Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కమ్యూనిస్టులపై ట్రంప్‌ చిందులు


ని.జె అట్కిన్స్‌

అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కొని అప్రతిష్ట పాలయ్యాడు. కోర్టు తీవ్రంగా నేరారోపణ చేసింది. గూఢచారిచట్టాన్ని ట్రంప్‌ ఉల్లంఘించారు. ఇందుకుగాను ట్రంప్‌కు 11 మిలియన్‌ డాలర్లు జరిమానా విధిం చింది. వైట్‌హౌస్‌లో ఉండవలసిన అత్యంత రహస్యపత్రాలను 11 పెట్టెల్లో తీసుకువెళ్లి తనింటిలో దాచుకున్నాడు. ఇంటిలి జెన్స్‌ అధికారులు ఇంటికి వెళ్లి సోదాచేసి రహస్యపత్రాలు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థులపైన విమర్శలు గుప్పిస్తున్నారు. దర్యాప్తు అధికారులనూ దునుమాడారు. తాను తిరిగి గెలిస్తే దేశం నుండి కమ్యూనిస్టులను దేశ బహిష్కరణ చేస్తానని చిందులు తొక్కుతున్నాడు. ఆయనపైన విమర్శలు చేసేవారిని సహించలేకు న్నాడు. అలాగే వామపక్షాలను తీవ్రంగా దూషిస్తున్నాడు. ఇటీవల వారం పదిరోజుల నుండి ఫాసిస్టుల వలె ప్రవేశిస్తూ చిందులు వేస్తున్నాడు. ఎన్నికల ప్రచార సభల్లో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, మార్క్సిస్టులు ఏకమై బలమైన శక్తిగా ఎదిగి అమెరికా పతనానికి పూనుకున్నారని వీరంగం చేస్తున్నాడు. గత వారం చివరిలో వాషింగ్టన్‌లో అత్యంత మితవాద ఇవాంజిలికల్‌ ‘‘విశ్వాసం` స్వేచ్ఛ సదస్సు’’ అనే అంశంపై 90 నిమిషాలసేపు ట్రంప్‌ ప్రసంగించారు. ఆయన ప్రసంగం మెకర్థి కాలంనాటి దాడులవలె ఈ ప్రసంగం సాగింది. క్రైస్తవ ఛాందసవాదుల సమూహాన్ని ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడుతూ డెమొక్రటిక్‌పార్టీ ‘‘ప్రతి మనిషి, ప్రతి మహిళ, ప్రతి బిడ్డపై తమ కమ్యూనిజం సిద్ధాంతాన్ని రుద్దాలని చూస్తోంది.’’ అని ఆరోపించారు.
అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనాకాలంలో క్రైస్తవులను హింసించేందుకు ప్రయత్నించారని ట్రంప్‌ ధ్వజమెత్తాడు. క్రైస్తవ మతాన్ని తక్కువచేస్తూ తన నేరాలపై దర్యాప్తులు జరిపిస్తున్నారని అన్నారు. వారు తన స్వేచ్ఛను అరికట్టేం దుకు ప్రయత్నిస్తున్నారని ఇందుకు తాను అనుమతించబోనని ట్రంప్‌ తీవ్రంగా మాట్లాడారు. క్రైస్తవులకోసం తాను పోరాడినట్లుగా ఏ అధ్యక్షుడూ పోరాడ లేదని ట్రంప్‌ చెప్పుకున్నారు. అబార్షన్‌ అనేది మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని దాన్ని లేకుండా చేస్తున్నారని ట్రంప్‌ మాట్లాడారు. తాను క్రైస్తవుల కోసం ఆధునిక అమరుడను కావడానికైనా సిద్ధంగాఉన్నానన్నారు. ప్రతిసారి రాడికల్‌ వామపక్ష డెమోక్రాట్లు, మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు తనను దూషిం చడానికి ప్రయత్నిస్తున్నారని అది తనకు మరింత ధైర్యాన్నిస్తుందని ట్రంప్‌ అన్నారు. మార్క్సిజం ఫాసిజంతో సమానమని కూడా ట్రంప్‌ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. కమ్యూనిస్టు వ్యతిరేక భావజాలాన్ని నరనరాన ట్రంప్‌ జీర్ణించుకున్నాడు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరిహద్దుల్లో మెక్సికన్‌ పౌరులను రాకుండా కట్టుదిట్టం చేశానని, మెక్సికో వలసదారులు రేపిస్టులు, హంతకులు అని ట్రంప్‌ నోరుపారేసుకున్నారు. మళ్లీ తాను గెలిస్తే, వలస వచ్చినవారి పిల్లలను, తల్లితండ్రులకు దూరంగాఉంచే విధానాన్ని అవలంబి స్తానని, ఈసారి ఆ దేశం నుంచి వలస వచ్చేవారిని దేశంలోకి ఎట్టిపరిస్థితు ల్లోనూ అనుమతించబోనని చెప్పారు. సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని అన్నారు. తాను అనుసరించిన విధానాలు చాలవని కమ్యూనిస్టుల నుంచి ముప్పు అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆరోపించారు.
ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్‌ 212(ఎఫ్‌) కింద కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను తమ దేశంలోకి రాకుండా ఉత్తర్వు జారీ చేస్తానని పేర్కొన్నారు. మా దేశంలోకి వచ్చినవారు మా దేశాన్ని విధిగా ప్రేమించాలి. మా దేశాన్ని విధ్వంసం చేయడానికి వారిని అనుమతించడంలేదు. విదేశీ క్రైస్తవులు కమ్యూనిస్టులు, సోషలిస్టులు, మార్క్సిస్టులను ద్వేషిస్తున్నారని అన్నారు. అందువల్లనే మేము వారిని అమెరికాకు దూరంగా ఉంచుతున్నామని తెలిపారు. కమ్యూనిస్టులు దేశంలోకి రాకుండా ఇప్పటికే నిషేధం విధించే చట్టం అమలులో ఉందని అన్నారు. కమ్యూనిస్టుపార్టీల అనుబంధ సంఘాల సభ్యత్వం ఉన్నవారిని కూడా అనుమతించబోమని మాట్లాడారు. ఇప్పటికే ఎదిగిన కమ్యూనిస్టులను ఏం చేస్తారని నా ప్రశ్న? అని మాట్లాడారు. ప్రసంగం వింటున్నవారు వారిని బహిష్కరించండి అంటూ నినాదాలు చేశారు. 1919, 1920లలో పేరుమోసిన పాల్మర్‌ దాడులను ట్రంప్‌ మళ్లీ పునరుజ్జీవింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆనాడు విదేశాల్లో జన్మించిన కమ్యూనిస్టులను, రాడికల్‌ వామపక్షవాదులను అరెస్టుచేసి దేశం నుంచి బైటకు పంపాలని న్యాయశాఖ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసింది అన్నారు. మళ్లీ ఆనాటి పరిస్థితులను తీసుకు రావాలని పిచ్చెక్కినట్లుగా ట్రంప్‌ మాట్లాడారు. తాను అధికారంలోకివస్తే పుట్టిన ప్రతివారికి పౌరసత్వం ఇవ్వకుండా నిషేధిస్తూ ఎగ్జికూటివ్‌ ఉత్తర్వు జారీ చేస్తానని అన్నారు. ఆయన ప్రసంగమంతా ఎక్కువగా కమ్యూనిస్టులను నిందించడానికే కేటాయించారు. అంతర్జాతీ యంగా కూడా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
24 గంటల్లోపు క్యూబాలో చైనా తన సైనిక స్థావరాలను ఖాళీ చేయాలని అక్కడ ఉన్నవాటిని కూడా ధృవీకరించడంలేదని ట్రంప్‌ అన్నారు. ఫ్లోరిడాకు 90 మైళ్ల దూరంలోఉన్న వినడంకోసం ఏర్పాటుచేసిన చైనా కోస్టులను బైడెన్‌ ప్రభుత్వం అనుమతించిందని ఆరోపించాడు. ట్రంప్‌ తొలినుంచీ కమ్యూనిస్టులను ద్వేషిస్తూనే ఉన్నాడు. అత్యంత మితవాద, ఛాందసవాద రాజకీయాలను ఆయన అంటిపెట్టుకొని ఉన్నాడు. 1930లలో ట్రంప్‌ హిట్లర్‌ నాజీ పార్టీ అమెరికా సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన అవుట్‌ కోస్టులను ఆయన సమర్థించాడు. కమ్యూనిస్టు వ్యతిరేకతను నిలువెల్లా నింపుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img