Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఒక బుద్ధుడి మౌనముద్ర ప్రపంచాన్ని శాసించింది!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

బుద్ధుడు వేదానికైనా, జాతికైనా, పౌరోహిత్యానికైనా, ఆచారానికకైనా తల వంచని వాడు. సత్యాన్వేషణలో ఓ నిబ్బరం, దిట్టతనం ఉంచుకుని, సర్వ ప్రాణులపైన ప్రేమ, కరుణ కురిపించిన ఉన్నతమైన వ్యక్తి. అలాంటి వాడు ప్రపంచరంలో మరొకరు లేరు. నేను బుద్ధుడి సేవకుడికి సేవకుణ్ణి. అతనికి ముందుగానీ, వెనకాలగానీ ఎవరూ లేరు. ఆయన తన స్వంతానికి ఏమీ చేసుకోలేదు. ఎంతటి కరుణానిధీ? ఒక గొర్రెపిల్ల కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆకలితోఉన్న పులికోసం తనునుతాను అర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. చండాలుడి ఆతిధ్యం సైతం స్వీకరించి ఆశీర్వదించాడు. మొత్తం ప్రపంచాన్ని కౌగలించుకునేంత అనుకంపనను అందించాడు. ఈ భూమి మీద జీవించిన శ్రేష్టమైనవారిలో బుద్ధుడు మిక్కిలి శ్రేష్టమైనవాడు. తనను ఒక మహా మానవుడిగా భావించి, అందరూ తనని ఆం ధించాలని ఆయనెప్పుడూ అనుకోలేదు. అది ఆయనకు ఇష్టంలేని పని కూడా.
బుద్ధుడి గురించి స్వామి వివేకానంద (వేరువేరు సందర్భాలలో చెప్పిన విషయాలు) గౌతమ బుద్ధుడు సాధారణ శకానికి ముందు 563483 బీసీఈ మధ్య జీవించిన వాడు. కపిలవస్తు సమీపంలోని లుంబిని వనంలో యువరాజు సిద్ధార్థగా జన్మించాడు. వీరిది శాక్య క్షత్రియ వంశం. శాక్య వంశీయుడు గనకనే తర్వాత కాలంలో శాక్యమునిగా పిలుచుకున్నారు. జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడయ్యాడు. బుద్ధుడు అంటే ‘జ్ఞానోదయం’ కలిగిన వాడు అని అర్థం! ఆయన బోధనల సారాంశమే ‘బౌద్ధం’ అయింది. ఒక వ్యక్తి మంచి జీవితం గడపడానికి బుద్ధుని బోధనలు ఉపయోగపడతాయి. లుంబిని వనం ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. అది ఆ కాలంలో భారతదేశంలో అంతర్భాగం. సిద్దార్ధుడి తల్లి మహామాయ. ఈమె కొల్లియా యువరాణి. తండ్రి శుద్ధోధనుడు కపిలవస్తు రాజు. సిద్దార్ధుడికి చిన్నవయసులోనే యశోధరతో వివాహం జరిపిస్తారు. సిద్దార్థయశోధర దంపతులకు ‘రాహుల్‌’ అనే కుమారుడు పుడతాడు. ఇరవై తొమ్మిదోఏట సిద్దార్థుడు ఇంటిని త్యజించాడు. దానినే ‘మహాభినిష్క్రమణం’ అని అంటారు. రాజమందిరం వదిలి అడవిలో తిరుగుతున్నప్పుడే ఆయనకు అలరా కలామాతో పరిచయమైంది. అతనే సిద్ధార్ధుడికి తొలి గురువు. ఆయనే ధ్యానం గురించి, సాంకేతిక పరిజ్ఞానం నేర్పించాడు. సిద్దార్ధుడు తన ముప్పయి అయిదవ ఏట నిరంజన నది ఒడ్డున బుద్ధ గయ వద్ద బోధివృక్షం కింద నలభై తొమ్మిది రోజులు ధ్యానం చేశాడు. నిరంతరాయంగా ఏకధాటిగా చేసిన ఆ ధ్యానం వల్ల, సిద్ధార్ధుడికి జ్ఞానోదయమైంది. నిరంజన నదికి ఇప్పటి పేరు ఫల్గు. బుద్ధగయ బిహార్‌లో ఒకప్పుడు చిన్న గ్రామం. ఇప్పుడు అది ఒక పెద్ద బౌద్ధక్షేత్రమైంది. బుద్ధుడి వల్లనే గయకు బుద్ధగయ అనే పేరొచ్చింది. ఇప్పుడు అది జిల్లా కేంద్రం. మహాబోధి మందిరం, పద్మాలు పూసే సరస్సులూ అక్కడున్నాయి. మగధ విశ్వవిద్యాలయం కూడా అక్కడే ఉంది. బుద్ధుడికి జ్ఞానోదయమయ్యాక రెండు వందల ఏళ్లకు అశోక చక్రవర్తి ఆ స్థలాన్ని సందర్శించాడు. ఆ బోధి వృక్షం మొదట్లో ఒక వజ్రాసనాన్ని ఏర్పరచాడనీ అక్కడే ఒక మందిరం కట్టించాడనీ చెపుతారు. ఇప్పుడు అవి అక్కడ లేవుగానీ, వాటి అవశేషాలు మాత్రం తప్పక కనిపిస్తాయి. భారతదేశంలో రెండు వేల ఆరువందల సంవత్సరాల క్రితం మతంగాకాక, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గంగా బౌద్ధం ప్రారం భమైంది. బుద్ధుడు తనతొలి ఉపదేశం (బోధన), తన ఐదుగురు శిష్యులకు సారనాథ్‌లో చేశాడు. దీన్నే ధర్మచక్రం అంటారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడి ధమేక స్థూపం చాలా పెద్దది. ఇది సాధారణ శకం 500లో నిర్మాణమైంది. తెల్లని మకరానా పాలరాయితో నలభై మూడు మీటర్ల ఎత్తు నిర్మించారు. బుద్ధుడి ఐదుగురు శిష్యులపేర్లుకౌండిన్య, అస్సాజి, భద్దియ, వప్పా, మహానామా. జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట గడిపాడు. ఆ క్రమంలో ఏడవ వారం ఆగ్నేయంలో ఉన్న రాజాయతన వృక్షం కింద గడిపాడు. ఇక్కడ బుద్ధుణ్ణి ఇద్దరు బర్మా దేశపు వ్యాపారస్థులు కలిశారు. వారు ప్రార్థన రూపంలో బుద్ధున్ణి శరణు కోరారు. ‘‘బుద్ధం శరణం గచ్చామి’ అని అన్నారు. అంటే నేను బుద్ధుణ్ణి శరణు కోరుతున్నాను అని అర్థం. అదే ఆ తర్వాత ప్రార్థనగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం బుద్ధగయలో అనేక మఠాలు, స్మారక కట్టడాలు, దేశంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహం ఉన్నాయి.
బౌద్ధంలో త్రి రత్నాలు అంటే మూడు ఆభరణాలు ఉన్నాయి. అవి ఏవంటే 1. బుద్ధుడు 2. ద్ధమ్మం 3. సంఘం. ఇవే బుద్ధం, శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామిగా మనకు తెలుసు. బుద్ధుడు నాలుగు గొప్ప సత్యాలు చెప్పాడు. 1. దు:ఖం అంటే బాధ. అందులో నిజం ఉంది. బౌద్ధం ప్రకారం ప్రతిదీ బాధే. అందుకే ‘సబ్బం దు:ఖం’ అన్నారు. అంటే సర్వం దు:ఖమయమే అని అర్థం. ఇది నొప్పిని అనుభవించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి అనుభవించే అసలైన నొప్పిబాధ…దు:ఖం మాత్రమే! సముదాయబాధకు ఒక కారణం ఉంటుంది.

  1. తృష్ణ (కోరిక) బాధకు ప్రధాన కారణం అదే. బాధ జీవితంలో ఒక భాగం. 3. నిరోధఅంటే బాధకు ముగింపు. అందుకు అష్టాంగిక మార్గం ఉంది. 4. నిబ్బానా అంటే మోక్షం. దు:ఖాలకు అంతం. బాధలకు ముగింపు. బాధల ముగింపుకు అష్టాంగిక మార్గాలు ఉపయోగపడతాయి. అవి ఏవంటే...1. సమ్మాదిత్త్తిసరైన అవగాహన 2. సమ్మ సంకల్పసరైన ఆలోచన 3. సమ్మ కమ్మంటసరైన చర్య 4. సమ్మ అజీవసరైన జీవనోపాధి 5. సమ్మ వాయమాసరైన ప్రయత్నాలు 6. సమ్మ వాకాసరైన ప్రసంగం 7. సమ్మా సతిసరైన బుద్ధి 8. సమ్మ సమాధిసరైన ఏకాగ్రత బాధల ముగింపు ఎనిమిది విధాలు గానూ ఎనిమిది రెట్లుగానూ ఉంటుంది. సాధారణ శకానికి ముందు 483బీసీఈ లో బుద్ధుడు తన 80వ ఏట ఖుషీనగర్‌లో మరణించాడు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఒక పట్టణం. గోరక్‌పూర్‌కు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడది ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇక్కడే బుద్ధుడు ‘మహా పరినిర్వాణం’ చెందాడని బౌద్ధం చెపుతుంది. బుద్ధుడు తన సిద్ధాంతాలలో మధ్యమ మార్గానికి ప్రాధాన్యమిచ్చాడు. అయితే బుద్ధుడి జనన మరణాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 563బిసిఇలో పుట్టాడని కొందరు చెపితే, లేదు 483 బిసిఈ అని మరికొందరంటారు. 483 బిసిఈలో పరినిర్వాణం చెందాడని కొందరంటే 400 బిసిఇ అని మరికొందరంటున్నారు. కొన్ని సంవత్సరాల తేడా ఉన్నా, అందరూ ఒప్పుకున్నది సాధారణ శకానికి ముందే అని! సంస్కృత భాషా ప్రభావంతో ఆయనపేర్లు సిద్ధార్ధుడు, గౌతముడుగా మారాయి. అసలైతే ఆనాటి పాలి భాషలో సిద్ధత్తా అని, గోటమా అని అనాలి. సంస్కృత ప్రభావంతోనే పాలిపాళీ అయింది. ధమ్మంధర్మం అయింది.
    సంస్కృత భాషమీద బ్రాహ్మణుల గుత్తాధిపత్యం ఉండేది. అందుకు విరుద్ధంగా బుద్ధుడు తన సందేశాల్ని ఆనాటి ప్రజల భాష అయిన పాళి భాషలో సరళంగా, మృదువుగా ప్రజలకు అందించేవాడు. అతని దయాగుణం, ప్రశాంత వదనం, సౌమ్య వచనం చక్రవర్తిగా రాజ్యమేలాల్సినవాడు, సర్వస్వాన్నీ త్యజించి, ప్రజలకోసం పరిత్యాగ జీవితం కోరుకున్న ఆయన ప్రజల్ని విశేషంగా ఆకర్షించేవాడు. ప్రజా సమస్యలకు ఆయన దగ్గర నైతిక పరిష్కారాలు సిద్దంగా ఉండేది. తెరచిన పుస్తకం లాంటి ఆయన జీవితమే ఆనాటి నుండి ఈ నాటివరకు ప్రజలకు గొప్ప స్పూర్తినిస్తోంది. దేశంలోను, విదేశాలలోనూ బౌద్ధం గొప్పప్రజాదరణ పొందడానికి, కాలక్రమంలో బలహీనపడడానికీ అనేక కారణాలున్నాయి. అశోకచక్రవర్తి మద్దతుతో, చొరవతో మధ్య ఆసియా దేశాలలో, శ్రీలంకలో బౌద్ధం ఉచ్ఛస్థితికి చేరింది. తన తర్వాత రాజుకావల్సిన వాణ్ణి తన కుమారుడైన మహేంద్రను, కూతురు సంఘమిత్రను అశోకుడు బౌద్ద ప్రచారం కోసం శ్రీలంకకు పంపాడు. ప్రసేన్‌జిత్‌, బింబిసారుడు, కనిష్కుడు మొదలైన రాజులు బౌద్ధాన్ని ఆదరించారు. రాజుల ప్రోత్సాహం, రాజపోషలకు కారణంగా ఆనాడు బౌద్ధం అనేక దేశాలక వేగవంతంగా వ్యాపించింది. బౌద్ధం వ్యాపించడానికి మరికొన్ని ముఖ్యకారణాలున్నాయి. వైదికధర్మం లాగా ఇది పిడివాదంగా లేదు. ఉదారవాదంగా ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఉండడం వల్ల అన్ని కులాలవారూ దీనిపట్ల ఆకర్షితులయ్యారు. పైగా మహిళలను కూడా సంఘంలో చేర్చుకోవడం వల్ల, బౌద్ధం అట్టడుగు హృదయాలను గెలుచుకుంది. ఆనాటి మగధలోని బ్రాహ్మణులు, శూద్రులను చిన్నచూపు చూసి అవమానించేవారు. అందువల్లకూడా, కులకట్టుబాట్లను తెంచుకుని అధిక సంఖ్యంలో ప్రజలు బౌద్ధాన్ని అక్కున చేర్చుకున్నారు. వివేకవంతులైన కొందరు బ్రాహ్మణులు కూడా బౌద్ధం స్వీకరిస్తూ ఉండేవారు.
    ఆ రోజుల్లోనే కాదు, ఆధునిక కాలంలో కూడా డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆరులక్షల మందితో బౌద్ధం స్వీకరించారు. ఈ దేశానికి ఒక దిశా నిర్దేశం చేశారు. దాన్ని ‘నవయానం’ అన్నారు. మొన్నటికీ మొన్న గుజరాత్‌లో 50వేల మంది బౌద్ధం స్వీకరించారు. మనుషులందరిదీ ఒకేస్థాయి`నైతికతే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది.
    కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img