Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

పార్టీల్లో వ్యక్తి పూజ

పార్టీ స్వామ్యం నశించాలి, వ్యక్తి పూజ నశించాలి. రా బావ ఏంటి ఈరోజు కొత్త స్లోగన్లు మొదలుపెట్టావు. అవును మారుతున్న కాలంలో మారుతున్న మనుషులను చూసి కొత్త స్లోగన్లు పుట్టుకొస్తయి మరి. నిజమే సమాజంలో వ్యక్తిగతంగా సమస్యలు పరిష్కరించు కోవడం సాధ్యంకాక సంఘాలు, సంస్థలు, పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. అంత వరకు బాగానే ఉంది. మనిషికున్న సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీలో మనిషికి ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో పార్టీ స్వామ్యమే కనబడుతోంది. పార్టీలో కూడా అధినాయకుడు తప్ప ఎవరూ కనబడరు. పార్టీ ఏర్పాటు అయ్యే వరకెే ప్రజలు ఆ తరువాత నాయకుల పెత్తనం. ప్రస్తుతం నాయకులకు, మంత్రులకు కూడ స్వేచ్ఛ లేదు. అంతా అధినాయకుడేె చూసుకుంటాడు. నిజమే పదవుల కోసం అధినాయకుడిని వ్యక్తిపూజ మొదలుపెట్టారు. అయితేె నాకొక అనుమానం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రస్తుత ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడేకదా. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేె వ్యవహారంలో చర్చలు మొదలవుతున్నాయి గదా. వారిద్దరి నిర్ణయం రెండు రాష్ట్రాల ప్రజలు ఆమోదించవలసిందేె గదా. అందులో అనుమానమేముంది. తొమ్మిది కోట్ల ప్రజల భవిష్యత్తు వారిద్దరి నిర్ణయంపైనేె ఆధారపడిరదన్న మాట. మన ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల గురించి వారిద్దరి నిర్ణయం ఆమోదించి తలవూపవలసిందేనన్నమాట. ప్రజాస్వామ్యం ఇంత దిగజారిపోతుందనుకోలేదు. కనీసం మంత్రులకు కూడా మాట్లాడటం, నిర్ణయాలను విభేదించే హక్కులేని ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడు చెప్పు నా స్లోగన్లు తప్పు అంటావా. అదిసరెే అటు జగన్‌, ఇటు చంద్రబాబు కేసుల్లో యిరుక్కుని కేంద్రానికి తలవంచి ప్రత్యేక హోదా వదులుకుంటే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది గదా. ఏదైనా భరించవలసిందేె. మనం ఏర్పాటు చేసుకున్న పార్టీలో మనకు మాటాడేె హక్కు లేనపుడు యింకా మన సమస్యలు ఎవరితో చెప్పుకుంటాం. అయినా బావ కేంద్రంలో ఉన్న ప్రధానులు ముఖ్యంగా మోదీ ప్రతిపక్షం లేకుండా ఉంటేె బాగుంటుంది అనుకుంటాడు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని అందులో నేను ఒకడినని పార్లమెంటులో రాహుల్‌ అన్నాడు. ఇలా కేసుల్లో పాలించే నాయకులు ఇరుక్కుని రాష్ట్రానికి కావలసిన వాటిపై పోరాటం చేయకుంటేె మోదీ సర్కారుకు తలవొంచితేె రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది గదా. అంతె మరి. అధికారం కోసం ప్రజలు, పార్టీలు అవసరం. ఆ తరువాత పదవి సొంత సంపాదన ముఖ్యంగా మారుతున్నాయి. పదవులు దక్కిన తరువాత ప్రజలు, పార్టీలతో సంబంధం లేదు. మరల ఎన్నికలు వస్తేనే పార్టీలు అవసరం అవుతున్నాయి. సరెే ఈ వ్యవస్థ మారాలంటే ఏం చేయాలంటావు. ఏముంది పార్టీలను పక్కనపెట్టి ప్రజల అవసరాల కోసం ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకుని కలిసివచ్చే చిన్న పార్టీలను కలుపుకుని హక్కుల కోసం పోరాటం చేయాలి. అంతేతప్ప ఈ పార్టీలను, పార్టీ నాయకులను నమ్ముకుంటేె సమస్యలు అలాగెే ఉంటాయి. ప్రజలేె పోరాటం చేయాలి. ప్రస్తుతం నాయకులు తప్ప పార్టీలు కనబడని ఈ స్థితిలో ప్రజలేె సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. పార్టీలో వ్యక్తి పూజ ఎక్కువైంది. బీజేపీలో మోదీ`షా ద్వయం తప్ప మిగతా నాయకులకు స్వేచ్ఛ ఉన్నట్లు కనబడదు. అలాగెే జగన్‌ ప్రభుత్వంలో కూడా జరగబట్టె యిలా ఘోర ఓటమి పాలయిందని కిందిస్థాయి నాయకులు వాపోతున్నారు. ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబుకు ఎవరూ ఎదురుచెప్పరు. జనసేన నాయకులు ప్రశ్నించవచ్చు. అందుకు ఉదాహరణ యిటీవల ఒక జనసేన నాయకుడు అమరావతి క్యాపిటల్‌ నిర్మాణం మంచిదికాదనీ ఎప్పుడైనా ముంపు ప్రమాదం ఉందని, అలా ముంపునకు గురైన రెండు మూడు రాజధానులను ఉదహరించాడు. అంతేకాక గతంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ యితర మేధావులు చెప్పినవి కూడా ఉదహరించాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అవసరం. ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం చేసినప్పుడు ప్రజల గొంతు వినిపించడానికి ప్రతిపక్షం అవసరం. ఆ అవసరం గుర్తించి ఎంతమంది అనే విషయం పక్కనపెట్టి జగన్‌కు ప్రతిపక్ష నాయకుని హోదా యిచ్చి ప్రజాస్వామ్యవాదిగా చంద్రబాబు చెప్పుకుంటేె బాగుంటుంది. అలా యివ్వని పక్షంలో ప్రజల కోసం జనసేన ప్రతిపక్షంగా మారి ప్రజల గొంతు వినిపించవలసిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img