Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎన్నికలపై ఉద్యోగుల పోరాట ప్రభావం

డా॥ జ్ఞాన్‌పాఠక్‌

ప్రభుత్వ ఉద్యోగులు, ట్రేడ్‌ యూనియన్ల పోరాట ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. మోదీ ప్రభుత్వ విధానాలపైన ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికసంఘాలు బాణం ఎక్కుపెట్టాయి. రానున్న వారాల్లో బహుశ మే 1 వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు కొన్ని సంఘాలు తలపెటాయి. ఇందుకు కార్మికులు సిద్ధపడుతున్నారు. బీజేపీని, ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఓడిరచాలని దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. దీనివల్ల సామాజిక ఉద్రిక్తతలు, ట్రాఫిక్‌కు ఆటంకాలు, కార్మికులు, మోదీ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు, మోదీ భక్తుల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. మోదీని, బీజేపీని ఓడిరచి ఇండియాను కాపాడాలనే నినాదంతో ఉద్యమం చేయనున్నారు. ఈ సమ్మె అంశాలను ఎన్నికల కమిషన్‌ గమనించవలసిన అవసరం కూడా ఉంది. పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని సంయుక్త వేదిక ఆధ్వర్యంలో మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ఇప్పటి నుంచే ప్రచారం చేయనున్నందున మోదీ ప్రభుత్వంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం కలగనున్నది. ఈ సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. వంద శాతం ఉద్యోగులు, కార్మికులు పోరాట కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
అన్ని ట్రేడ్‌ యూనియన్లు, ఉద్యోగుల యూనియన్ల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారు. అయితే బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నది. దాదాపు 28 లక్షల మంది ఉద్యోగులు వివిధ ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొంటారు. రైల్వే, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రైళ్లను నిలిపివేయవచ్చు.
ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మద్దతు గల బీఎంఎస్‌ మినహా అన్ని ట్రేడ్‌ యూనియన్లు వివాదాస్పదమైన కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా 2020 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ కోడ్లను మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించింది. ఈ కోడ్‌లు కార్మిక వ్యతిరేకమైనవని, కార్పొరేట్ల అనుకూలమైనవని అందువల్ల వీటిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ కర్షకులు, కార్మికులు ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు , ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు, ప్రభుత్వరంగ ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులు పోరాటానికి సిద్ధపడుతున్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేయాలని ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. నూతన పెన్షన్‌ విధానాన్ని బీజేపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కనీసం వెయ్యి రూపాయలు పెన్షన్‌ని పెంచాలని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్‌ను ఇటీవల కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. త్వరలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూలు ప్రకటించనున్నదని తెలిసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, ట్రేడ్‌ యూనియన్లు పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ తేదీలకు మోదీ ప్రభుత్వం సిద్ద్ధ పడిన తరువాత ఎన్నికల కమిషన్‌ మోడల్‌ కోడ్‌ను ప్రకటించ నున్నది. ఇప్పటి నుంచి మరో 70రోజుల్లో ఎన్నికలు జరగ వచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నెల 19 వ తేదీన అన్ని యూనియన్లు ఆయా ప్రభుత్వ విభాగాలకు సమ్మె నోటీసులు అందజేస్తాయి. మే 1న నిరవధిక సమ్మెకు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
పాత పెన్షన్‌నే పునరుద్ధరించాలని కోరుతూ న్యూదిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు జరిపారు. అన్ని రాష్ట్ర రాజధానులు డివిజనల్‌ కేంద్రాలు, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట 2024 జనవరి 8` 11 మధ్య కాలంలో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైనందున నిరవధిక సమ్మెకు నిర్ణయించారు. ఆల్‌ ఇండియా రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున మే 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు. పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ అనేక మార్లు నిరసన ఉద్యమాలు చేశామని ఆయన అన్నారు. ప్రధానమంత్రికి, ఆర్థికమంత్రికి తమ డిమాండ్‌ను తెలియజేస్తూ ఉత్తరాలు రాశామని అయినా ఫలితం లేకుండా పోయిందని మిశ్రా అన్నారు. ఎన్నికల ప్రచారంలోను ఈ విషయాన్ని కచ్చితంగా ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. డిమాండ్ల విషయమై ప్రజలు కూడా చర్చించాలని ఆయన తెలిపారు. కేబినెట్‌ కార్యదర్శి ఈ విషయాన్ని పట్టించుకుని డిమాండ్‌ను అంగీకరించాలని ఆయన కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో పది ట్రేడ్‌ యూనియన్లు , రైతు సంఘాలు ఉధృత పోరాటం నిర్వహించాలని సిద్ధపడుతున్నాయి. కార్మికులకు, కర్షకులకు ప్రభుత్వం న్యాయం చేయాలని లేదంటే ఉధృత పోరాటం తప్పదని సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img