Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

భావనలకు కాదు… శ్రమైక సౌందర్యానికి విలువిద్దాం

డాక్టర్‌ దేవరాజు మహారాజు

మతమేదైనా, దేవుడెవరైనా అన్న ఆదిమ సమాజంలో రూపుదిద్దు కున్న భావనలే. అలాగే మతమేదైనా సరే, కష్ట జీవుల్ని ఎప్పుడూ ఎక్కడా గుర్తించలేదు. సరికదా, వారిని బానిసలుగా మార్చి హింసించింది. ఆ బాధ పడలేక వారు ఒక మతంలోంచి మరో మతంలోకి మారుతూ వచ్చారు. అయినా వారిచే ఎక్కడా ప్రశాంతమైన జీవితం లభించలేదు. ఆధిపత్యం నెరపేవారికీ, అణగదొక్క బడిన వారికీ మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూనే వచ్చింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. పైపైన కొన్ని మార్పులు జరుగుతున్నట్టు కనిపించినా, మనుషుల మెదళ్ళలో విభజనలు అలాగే ఉన్నాయి. అనాదిగా అన్ని మతాలకు సంబంధించిన విగ్రహాలు, ప్రతిమలు, రూపాలు కొన్ని కోట్లలో తయారవుతూ వచ్చాయికదా? మరి వాటిని రూపొందించిన శ్రామికుల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? గుడ్డిగా గుండంలోనో, పుష్కరిణిలోనో, నదిలోనో మునిగి, గుడిలో దేవుడి ప్రతిమకు తమ కోర్కెల చిట్టా సమర్పించుకుని రావడంతప్ప ప్రతి అడుగునూ అందంగా తీర్చిదిద్దిన శ్రామికుల కృషి గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరూ ? అవన్నీ ఉన్నపళాన ఏ దేవుడూ.. సృష్టించినవి కావు. అసలు ఏ దేవుడు తన ప్రతిమ/విగ్రహాన్ని/శిల్పాన్ని తానే తయారు చేసుకోలేదన్నది నిజం. ఇటీవలి అయోధ్య రామాలయంలోనైనా, యుఎఇలో భారత ప్రధాని డాబుగా ప్రారంభించి వచ్చిన ఆలయంలో నైనా దేవుళ్ళ ప్రతిమలు మనుషులు రూపొందించినవే కదా? గోపురాలు, ఆలయాల శిల్ప సౌందర్య శోభ అంతా మనుషుల కృషేనన్న సంగతి క్షణమాత్రమైనా ఆలోచించరు. వారి సౌందర్య దృష్టిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభినందించరు. ఇవన్నీ ఆలోచించగలవాడు విజ్ఞుడు. వీటిని పట్టించుకోకుండా మూఢత్వంలో మునిగే జనమే ఎక్కువ! ఈ పరిస్థితి మారాలి!! మూఢత్వంలోనే పరమానంద భరితులవుతూ కెమెరాలకు పోజులిచ్చే మన దేశ నాయకులకు ఎలాగూ ఈ పరిస్థితి మారాలనీ ఉండదు. ఆదిమమానవుడి ఒక అజ్ఞానపు భావనకు వంగి దండం పెడతారు. ఆ భావనకు ఒక రూపాన్నిచ్చిన శిల్పకారుడి ‘శ్రమ’ ను మాత్రం కనీసం గుర్తించారు – ప్రశంసించారు. అంటే ఏమిటే? పట్టించు కోవాల్సింది పట్టించుకోరు. అవసరంలేనిది విపరీతంగా పట్టించుకుని తమను తాము భక్తుల జాబితాలో చేర్చుకుంటారు. మనిషి ఏ కాలం వాడైనా, అతని కృషి ఏరూపంలో ఉన్నా గుర్తించగలిగిన వాడే. మానవవాది! దైవ దర్శనం చేసుకున్నామని కాకుండా ‘‘స్థలాల విహారయాత్ర అని అనుకుంటే- వందల, వేలయేళ్ళ నాటి మన పూర్వీకుల సౌందర్య దృష్టికి, సాంకేతిక పరిజ్ఞానానికి అబ్బురపడినట్టు- దాన్ని అర్థం చేసుకున్నట్టు. వాటిచుట్టూ అల్లుకునిఉన్న చారిత్రక, సామాజిక, సంగీత, సాహిత్యాల గూర్చి తెలుసుకోవడం మరొక శోధన. ఆదిమ సమాజంలో రూపుదిద్దుకున్న ఒక అమాయకపు లేదా అజ్ఞానపు ఆలోచన దైవభావన అయితే, దాని చుట్టూ మహా సంగీత, సాహిత్య పండితు లంతా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఒకరకంగా వారు ఆయా కాలాలకు తగినట్టు ప్రవర్తించారేమో కానీ, ఇప్పటితరం ఏం చేయక ఆయా కళాకారుల ప్రతిభను గుర్తించి అందులో నిక్షిప్తమైన భక్తిని, దైవ భావనని వదిలేయాలి. పండుతిని టెంక వదిలేస్తున్నాం కదా? సంగీతాన్ని ఆనందిస్తూనే అందులో ఉన్న భావనను వదిలేయాలి. సంగీతాన్ని, సాహిత్యాన్ని మధించిన మహాను భావులం తా తమ శక్తినీ, ప్రతిభను మనిషి కేంద్రంగా ప్రదర్శించలేకపోయారేనని విచారించాలి. మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయి దుర్బలులయ్యారేనని బాధపడాలి. వారి కీర్తనలు, వారి కృతులు మనిషి ఔన్నత్యాని ఎలుగెత్తి చెప్పలేక పొయ్యాయి. వారి ప్రతిభను వారిలోని మూఢత్వం కప్పేసింది. రాగల కాలాలలో మానవ విజయ దుందుభిని శ్లాఘించే సంగీత, సాహిత్యాలు వస్తాయి. కాలానికి అనుగుణంగా ఎదగని సంగీత, సాహి త్యాల్ని జనం వదిలేసి ముందుకు వెళ తారు. రామాయణాలురాసి జ్ఞాన పీఠాలు తెచ్చునునే మూఢ పండితోత్తములు మనకు భవిషత్తులో ఉండకపోవచ్చు. మనిషి – జీవనయానంలో, మనిషి-సామాజిక పరిణామక్రమంలో వచ్చిన వాటిని కాదనలేం. కానీ, ప్రతి అంశంలో మానవుడి శ్రమ, సౌందర్య పిపాసను అర్థం చేసుకుంటూ వస్తే, ఆధునిక ఆలోచనా ధోరణికి అనుగుణంగా ఎదిగి ఆలోచిస్తే, మూఢ భక్తిలో కృంగి కృశించి పోవడానికి వీలుండదు. ఏ విగ్రహానికి ఏ మహత్తు ఉండదు. ఏ దేవుడూ ఎవరి కోర్కెలూ తీర్చలేదు అని గట్టిగా నమ్మిన వారి ఆలోచన వేరుగా ఉంటుంది. ‘మాకు దైవశక్తి మీద విశ్వాసముంది’ అని అనుకునే వారితో మనకు పేచీలేదు. వారి నమ్మకం వారిది. పురాతన కాలంలో ఎప్పుడో మనిషి గీసుకున్న సరిహద్దుల్ని దాటి, బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆలోచిస్తామన్న వారిని ఆలోచించ నీయాలి. వారిపై దాడులు చేయకూడదు. మీ విశ్వాసం మీకు ఉన్న ప్పుడు, వారి విశ్వాసం వారికి ఉంటుంది కదా? అంత మాత్రానికి మానసికంగా హింసిం చడం, చంపేయడం చేస్తారా? వారికి ఆ హక్కు ఎవరిచ్చారు? నిజానికి మూఢ విశ్వాసాలవల్ల, దైవ భావనల వల్ల ప్రగతి సాధ్యం కాలేదు. స్వేచ్ఛాలోచనా పరులతోనూ వైజ్ఞానిక,సాంకేతిక శ్రమజీవులతోనే ప్రగతి సాధ్యమవుతూ వ స్తోంది! ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి స్మృతి చిహ్నంగా సమాధి కట్టడం వాడుకలో ఉంది. షాజహాన్‌ చక్రవర్తి గనక, భార్య ముంతాజ్‌ మహల్‌ స్మృతిలో అద్భుతమైన తాజమహల్‌ నిర్మించాడు. ఆర్థిక స్థోమతలను బట్టి కట్టడాలట. ఉంటాయి. అలాగే, అన్ని మతాల అన్ని పుణ్య క్షేత్రాలూ స్మృతి చిహ్నలే. ఒక మహానుభావుడి స్మృతిలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అందులో ఏముంటాయి? ఆయన చిత్ర పటాలు, వాడిన వస్తువులు, ఆయన జీవన శైలికి, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలూ ఉంటాయి. ఆయన మాత్రం ఉండడు. అలాగే ఏ దేవుడికి సంబంధించిన ఏ క్షేత్రంలో నైనా దేవుడు ఉండడు. ఆయన ఉన్నాడన్న భావన చుట్టూ అల్లుకున్న సరంజామా – సంరంభం మాత్రమే ఉంటాయి. మనిషి తన ప్రాథమిక దశలో దేవుడి పట్ల ఏర్పరుచుకున్న ఊహలకు, భ్రమ లకూ ప్రతిరూపాలు మాత్రమే అక్కడ ఉంటాయి. దైవ భావన మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ భావన వల్ల జనానికి జరిగే మేలుఏమీ ఉండదు. ఏమతానికి సంబంధించిన ఏ దేవుడి మీద ఎంత భక్తి పెంచుకున్నా ఒరిగేది శూన్యం. అద్భుతాలేవీ జరగవు. . దైవశక్తితో జరిగాయని ప్రచారం చేసుకున్న వన్నీ నిరూపణ కాలేద కావు కూడా! జరిగినవి, జరగబోయేవి అద్భుతాలేమైనా ఉంటే అవి మనిషి తన సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంతో సాధించుకున్నవే. ఇక ముందు సాధించుకోబోయేవే. అందువల్ల అన్ని మతాల దైవక్షేత్రాల్నీ స్మృతి చిహ్నాలనుకుంటే గొడవే ఉండదు. దైవ భావనకు కట్టుకున్న సమాధులనుకుంటే, అప్పుడు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంటుంది. పైగా విశ్వనరుడి ఆవిర్భావం జరుగుతుంది. ఒక మత కేంద్రానికి లేదా ప్రార్ధనా స్థలానికి లేదా పుణ్యక్షేత్రానికి మీరు వెళ్ళి మొక్కుతు న్నారంటే- అర్ధం ఏమిటీ? ఎప్పుడో వేల వేల ఏళ్ళ క్రితం మన పూర్వీకులు ఏర్పరుచుకున్న భావనకు నమసరిస్తున్నారన్నమాట! పూర్వీకుల్ని వారి భానని గౌరవించుకుంటున్నారన్న మాట. అంతేగాని, నిజంగా దేవుడనే వాడు అక్కడ ఉన్నట్టు కాదు. ఆయన మీ గొంతెమ్మ కోరెల్ని తీరుస్తాడనీ కాదు. కాలక్రమంలో ఆ దైవభావన చుట్టూ అభివృద్ధి చెందిన వ్యాపారం ఇతోధికంగా కొనసాగడానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారన్నమాట! సంపూర్ణ మానవుడు పరిపూర్ణ మానవుడు ఎప్పు డైనా మానవశక్తినే నమ్ము కుంటాడు. మానవీయ విలువలకే ప్రాధాన్య మిస్తాడు. ఇదికాక మరేవో అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడేవారు ఎలాంటి అసంపూర్ణ జీవులన్నది.. మనం ఆలోచించాలి. మనుషుల్ని కులాలుగా, మతాలుగా, లింగ పరంగా, ప్రాంతపరంగా విభజించే వాడు రాజకీయ నాయకు డవుతాడు. లేదా మత బోధకుడవుతాడు. అంతేగాని పరిపూర్ణ మానవుడెలా అవుతాడు? వీరికన్నా జంతువులు, పక్షులు, కీటకాలు నయంకదా? అవి తమని తాము విభజించు కోవు. ప్రఖ్యాత కన్నడకవి గోపాలకృష్ణ అడిగ అంటారు` నీరు మరిగి ఆవిరవు తుంది/ విద్యుత్తు అవుతుంది. వర్షంగా వర్షిస్తుంది / నది నీరా చెరువు నీరా/ బావిలోని మంచి నీరా ? / చెరువులోని ఉప్పు నీరా ?! మంటలోని మురికి నీరా ? ఏమో -/ అనంతాకాశంలో కలుసుకున్నప్పుడు / నీరంతా ఒక్కటే- తేడా లేదు! ఇప్పుడు చెప్పండి ఇందులో కుల ప్రసక్తి ఎక్కడుందీ? అది మీరు మట్టిలో నాటి మీ ఇష్ట ప్రకారం పెంచి పోషించింది కాదూ ? అన్నది ఆయన కవితాత్మకంగా వెలిబుచ్చిన ఆ వేదన ! మనుషులు విడిపోవడమే కాదు, ప్రార్ధనా స్థలాల్ని విడగొట్టుకోవడం. మళ్ళీ వాటికోసం పొట్లాడుకోవడం… మన గొప్ప సంస్కృతిలో భాగమా? ఆలోచించు కునే పనేలేదా? సమకాలీన సామాజిక, రాజ కీయ పరిస్థితుల్ని కవి గోపాలకృష్ణ అడిగ యాభై ఏళ్లకు ముందే ఊహించి, ఈ కవిత రాసి ఉంటారు. కవి దార్శని కుడు కావడమంటే ఇదే- ఉన్న మను షుల ఇళ్ళు బుల్డోజర్లతో కూలగొట్టి, లేని దేవుళ్ళకు గుళ్ళుకట్టే విజ్ఞతలేని పాలకులు వస్తారని మాత్రం ఆయన ఊహించి ఉండరు. ఎందుకంటే మూర్ఖత్వం ఏ అంచ నాలకూ అందదు!
సుప్రసిద్ద సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img