Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బడ్జెట్‌… కార్పొరేట్లకు వరం కౌలురైతులకు శాపం

 పి.జమలయ్య

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌ కౌలురైతులకు నిరాశ కలిగించింది. తమను గుర్తిస్తుందని, వ్యవసాయ పథకాలన్నీ వర్తింప చేస్తారని ఆశతో ఎదురు చూసిన కౌలురైతులు భంగపాటుకు గురయ్యారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పెట్టుబడి సాయం), ఫసల్‌ బీమా, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు, రుణ ఉపశమనం చట్టం, ప్రకృతి విపత్తుల సహాయం నిధి, ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలకు నిధులు పెంచి చోటు కల్పిస్తారని ఆశించిన కౌలురైతులకు కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది.
ప్రధాని పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు వీరు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తుందని 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తామని అనేక ఆకర్షణీయ మాటలు మోదీ పలికారు. అన్నదాతలైన కౌలు రైతులకు బడ్జెట్‌లో వొరిగిందేమీ లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలతోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కౌలురైతులకు శాపంగాను, కార్పొరేట్లకు వరంగా మారింది. రైతులకు పెద్ద పీట వేశామని చెబుతూనే కార్పొరేట్‌ రంగానికి ఎర్ర తివాచీ పరిచారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కౌలు వ్యవసాయం గణనీయంగా పెరుగుతున్నది. వ్యవసాయమంటేనే కౌలు వ్యవసాయమని, ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న కౌలు రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని, కౌలురైతులను నిర్లక్ష్యం చేయటం తగదని… ఇప్పటికైనా పున:పరిశీలించి కౌలురైతుల సంఖ్యను, వారు సాగు చేస్తున్న భూమిని దృష్టిలో పెట్టుకొని దామాషా పద్ధతిలో నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది.
2024-2025 సంవత్సరానికి కేంద్రమంత్రి ప్రవేశ పెట్టిన రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ విభాగానికి కేటాయించింది కేవలం రూ. 1.27 లక్షల కోట్లు. గత బడ్జెట్‌ కంటే 0.65% మాత్రమే పెరిగింది. గత ఐదు సంవత్సరాల బడ్జెట్లను పరిశీలిస్తే వ్యవసాయ, అనుబంధం రంగాల్లో కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. 2019-2020 సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 5.44% కేటాయిస్తే 2024-2025 సంవత్సరానికి కేవలం 3.08 శాతం మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 2019 నుండి వరుసగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్‌ తగ్గించుకుంటూ వస్తూనే ఉన్నారు. బడ్జెట్‌ కేటాయింపులే కాదు, ఖర్చు పెట్టకుండా నిధులను మురగ పెడుతున్నారు. 2018 నుంచి 2022 వరకు పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయించిన కేటాయింపులలో సుమారు రూ. 1 లక్ష 5 వేల కోట్లను ఖర్చు చేయకుండా తిరిగి అప్పగించడం అంటే రైతులు మీద ఎటువంటి ప్రేమ ఉందో అర్ధమవుతుంది. దేశంలో రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి రైతు కుటుంబం 90 శాతం అప్పుల్లో కూరుకుపోయారు. రైతాంగాన్ని ఆత్మహత్యల నుంచి కాపాడటానికి ఈ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం శోచనీయం. దిగుబడులు నిల్వ చేయటం, సరఫరా మార్గాలు, ప్రాథమిక, సెకండరీ స్థాయిలో ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ వంటి వాటిలో ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యాన్ని పెంచి పోషించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయటం అంటే భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు అప్పగించడం తప్ప మరొకటి కాదు. చిన్న, సన్నకారు కౌలు రైతుల గురించి ఈ బడ్జెట్‌లో ఊసేలేదు. రైతు ఉద్యమాన్ని చూసి భయపడి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినప్పటికీ దొడ్డిదారిన ఆ నల్ల చట్టాలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రాథమికమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల రేట్లు విపరీతంగా పెంచేశారు. వీటిపై 18శాతం జీఎస్టీతో ధరలు పెరిగి సాగు భారమైంది. వ్యవసాయానికి మూలాధారమైన ఎరువుల సబ్సిడీలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. 2022-23 సంవత్సర బడ్జెట్లో రూ.2,51339 కోట్లు కేటాయించగా 2023-2024 సంవత్సరంలో రూ.1,88,894కు తగ్గించారు. 2024-25 ఏడాదికి రూ.1,64,000 కోట్లు కేటాయించి చేతులు కడిగేశారు. వ్యవసాయంలో ఎక్కువగా వాడే యూరియాకు కూడా బడ్జెట్లో నిధులు తగ్గించుకుంటూ వస్తూనే ఉన్నారు. కౌలురైతులకు, చిన్న, సన్న కారు రైతులకు పరపతి సౌకర్యం అందటం లేదని, వడ్డీ వ్యాపారుల కనుసన్నలోనే వ్యవసాయం చేస్తున్నారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా రైతులను ఎలా అదుకుంటారు?. ఇది పెద్ద ప్రశ్నగా మిగిలి పోతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం, కౌలు రైతులకు ఎటువంటి షూరిటీ లేకుండానే రూ.1,60,000 మేరకు ప్రతి కౌలురైతుకు పంట రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కడా అమలు చేసిన పరిస్థితిలేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు సంభవించి రైతుల కష్టార్జితం బుగ్గిపాలవుతుంటే విపత్తుల నుండి ఆదుకోవడానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా, రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామని ప్రకటించటం వొట్టి బూటకం. ఆరుగాలం కష్టపడి పంటల పండిరచి మార్కెట్‌కి తీసుకొస్తే వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి రైతుల శ్రమను దోచుకు తింటుంటే మద్దతు ధరలకు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించి రైతులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మార్కెట్‌ శక్తులకు లాభసాటిగా ఉండే విధంగా వ్యవహరించడం అంతకన్నా ఘోరం మరొకటి లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇ-నామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) ఆచరణలో మధ్య దళారులకు ఉపయోగపడుతుంది. మాటల్లో రైతుల గురించి, చేతల్లో కార్పొరేట్‌ ప్రయోజనాల గురించి ఆలోచించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పెట్టుబడి సాయం)పథకాన్ని కౌలురైతులకు వర్తింప చేయక పోవడం అన్యాయం. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, ప్రతి సంవత్సరం రైతులు, కౌలు రైతులందరిని కలుపుకుంటే రూ.75 వేల కోట్ల అవసరం. కానీ గత రెండు సంవత్సరాలుగా రూ.60 వేల కోట్లు కేటాయించి సరిపుచ్చుతుంది.
పంటల భీమా పథకం సంబంధించి 2022 -24 లో బడ్జెట్‌ లో రూ.15000 కోట్లు కేటాయించగా దాన్ని 2024-25 బడ్జెట్‌ లో రూ.14600 కోట్లుకు తగ్గించారు. ప్రైవేట్‌ బీమా కంపెనీలకు ఉపయోగపడే పద్ధతుల్లో పంటల భీమా పథకం ఉంది ప్రస్తుతం ఉన్న పథకాన్ని సవరించి సమగ్ర పంటలు కావాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రైతులకు మద్దతు ధరలు అందించే పీఎం ఆశా పథకానికి కూడా ఈ బడ్జెట్‌లో 21శాతం నిధులు తక్కువ కేటాయించారు. పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు గత సంవత్సరం రూ.9505 కోట్ల కేటాయించి సవరించిన బడ్జెట్లో రూ.450 కోట్లు కుదించారు. ఈ సంవత్సరం ఏకంగా 39.10% (రూ.584 కోట్లు)తక్కువగా కేటాయించి చేతులు ఎత్తి వేశారు. కౌలురైతుల్లో ఎక్కువ వ్యవసాయ కార్మికులే. అటువంటి వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకానికి నిధులను పెంచడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచి అందరికీ ఆహార బాక్స్‌ ఏర్పాటు చేసి మరింత సహాయం అందించాలి కానీ 2023 -24 బడ్జెట్‌ లో రూ. 1,37,36 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేశారు. వీటితో పాటు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, పంటల రుణాలు, భీమా పరిహారం, పంటలు అమ్ముకోవడానికి వెసులుబాటు లేకపోవడంతో కౌలురైతులు నష్టపోతున్నారు. కెేరళ తరహ పద్ధతుల్లో కౌలు రైతుల సాగు కోసం చేసిన అన్ని రకాల అప్పులను మాఫీచేసి ఆత్మహత్యల నుండి రక్షించడానికి రుణ ఉపశమన చట్టం తక్షణం చేయాలి..
ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img