లమెంటు వెలుపల, లోపల ఆయన రాజకీయ హోదా దిగజారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో గణనీయంగా సవాళ్లు ఎదురవుతున్నాయి.\

డా॥జ్ఞానపాఠక్‌
బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆదిలోనే పాలనలో, రాజకీయాల్లో గట్టి ఎదురుదెబ్బలే తిన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే పాలనకు సంబంధించి ఏమాత్రము సామర్థ్యాన్ని చూపింది లేదు. 2024 జూన్‌ 9 న ప్రధానిగ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నానన్న అభిప్రాయం లేకుండా పార్లమెంటు వెలుపల, లోపల ఆయన రాజకీయ హోదా దిగజారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో గణనీయంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రతి విధానపరమైన, కార్యాచరణకు సంబంధించి బలమైన ప్రతిపక్షం నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. విధాన రూపకల్పన, కార్యకలాపాలు చేపట్టినపుడు జవాబుదారీతనం ప్రదర్శించాలని ప్రతిపక్షం కోరుతున్నది. పూర్వపు కేంద్ర ప్రభుత్వాలను ప్రత్యేకించి కాంగ్రెసు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలను బదనామ్‌ చేసేందుకు ఆయనకు కొత్తగా అవకాశాలు లేవు. ఈ విషయంలో ఆయన వైఫల్యం కనిపిస్తోంది. రాజకీయంగా సందర్భోచితమైన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మోదీ గట్టిగా కృషి చేయవలసిందే. 18 వ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు ముందు చేసిన ప్రచారంలో 370 సీట్లు తమ పార్టీ గెలుచుకుంటుందని నమ్మబలికారు. అయితే వాస్తవంగా 240 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి మరో 63 సీట్లు తక్కువయ్యాయి. దీంతో బీహార్‌కు చెందిన నితీష్‌కుమార్‌ నాయకత్వంలోని జెడియు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీల తోడ్పాటుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటు చేశారు.
సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన రెండు రాజకీయ పార్టీలు ‘‘హిందు రాష్ట్ర’’ ఏర్పాటును సమర్థించడంలేదు. హిందు రాష్ట్ర ఏర్పాటు కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు చాలా కాలంగా కలలు కంటున్నాయి. ఈసారి ఇండియా, ఐక్య సంఘటన లోక్‌సభ ఎన్నికలలో 230 సీట్లను గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని అనేక సమస్యలపై నిలదీస్తున్నవి. రాజ్యసభలోను గతంలో ఎన్డీఏతో కలిసి ఉన్న బీజేడీ ప్రతిపక్షాన్ని సమర్థిస్తూ మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నది. ఇండియా ఐక్య కూటమితో కలిసి సభ వాకౌట్‌లో పాల్గొన్నది. కొత్త రాజకీయ వాస్తవ పరిస్ధితులకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌, నెహ్రూగాంధీ కుటుంబాలను ప్రతి విషయానికి విమర్శిస్తున్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు వారే కారణమని మాట్లాడుతూ తన తప్పులను, వైఫల్యాలను మాత్రం కప్పిపుచ్చుతున్నారు. అయితే అన్ని విషయాల్లోను ఆయన తప్పించుకోలేరని నీట్‌ పరీక్షాపత్రాల లీకుల విషయంలో స్పష్టంగా దొరికారు. మోదీ ప్రభుత్వ హాయంలోనే ఈ పరీక్షలు నిర్వహించారు. 2017 లో జాతీయ పరీక్షా ఎజెన్సీ (ఎన్‌టిఎ) ని ఏర్పాటు చేశారు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నది. నీట్‌ పరీక్షా పేపరు, యుజీసినెట్‌ పరీక్షా పేపర్లు లీక్‌ కావటం మోదీ ప్రభుత్వానికి పెద్ద తలవంపులుగా మారింది. ప్రభుత్వ వైఫల్యానికి ఇది గట్టి సవాలే అయ్యింది. ఈ అంశానికి కాంగ్రెస్‌ లేదా నెహ్రూ` గాంధీ కుటుంబానికి ఏమాత్రం సంబంధంలేదు. పరీక్షాపేపర్ల లీక్‌ బాధ్యత ప్రభుత్వమే వహించాలి.
230 సీట్లు గెలుచుకున్న ఇండియా ఐక్య సంఘటన పేపర్ల లీక్‌పై లోక్‌సభలో చర్చించాలని డిమాండ్‌ చేసింది. లోక్ణ్‌భలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పరీక్షాపేపర్ల లీక్‌ అంశాన్ని లేవనెత్తి తక్షణం ఈ సమస్యను లోక్‌సభ చర్చించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. దీనిపై మోదీ సమాధానమిస్తూ దోషులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందని పేపరు లీక్‌లకు బాధ్యులైన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రతిపక్షం బలంగా లేనపుడు చాలా తక్కువగా ప్రతిపక్ష సభ్యులు ఉన్నందు వల్ల అసలు సమాధానమే చెప్పేవాళ్లు కాదు. పార్లమెంటు రెండు సభల్లోను ప్రతిపక్షాన్ని లెక్కచేసేవారు కాదు. ఈ సమస్య ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే ఈ సమస్య అంత తేలికగా పరిష్కారమయ్యేలా లేదు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో వివిధ చోట్ల ముందుగానే ప్రశ్నాపత్రాలు వెల్లడి చేశారు. వీటి నిర్వహణ బాధ్యత మోదీ ప్రభుత్వం తనది కాదని తప్పించుకునే అవకాశం లేదు. ప్రధాని మోదీ చెప్పే అబద్దాలు ఇక్కడ పనిచేయవు. విద్యార్థులు, ఉద్యోగాలు కోరేవారు లేదా కోరుకునేవారి సమస్యను మోదీ పరిష్కరించకపోతే ఆయన రాజకీయ ప్రతిష్ట మరింత దిగజారి ఇప్పుడు గెలిచిన 240 సీట్లు కూడ మునుముందు ఉండదు. ఆదిలోనే ప్రభుత్వ వైఫల్యానికి ఇది గట్టి ఉదాహరణ.
పేపర్‌ లీక్‌, ఇంకా అనేక వైఫల్యాల మీద, సమస్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తోంది. విమర్శలకు గురవుతున్న సమస్యల్లో రైల్వే ప్రమాదం తీవ్రమైంది. ఈ ప్రమాదానికి మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. రైల్వేలను నిర్వహించే సాంకేతిక భద్రత బాధ్యత కేంద్రానిదే. పెద్ద నోట్లు రద్దు చేయటానికి టెర్రరిస్టులకు తేలికగా ఇవి అందుతున్నాయని కారణంగా చెప్పారు. టెర్రరిస్టు దాడులను నిలిపివేసేందుకు నోట్ల రద్దు దోహదం చేస్తుందని చెప్పారు. అయితే జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలో టెర్రరిస్టుల దాడులు ఏమాత్రం ఆగలేదు. నోట్ల రద్దుకు అసలు కారణం మోదీ బయటకు చెప్పరు. పాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, గ్యాస్‌ తదితర అనేక వస్తువుల ధరలు గత పదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం గత పదిహేను నెలలుగా లేని రికార్డును స్థాపించింది. మాస్కోలో ఉంటున్న భారతదేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జులై 9 నాటికి తాను ప్రధానిగా ప్రమాణం చేసిన గడువు నెల రోజలు అవుతుందని దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకున్నారు. దాన్ని మరింత బలోపేతంగా వేగంగా పనిచేయగలనని వారికి తెలిపారు. వేగంగా పురోగతిని సాధించేందుకు భవిష్యత్‌లో గణనీయమైన ఎప్పటికి మరువలేని విజయాలను సాధించగలనని చెప్పారు. 30 రోజుల్లో సాధించిన విజయాలు ఏమీలేవు. వంద రోజలు ఎజెండాను పెట్టుకొని ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4 కే సాధించామన్నారు. అయితే అత్యంత తక్కువ స్థాయిలో పరిపాలన ఉన్నది. బీజేపీ సాధించిన ఎన్నికల ఫలితాలు, వాస్తవ రాజకీయాలు, బలహీనతలు ప్రభుత్వంలో భాగంగా కనిపిస్తున్నాయి. అవినీతి నిర్మూలన, మౌలిక సదుపాయాల ఏర్పాటులో మోదీ పాలన పూర్తిగా విఫలమైంది. దిల్లీ విమానాశ్రయంలో నిర్మాణాలు కూలిపోవడం దేశ వ్యాప్తంగా వివిధ నిర్మాణాలు ప్రత్యేకించి బీహార్‌లో ఇప్పటికే పదమూడు బ్రిడ్జిలు కూలిపోవటం లాంటి మోదీ వైఫల్యాలు ప్రజలకు కనిపిస్తూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img