London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మెరుపుల మరకలు

చింతపట్ల సుదర్శన్‌

పొద్దున్నే భౌభౌ మంటూ తనను నిద్రలేపే డాగీ, భౌభౌలకు బదులు దీర్ఘంగా మూలుగుతుండటంతో మెలకువ వచ్చింది డాంకీకి. ‘సంథింగ్‌ ఈజ్‌ రాంగ్‌’ అనుకున్న డాంకీ ఏమైంది తంబీ, ఎందుకా మూలుగు, ఎగ్జిట్‌ పోల్‌ సర్వే నిజమై ఓడిపోయానని కలగన్న రాజకీయ నాయకుడు నిద్రలో మూలిగినట్టు మూలుగుతున్నావు అంది డాంకీ.
మూలుగు క్షణం ఆపి నాయకులకూ, నాకూ పోలిక పెట్టకు. వాళ్లది ‘పొట్ట’ పెంచుకునే తిప్పలయితే నాది పొట్ట తిప్పలు. కుక్క బతుకు కదా. పొట్ట నింపుకోవడం కోసం నానా అగచాట్లు పడవలసి వస్తుంది. అంటూ మళ్లీ మూలిగింది డాగీ. సరే నీది కుక్క బతుకే. పొట్ట తిప్పలే. ఇంతకీ ఇప్పుడు నీ పొట్టకు వచ్చిన తిప్పలేమిటి? ఏం చెప్పను? పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టున్నాను. పొట్ట లోపలి ప్రేవులు ఈ మూల నుంచి ఆ మూలకు చుట్టచుట్టుకు పోయినట్టున్నవి. ఒకటే నొప్పి. ఇది మూమూలు నొప్పి కాదు, ఏ కుక్కయినా, భౌభౌలు మానేసి దీర్ఘంగా మూలుగవలసిన నొప్పి అంది డాగీ.
అందుకే అంటానే మనుషుల్లా పొట్టకి కావలసిన దానికంటే ఎక్కువ మెక్కవద్దని. వాళ్లంటే నానా గడ్డీ తిని పొట్టలు పెంచుకోవడం మామూలే. కానీ గాడిదలమూ, కుక్కలమూ అలా కాదుకదా! దొరికిందైనా ఎంత తినాలో అంతే తిని ఊరుకుంటాం కాని మరొకళ్లది లాక్కుని తినం కదా. మరి ఇందుకు విరుద్ధంగా నువ్వు ఏదైనా తలతిక్క పని చేయలేదు కదా అంది డాంకీ. అదేం లేదు నా సంగతి తెల్సు కదా. ఒక కుక్క చిక్కితే మరో కుక్కతో ‘షేర్‌’ చేసుకుంటాను కాకపోతే ఓ తెలివితక్కువ పని చేయడం వల్ల ఈ ‘ఎమర్జెన్సీ’ వచ్చింది. ఏమిటో అది అనడిగింది గాడిద. ఈ మధ్య ఊళ్లో స్టార్‌ హోటళ్లు ఊపందుకున్నయి కదా! స్టార్‌ హోటళ్లలో కుక్కలకి ఏం పని? ఖరీదైన మనుషులు అక్రమంగా సంపాదించిన డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టటం కోసం కదా అంది డాంకీ.
కర్మఫలం అనుభవించక తప్పదు గదా బ్రదర్‌. ఎప్పటిలాగే మాంసం కొట్టు ముందు దొరికే ఎముకలు నవిలితే సరిపోయేది. కొత్తగా మంత్రి అయినోడూ, కొత్తగా బిచ్చగాడూ పొద్దు ఎరగడు అంటారు కదా అలాగ నేనూ పప్పులో ‘లెగ్గు’ పెట్టాను. రోజూ పచ్చి మాంసం ఏంతింటాం లెద్దూ స్టార్‌ హోటళ్లలో ఘుమఘుమలాడే మసాలాలు దట్టించిన మాంసం తినమని నా ‘టేస్ట్‌ బడ్స్‌’ సలహా ఇవ్వడంతో ఓ పెద్ద స్టార్‌ హోటల్‌ వెనక కాంపౌండ్‌ వాల్‌ మీది నుంచి విసిరేయబడ్డ మాంసాన్ని మన వీధిలో కుక్కలందరం రేవ్‌ పార్టీ జరుపుకుని సుష్టుగా తిన్నాం. ఇప్పుడవస్థ పడుతున్నాం. రేవ్‌ పార్టీ అంటే అర్థం తెలీకుండా వాడకు. నువ్వేమన్నా మీడియా వారూ, పేపర్ల వాళ్లూ జాగ్రత్తగా ‘అవాయిడ్‌’ చేసే పేరున్న సెలబ్రిటీవా, డ్రగ్‌ అడిక్ట్‌వా, ఉమనైజర్‌వా. అయినా నాకొక మాట చెప్పాల్సింది. ఈ మధ్య న్యూస్‌ పేపర్లల్లో వస్తున్న వార్తలు తెల్సినవాడ్ని. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు. పేరుకే నక్షత్రాలు అంటించుకున్న హోటళ్లు. రోడ్ల మీద టిఫిన్లు అమ్మే బండ్ల కన్నా అధ్వాన్నంగా ఉన్నాయట. మనుషులు వెళ్లి కూచోగానే వినయంగా వచ్చి వెయిటర్‌ అందించే ‘మెనూ’ లో ఉన్న ‘ఐటెమ్స్‌’ అన్నీ చెత్తాచెదారం నిండి ఉన్న ‘కిచెన్‌’ నుండి వస్తయని ఎవరనుకుంటారు. వీళ్లు తినే మాంసం పదిరోజుల కిందటిదని, పాచిపోయిన మాంసం అని, వీళ్లకు ఇడ్లీలు తడుపుకోడానికి ఇచ్చే సాంబారులో బొద్దింకలు స్విమ్మింగ్‌ నేర్చుకుంటాయని. కలుషితమైన ఆహారం అందంగా ప్లేట్లలో అలంకరించి జనం చెవుల్లో క్యాబేజీలు, కడుపుల్లో అల్సర్లూ పెడ్తున్నార్ట. ప్రభుత్వ అధికారుల తనిఖీల్లో ఈ హోటళ్లన్నీ ‘పైన పటారం లోన లొటారం’ అన్న సంగతి బయటపడ్తు న్నదట. అందుకే ఊళ్లో ఉన్న రెండు పెద్ద హోటళ్లకు తాళాలు పడ్డవి. ఈ మనుషులు దేన్నీ వదలరు. అన్నింటా కల్తీలు చేసి తమ వాళ్లను తామే చంపుకునేట్టున్నారు. డబ్బు కక్కుర్తితో ఏ పాపమయినా మూట కట్టుకుంటారు. ఊళ్లో ఉన్న అన్ని ‘స్టార్‌’ లూ మూసేయిస్తే సరి అంది డాగీ మూలుగు కంటిన్యూ చేస్తూ.
అదేం కుదరదులే. ఊరికే పైపై తనిఖీలే ఇవన్నీ. వేపిన తాళలు తెరుచుకోవడం ఎంతసేపు. పైసా పరమాత్మ ఏవైనా చెయ్యగలడు. నాల్రోజులు పోతే అంతా మామూలే మరి. కుక్కతోక వంకర అంటారు. కానీ, పైకి కనబడని మనుషుల తోకలూ అంతే. అనవసంగా వండిన మసాలా మటన్‌కు బలైపోయావు. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డు’ అన్నారు. ఎప్పటిలాగే మాంసం కొట్టును నమ్ముకో అంది డాంకీ. బుద్ధి వచ్చింది. కానీ ఇప్పుడీ ‘పెయిన్‌’ తగ్గే మార్గంచెప్పు అంది డాగీ. ఇవ్వాళ ఎలక్షన్‌ రిజల్ట్సు వస్తయి. ఊరంతా హడావిడిగా ఉంటుంది. మందు షాపులు బందయినా ఇళ్లల్లో స్టాకు తెచ్చిపెట్టుకున్నోళ్లెందరో. ఇక పశువుల ఆసుపత్రి తెరుస్తారో లేదో తెరిచినా డాక్టర్‌ వస్తాడో రాడో! మీ కుక్కలకి అలవాటే కదా ఏ గడ్డిపరకో, ఏ ఆకో నమిలి ఈ పూట గడుపు. తగ్గకపోతే రేపెళ్దాం ఆసుపత్రికి అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి.
కొనుక్కున్న ఓట్లన్నీ పడ్తాయో లేదోనని కొందరు, చెప్పిన అబద్ధాలన్నీ జనం నమ్మారో లేదోనని కొందరు హైరానా పడే కౌంటింగ్‌ రోజిది. ఈ ప్రజలు తమ ధనమాన, ప్రాణాలు ఎవరి చేతిలో పెట్టారో తేలిపోయే రోజిది అంది డాంకీ. డాగీ మాత్రం మూలుగు ఆపలేక కంటిన్యూ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img