Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేజ్రీవాల్‌పై ఈడీ గురి

సుశీల్‌ కుట్టి

ఇప్పుడు ఎంఎల్‌ఏలు, ఎంపీల దగ్గర టన్నుల డబ్బు మూలుగుతోంది. బ్యాంకు ఖాతాల్లో లెక్కలేనంత ధనం ఉంటోంది. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్త్తోంది. లోకసభ ఎన్నికలకు ముందు ఏ విధంగానైనా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తుసంస్థ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారానికి వచ్చిననాటినుంచి ప్రత్యర్థి ప్రభుత్వాలను కూల్చివేయడానికి రకరకాలు వ్యూహాలనొ పన్నారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఎల్‌ఏల సంఖ్య తగ్గితే, డబ్బు ఎరవేసి పార్టీ మార్పును చేయించడం మామూలుగా జరుగుతున్న ప్రక్రియ. ఇటీవల ఏడుగురు ఆప్‌ ఎంఎల్‌ఏలను తమ పార్టీలో జేర్చుకునేందుకు డబ్బు ఎరవేయడమే కాకుండా ఆప్‌ను బీజేపీలోకి చేర్చుకునేందుకు తమపై ఒత్తిడి చేస్తున్నారని కేజ్రీవాల్‌ వెల్లడిరచారు. ఒక్కొక్క ఎంఎల్‌ఏకి 26కోట్ల రూపాయలు ఆశచూపారని కేజ్రీవాల్‌, ఇతరులు ఆరోపించారు. కనీసం 25 మంది ఆప్‌ ఎంఎల్‌ఏలను పార్టీ మార్పిడిచేయించేందుకు ఒత్తిడిచేస్తున్నారని కేజ్రీవాల్‌, ఆతిషి మర్లీనా ఆరోపించారు. దర్యాప్తు సంస్థ విచారణకోసం కేజ్రీవాల్‌కు నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన ఇంతవరకు హాజరుకాలేదు. దర్యాప్తు సంస్థకి, కేజ్రీవాల్‌కి మధ్య దాగుడుమూతలు సాగుతున్నాయి. దిల్లీలోనే కాకుండా పంజాబ్‌లోనూ ఇలాంటి క్రీడ సాగుతోంది. సాధారణప్రజలు కూడా ఆప్‌కి ఓటు చేస్తున్నట్లు ప్రజలు చూస్తున్నదే. కేజ్రీవాల్‌ ప్రభుత్వంపైన మోదీ ప్రభుత్వం చాలాకాలంగా గురిపెట్టింది. బీజేపీలో చేరాలని తనపై బీజేపీ ప్రభుత్వం వత్తిడిచేస్తున్నదని కేజ్రీవాల్‌ ఆరోపించగా, బీజేపీ ఈ ఆరోపణను తిరస్కరించింది. తాను బీజేపీలో చేరేదిలేదని, బీజేపీ ప్రభుత్వం ఏమిచేసినా ఒత్తిడికి లొంగనని కేజ్రీవాల్‌ అన్నారు. ఎలాంటి కుట్ర చేసినప్పటికీ నేను దృఢంగా ఉంటానని బీజేపీలోచేరే ప్రశ్నేలేదని కేజ్రీవాల్‌ అన్నారు. తాను అబద్ధాలు చెపుతున్నానని ఎవరు నిరూపించగలరు? అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వాస్‌శర్మ, బీజేపీ ఎంఎల్‌ఏ సువేందు అధికారి ఒత్తిడి పెడుతున్నారని కేజ్రీవాల్‌, ఇతర ఎంఎల్‌ఏలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి హిమంత్‌ బిశ్వాస్‌ శర్మను బీజేపీలో చేర్చుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ముకుల్‌ రాయ్‌, సువేంద్‌ను కూడా బీజేపీ వెంటాడి తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా హేమంత్‌సొరేన్‌ను అరెస్టు చేయడంలో ఈడీ విజయవంతంగా పనిచేసింది. ఎన్‌సీపీ నాయకుడు శరద్‌పవార్‌, రోహిత్‌పవర్‌పైన కూడా ఈడీ ఎక్కుపెట్టింది. అలాగే ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌పైన కూడా ఈడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు అనేక రాష్ట్రాల నాయకులపైన బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న విషయం అందరికీ తెలుసు. కేజ్రీవాల్‌ బీజేపీలో చేరినట్లయితే ఆయనపైన ఉన్న కేసులను తక్షణం మాఫీ చేస్తారు. తొలినుంచి బీజేపీ చేస్తున్నపని ఇదే. ఎంతటి అవినీతిపరుడైనా బీజేపీలో చేరితే గంగలో మునిగి పవిత్రుడవుతాడు. ఏ పార్టీనైనా బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఏర్పడిరది. కేజ్రీవాల్‌ పరిస్థితులు మెరుగ్గా ఉండకపోతే ఆయనను అరెస్టుకాకుండా నిలవరించడం కష్టమేనని అంటున్నారు. దిల్లీ ప్రభుత్వ ఉపముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా మరో మంత్రి సంజయ్‌సింగ్‌లను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న తర్వాత వారిని ఎవరూ అరెస్టుకాకుండా కాపాడలేకపోయారు. కేజ్రీవాల్‌మీద అవినీతి ఆరోపణలు చేసి నిరూపించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక వ్యూహాలు పన్నుతున్నట్లు కనిపిస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై రెండువైపుల నుంచి దెబ్బలుతగులుతున్నాయి. మొదటిది దిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు ఆయనకోసం వేటాడుతున్నారు. వివిధరకాల అబద్ధాలతో దిల్లీ పోలీసులు అరెస్టు చేసేందుకు తహతహలాడుతున్నారు. ఏడుగురు ఆప్‌ ఎంఎల్‌ఏలను ఒక్కొక్కరికి 25కోట్లు చెల్లించి బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు కేజ్రీవాల్‌ నిరూపించగలరా? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. మద్యం కుంభకోణంలో అనేకమంది ఆప్‌ నేతలు భాగస్వాములని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img