Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ఆరోగ్యరంగానికి అన్నీ కొరతే!

భారతదేశంలో ఆరోగ్యరంగానికి అన్నీ కొరతలే ఉన్నాయి. ఆరోగ్య భద్రత వృత్తి నిపుణులు, ఆస్పత్రులలో పడకలు, ఆస్పత్రికి వెళ్లడానికి ముందు, ఆ తర్వాత వైద్య సౌకర్యాల కోసం తగినన్ని నిధులను ఖర్చు చేయలేని రోగగ్రస్థులు, ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయలేకపోవటం, ముందుగా బడ్జెట్‌ నిధులలో హామీ ఇచ్చిన నిధులను విడుదల చేయకపోవటం తదితర అనేక అంశాలలో తీవ్ర కొరత ఉంది. అయితే ప్రభుత్వం దీనికి భిన్నంగా వైద్య, ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశపెట్టామని ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నదని చాటింపు వేసుకుంటోంది. అయితే ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్న నిధుల కొరతను ఎలా ఎదుర్కోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. 202425 సంవత్సరానికి కేంద్రం బడ్జెట్‌ను రూపొందిస్తోంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందుగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ జూన్‌ 27 వ తేదీన ఆరోగ్యభద్రత పరిశ్రమ ప్రతినిధులు, వైద్య వృత్తి నిపుణులు ఇంకా ఇతర నిపుణులతో చర్చించారు. ఇప్పటికే ఈ రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రముఖంగా ఆర్థికమంత్రి ముందుకు వచ్చాయి. తగినన్ని ప్రభుత్వ నిధులు కొరత ఉందన్న సమస్య ప్రభుత్వానికి తెలుసు. ప్రస్తుతం జీడీపీలో 1.2 శాతం మాత్రమే ప్రభుత్వం ఈ రంగానికి ఖర్చు చేస్తున్నదని తాజాగా లాన్సట్‌ విడుదలచేసిన నివేదిక తెలియజేస్తుంది. ఆర్థికమంత్రితో జరిగిన చర్చల్లో 2024 25 కేంద్ర బడ్జెట్‌లో 3 శాతం కేటాయింపులను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ పెంచే నిధులు సైతం అత్యవసరంగా అనారోగ్యానికి గురైన వారికోసం ఖర్చు చేయడానికే సరిపోతుంది.
ప్రస్తుతం ప్రజలు ఆశించే నిధులను ఖర్చు చేసేందుకు కూడ ఆర్థికశాఖ ఇబ్బందులు పడుతోంది. 202425 కేంద్ర బడ్జెట్‌ను జులై 23 న లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంటులో లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు 2024 ఫిబ్రవరి 1 వ తేదీన ప్రవేశపెట్టారు. 202425 తాత్కాలిక బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి మొత్తం 90, 171 కోట్ల రూపాయలు కేటాయించారు. అంతకుముందు సంవత్సరం 79, 221 కోట్లు కేటాయించారు. గణనీయంగా పెంచినట్లు కనిపిస్తుంది కానీ అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ. 2022 లో తలెత్తిన కోవిడ్‌ 19 మహమ్మారి నాటికి మూడేళ్ల ముందు 2017 జాతీయ ఆరోగ్య విధానాన్ని అనుసరించి ఆరోగ్యరంగానిక ప్రభుత్వ పెట్టుబడి 2.5 శాతం అవసరమవుతుందని గుర్తించారు. కొన్ని అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం కోవిడ్‌19 మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జీడీపీలో 9 శాతం నిధులు అవసరమని తెలిపాయి. అయితే ఆరోగ్యరంగానిక ఇండియా 1.2 శాతం మాత్రమే ఖర్చుచేసింది. ఇది ఎంతమాత్రం ఆమోదించదగినది కాదు. 2017 లో జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం కనీసం 2.5 శాతం నిధులు ఖర్చుచేయడంలో కూడా మోదీ ప్రభుత్వం విఫలమయింది. 202425 తాత్కాలిక బడ్జెట్‌లో జీడీపీలో 2.5 శాతం మొత్తాన్ని ఖర్చు చేసినట్టు అంచనావేస్తే జాతీయ వ్యయం 819 కోట్లుగా ఉండేది. అయితే కేంద్రప్రభుత్వం 3,27,718 కోట్లు కేటాయించవలసి వచ్చేది. అయితే తాత్కాలిక బడ్జెట్‌లో కేవలం 90,171 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇండియా రాజ్యాంగంలో ఆరోగ్యరంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం ఖర్చు చేయవలసి ఉంటుంది. లాన్సట్‌ తాజా నివేదిక ప్రకారం ఇండియా ప్రభుత్వం జీడీపీలో ఆరోగ్య భద్రతకు 1.2 శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. జి20 దేశాలలో ఇండియానే ఆరోగ్యరంగానికి అత్యంత తక్కువగా ఖర్చు చేస్తున్నది. అయితే మోదీ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. పైన తెలిపిన అంచనాను ప్రభుత్వం విమర్శిస్తూ అన్ని సంవత్సరాల్లో కంటె ఎక్కువగా ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ, మోదీ చేసిన ప్రచారాలలో అబద్దాలనే చెప్పారు. ఇప్పుడు రాజకీయ వాస్తవాలను సంకీర్ణ ప్రభుత్వం గుర్తించింది. 201415 లో ఆరోగ్యరంగానికి ప్రభుత్వం చేసిన వ్యయం జీడీపీలో 1.13 శాతం మాత్రమే. ఇదే 201920 నాటికి 1.35 శాతం ఖర్చు చేశారు. 202324 లో 90,171 కోట్లు కేటాయించగా 86,175 కోట్లు మాత్రమే 202324 సంవత్సరానికి ఖర్చు చేశారు. 202425 తాత్కాలిక బడ్జెట్‌లో అతి తక్కువగా పెంచారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌లో గణనీయంగా నిధులు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే బడ్జెట్‌ ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య భద్రత, అవసరమైన ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య పధకం కింద సేవలు అందించాలి. మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి ముఖ్య పధకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అవినీతి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. తగినన్ని నిధులు కేటాయించలేదు. ప్రైవేటు అసుపత్రులలో ప్రభుత్వం చికిత్స చేయించిన ఖర్చును ఆసుపత్రులకు ఇవ్వడానికి చాలా జాప్యం జరిగింది. ఆయుష్మాన్‌ భారత్‌ పధకాన్ని 2018 లో ప్రారంభించారు. ఈ పధకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 దామాషాలో నిధులను కేటాయిచాలి. తాత్కాలిక బడ్జెట్‌లో గత సంవత్సరం 7,500 కోట్లను కేటాయించారు. అంతకు ముందు సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం నిధులను 6,800 కోట్లకు తగ్గించారు. ఈ పధకం కింద ప్రజలకు ఆరోగ్య సదుపాయాలను వేగంగా అందించాలని తలపెట్టారు. అయితే ఈ పధకం కింద 12 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత సంవత్సరం మే నెలలో ఆయా రాష్ట్రాలు తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతక్రితం నుంచే నిధులు తగ్గిపోవటం ప్రారంభమయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వెయ్యి మందికి 3.5 శాతం పడకలను అందించటం ప్రామాణికంగా నిర్ధారించింది. అయితే మన దేశంలో రెండు పడకల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల రాజధానులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చాలా వ్యత్యాసాలున్నాయి. ఉదాహరణకు కర్నాటకలో ఏడాదికి వేయి మంది కోసం నాలుగు పడకలుండగా బీహార్‌లో 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ అత్యధిక ప్రజలకు అందుబాటులో లేదు. ఎడిట్‌పేజీ డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img