Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ధ్వంసమవుతున్న అడవులు

షేక్‌ కరిముల్లా

ప్రకృతి ఆర్థిక వ్యవస్థలో కరెన్సీగా చెలమాణీలో ఉన్నది డబ్బు కాదు, జీవం, జీవవైవిద్యం. ఇది లేకుంటే మనిషి మనుగడే లేదు.’

  • వందన శివ.
    పర్యావరణ హననం నేడు భూగోళ వినాశనం దిశగా పయనిస్తోంది. ఫలితంగా ప్రకృతి, జీవం మనుగడకు ముప్పు ఏర్పడిరది. నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తీవ్ర సమస్య పర్యావరణం కాలుష్యం. భూమి వేడక్కడం, జాతులు అంతరించటం, సహజ వనరులు, అడవులు తరిగిపోవడం, ఎడారులు విస్తరించటం, చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలు కలుషితం కావడం, భూగర్భజాలాలు అడుగంటటం, గాలి, నీరు విషపూరితం అవ్వడం, పునరుత్పత్తి కాని వనరులు అంతరించి పోవడం, చివరికి ఓజోన్‌ పొర దెబ్బతినడంతో మొత్తం జీవ మనుగడకు భవిష్యత్తు లేదని తేల్చి చెబుతున్నది వాస్తవం. నేడు ఈ వాతావరణ మార్పులు ప్రపంచ పర్యావరణ సంక్షోభాన్ని అత్యంత కీలక దశకు చేర్చింది. నేడు అనేక ప్రకృతి వైపరీత్యాలకు కారణం పర్యావరణం దెబ్బతినిపోవడమే. ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పుకొనేది అంతా పర్యావరణ విధ్వంసంతోనే అనేది అత్యంత విషాదకరం.
    నేటి ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడిదారి సామ్రాజ్యవాద కొర్పొరేట్‌ బహుళజాతి కంపెనీలు పర్యావరణ విధ్వంసానికి కారకులు. అంటే పర్యావరణ సంక్షోభం ప్రకృతి సంక్షోభం కాదని, అది కల్పించిన సామాజిక, ఆర్ధిక సంక్షోభమని గుర్తించాలి. ఈ దోపిడి శక్తుల ఆర్థిక కార్యకలాపాలు పేద దేశాల్లోని ప్రకృతి వనరుల దోపిడి, స్వేచ్ఛవ్యాపారం పర్యావరణ సమస్యను బాగా జఠిలం చేశాయి. జీవులకు-ప్రకృతికి మధ్య లక్షలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అన్యోన్య సంబంధాన్ని, సమతుల్యాన్ని పెట్టుబడి బాగా దెబ్బతీస్తున్నది. 1600 సంవత్సరంలో యూరప్‌ పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుండి పర్యావరణానికి, జీవ జాతులకు కూడా ప్రమాదం మొదలైంది. మానవజాతి చరిత్రలో సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో సంపదను మనిషి సృష్టిస్తున్నాడు. భూగర్భం నుండి ఖనిజ సంపదను వెలికి తీశాడు. పరమాణువును ఛేదించి అద్భుత శక్తిని సృష్టించగలిగాడు. జీవ సాంకేతిక పరిజ్ఞానంతో జన్యు సంకరణచేసి నూతన వంగడాలు సృష్టించాడు. చివరకు గ్రహంతర యాత్రలు కూడా విజయవంతంగా సాగించాడు. అయితే విషాదమేమంటే ఇదంతా పర్యావరణ విధ్వంసం మీద సాధించిన ప్రగతి. ఈ వైరుధ్యం నేడు తారాస్థాయికి చేరి, మనిషి సాధించిన అభివృద్ధికి- ప్రకృతికి మధ్య సమతుల్యం దెబ్బతిని పర్యావరణ హననం జరుగుతుంది. ప్రతి 15 నిమిషాలకు ఒక జాతి అంతరించిపోతూ ఉంది. అడవులు, భూగోళపు ఊపరితిత్తులు. అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ల కళ్లు అడవులపై పడ్డాయి. భారత దేశం సుసంపన్న ఖనిజ సంపద కలిగి ఉంది. దేశంలో మొత్తం 90 రకాల ఖనిజాలు ఉన్నాయి. మన దేశంలో దొరకని ఖనిజం లేదనవచ్చు. నాలుగు ఇంధన ఖనిజాలు, 11 లోహ ఖనిజాలు, 52 లోహేతర ఖనిజాలు, 22 చిన్న ఖనిజాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ సంపదను దోచుకోవడానికి మోదీ ప్రభుత్వ మద్దతు కలిగిన మైనింగ్‌ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇందులో ప్రధానమైనది ఆదాని గ్రూపు. ఛత్తీస్‌ఘడ్‌లోని అటవీప్రాంతంలో గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మైనింగ్‌కు అడ్డుగా ఉన్న గత అటవీ పరిరక్షణ చట్టాలు 1927,1980 లను కార్పొరేట్ల దోపిడికి అనుకూలంగా అటవీ పరిరక్షణ సవరణ చట్టం బిల్లు-2023ను మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించింది. ఈ చట్టం గిరిజన ప్రజలను వినాశనానికి గురిచేయడమే కాక పర్యావరణ విధ్వంసానికి కారణం అవుతూ ఉంది. మోదీ అమలు చేస్తున్న అత్యంత ప్రమాదకర చట్టాలలో ఇది ఒకటి. ఆదాని వంటి కార్పొరేట్‌ శక్తుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవులను యదేచ్ఛగా నరకుతూ, గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చేలా ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చి మేమున్నది సంపన్నులకు సేవ చేయడానికే అని రుజువు చేసుకుంది. దీని ఫలితంగా ఛత్తీస్‌ఘడ్‌, మధ్యభారత అటవీప్రాంతంలో కార్పొరేట్‌ కంపెనీలు 2023 నాటికి గత రెండేళ్లలో 200 కు పైగా హెక్టార్లలో పెద్దపెద్ద మహావృక్షాలను నిర్మూలించారు. ఈ అరాచకాలను అడ్డుకుంటున్న ఆదివాసి గిరిజనులపై పోలీసులు దాడులుచేసి, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఆదివాసి గిరిజనులు ప్రకృతిని రక్షిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ జీవజాతులకు మేలు చేస్తుంటే వారి పట్ల రాజ్యం అమానుషంగా ప్రవర్తించటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం.
    ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి. కాని భారతదేశంలో 21శాతం అడవి ప్రాంతమే ఉంది. ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం గణనీయంగా తగ్గి పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది జీవకోటికి తీవ్ర హానికరం. 2023లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2020 వరకు భారతదేశం ఏకంగా 6,68,400 హెక్టార్ల అటవీ విస్తీర్ణ ప్రాంతాన్ని కోల్పోయింది. ప్రపంచంలోని అత్యంత దారుణంగా అడవులను కోల్పోతున్న దేశాల్లో బ్రెజిల్‌ తర్వాత భారత్‌ రెండవ స్థానంలో నిలిచింది. 2010 నాటికి భారత్‌కు 31.3 మిలియన్‌ హెక్టార్ల సహజ సిద్ధమైన అడవులు ఉండేవి. ఇది భారత భౌగోళిక ప్రాంతంలో 11 శాతం. 2022 లెక్కల ప్రకారం 1,17,000 హెక్టార్ల సహజసిద్దమైన అడవిని మన దేశం కోల్పోయింది. ఈ వినాశనం అంతా ప్రభుత్వాల అనుమతితోనే చెట్లను నరికివేసి, నేలను తవ్వేస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం. అటవీ నిర్మూలన తక్షణం ఆపాలని, సహజసిద్ద ప్రకృతి వనరులను రక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని 1996 లో టీఎన్‌ గోదావర్మన్‌ తిరుమలపాడ్‌ వర్సస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అలాగే రాజ్యాంగంలోని 48ఏ ఆర్టికల్‌ ప్రకారం పర్యావరణం, అడవుల సంరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని రాజ్యాంగం సూచిస్తుంది. వీటిని తుంగలో తొక్కుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా పాలన కొనసాగిస్తున్నది. ఇంత విధ్వంసాన్ని కొనసాగిస్తున్న కార్పొరేట్‌ శక్తులు, వీరికి వంత పాడుతున్న పాలకులను ప్రజలు చైతన్యవంతమై అడ్డుకొని, అడవులు, పర్యావరణం రక్షించుకోకపోతే ఈ భూమి మీద జీవం మిగలదు.

సెల్‌: 9705450705

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img