London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

మోదీని ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పిస్తుందా…!

ఎం కోటేశ్వరరావు

నేతిబీరలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు, మమకారంలో కారం ! ఇలాంటివి పిల్లల ఆటల్లో చూస్తాం. నరేంద్రమోదీ ఆకర్షణ కూడా అలాంటిదే అని సంఘపరివారం భావిస్తోందా ? వాజపేయి, అడ్వాణీలనే పక్కన పెట్టిన వారికి మోదీ ఒక లెక్కా ? ఒక ప్రకటన చేయటం, దాని మీద స్పందనచూసి సానుకూలంగా ఉంటే కొనసాగింపు లేకుంటే వెంటనే మాటమార్చటం తెలిసిందే. మోదీ కూడా పరివారంలో ఇతరుల మాదిరే తప్ప ప్రత్యేకతేమీ లేదనే సందేశాన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన ఉపన్యాసంలో వెల్లడిరచారు. ఈ సందర్భంగా దానితో పాటు కలగలిపి చెప్పిన సుభాషితాల్లో విశ్వసనీయత, చిత్తశుద్ధి, నిజాయితీ గురించి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. రచ్చ కూడా మొదలైంది. మోదీ ఎలా స్పందిస్తారో, తన మద్దతుదార్లను ఎలా సమీకరిస్తారో చూడాల్సి ఉంది. గందరగోళం సృష్టించటానికి తమ నేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది. సంఫ్‌ుబీజేపీి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, భగవత్‌ వ్యాఖ్యలను అసందర్భంగా పేర్కొన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. 2014, 2019 ఎన్నికల తరువాత చేసిన ఉపన్యాసాలకు, తాజా ఎన్నికల తరువాత చేసిన దానికి పెద్దగా తేడాలేదని. నరేంద్రమోదీ లేదా ఏ బీజేపీి నేతను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకుంది. తమ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం తప్ప సంస్థ అధికారిక వైఖరికి ప్రతిబింబం కాదన్నది. నిజమైన సంఘసేవకులు పొగరుబోతులుగా ఉండరని మోహన్‌ భగవత్‌ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌ శిక్షణా సమావేశంలో సెలవిచ్చారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే మోదీనే అని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. మోదీని హెచ్చరించే ధైర్యం పరివార్‌కు ఉందా, తమకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు అవసరం లేదని చెప్పిన బీజేపీి అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి అని కొందరన్నారు. తన జన్మ మామూలుది కాదని, దైవాంశ సంభూతుడనని నరేంద్రమోదీ చెప్పుకున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి చప్పుడు చేయలేదు. 2018 నుంచి ఎన్‌డిఏ కూటమి కన్వీనర్‌ లేరు, సమావేశాలు జరిపింది లేదు, మిత్రపక్షాలను ముఖ్యమైన అంశాలమీద సంప్రదించిన దాఖలాలు లేవు. అహంకారం, ఏకపక్ష ధోరణే. రైతుల ఆందోళనపట్ల అనుసరించిన వైఖరిని చెప్పనవసరం లేదు. చివరికి అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి వంటి పెద్దలతో మార్గదర్శక మండలిని ఏర్పాటుచేసి దానితో ఒక్క సమావేశం జరపకపోయినా, రామమందిర ప్రారంభోత్సవానికి అడ్వాణీని రావద్దని చెప్పినప్పుడు గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు, సుద్దులుబుద్దులు చెప్పలేదు. పదేళ్ల్ల పాలన తరువాత సంపూర్ణ మెజారిటీ రాకపోవటం, అయోధ్య రామాలయం ఉన్న చోట బీజేపీి మట్టికరవటం, మణిపూర్‌లో పరాభవం వంటి పరిణామాల తరువాత మోదీని కాపాడేందుకే భగవత్‌ రంగంలోకి దిగారనే అభిప్రాయం కూడా ఉంది. గతంలో కూడా అలాగే జరిగిందని కొందరు గుర్తు చేస్తున్నారు. కాదు తమ హిందూత్వ అజెండాకు మొదటికే మోసం వచ్చినందున మోదీని మందలించటం, తరువాత తప్పించేందుకు ముందుగానే పావులు కదిపారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
రెండు నాలుకలతో మాట్లాడటం, ఆ జేబులో ఒక స్టేట్‌మెంటు ఈ జేబులో మరో స్టేట్‌మెంటు పెట్టుకొని తిరిగే వారిలో సంఘపరివార్‌ దళం కూడా ఉంది. ఉదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ అహంకారం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో భగవంతుడు రాముడు బీజేపీ సీట్లను 241వద్దనే నిలిపివేసినట్లు, సంపూర్ణ మెజారిటీకి దూరం పెట్టినట్లు ధ్వజమెత్తారు. జైపూర్‌ సమీపంలోని కనోటా వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో జూన్‌ 13వ తేదీన మాట్లాడుతూ రామభక్తులు క్రమంగా అహంకారులుగా మారారు. ఆ కారణంగానే రాముడు ఆ పార్టీని అతి పెద్దపార్టీగా 241 సీట్ల వద్ద నిలిపాడని అన్నారు. ఇదంతా మోహన భగవత్‌ వ్యాఖ్యల తరువాతే జరిగింది. ఇంద్రేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి నిరసన వెల్లడికావటంతో నష్టనివారణ చర్యగా ఆ సేవక్‌ మాట మార్చారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారానికి దూరంగా ఉన్నారు. అనుసరించినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మరుసటి రోజు చెప్పారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రి పగలు పనిచేస్తున్నదని, దేశం ఎంతో పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో జనం ఉన్నారని ఆకాశానికి ఎత్తారు. మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన రచ్చ గురించి ప్రశ్నించగా దాని గురించి సంఫ్‌ు అధికారిక ప్రతినిధులను అడిగితే మంచిదని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
మోహన్‌ భగవత్‌ చెప్పిన హితవులో మణిపూర్‌ హింసాకాండ అంశం కూడా ఉంది. ‘‘ఈ ఈశాన్య రాష్ట్రంలో చూస్తుంటే ఎట్టకేలకు తుపాకి సంస్కృతి అంతమైనట్లుగా కనిపించింది, అయినప్పటికీ ‘‘ఆకస్మికంగా’’ హింసాకాండ చెలరేగింది. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది’’ అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.‘‘గత పది సంవత్సరాల్లో మణిపూర్‌లో హింసాకాండ లేదు. కానీ పరిస్థితి దిగజారింది. శాంతియుత పరిస్థితి కోసం గత ఏడాదిగా ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.’’ అన్నారు. మణిపూర్‌, కేంద్రంలోనూ రెండు చోట్లా స్వయం సేవకులే పాలకులుగా ఉన్నారు. హింసాకాండ చెలరేగి వందలాది మంది మరణించారు, వేలాదిమంది నెలవులు తప్పారు. గిరిజన మహిళలను వివస్త్రలుగా ఊరేగించిన ఉదంతం వెలుగుచూడకుండా చేసేందుకు అదే సేవకులు పాటుపడ్డారు. అది బయటకు వచ్చిన తరువాత అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిరావాల్సిన కేంద్ర సేవక్‌ కదలేదు, మెదల్లేదు. ఇదేం పని అంటూ ప్రధాన సేవక్‌ ప్రశ్నించిన దాఖల్లాలేవు. చెంపదెబ్బ మాదిరి లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో బీజేపీి ఓడిపోయిన తరువాత మోహన్‌ భగవత్‌ సుభాషితాలకు పూనుకున్నారు. అక్కడ హిందువులైన మెయితీలు, క్రైస్తవులైన గిరిజన కుకీలు బీజేపీని మట్టికరిపించారు. రెండిరజన్లు పనికిరానివిగా తేల్చారు. గుజరాత్‌ మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని చెప్పిన అతల్‌ బీహారీ వాజ్‌పేయి మాటలనే పూచికపుల్లగా తీసిపారేసిన, మార్గదర్శక మండల్‌ పేరుతో సీనియర్ల కమిటీ అంటూ వేసి దాన్ని విస్మరించిన మోదీ గురించి జనానికి తెలిసినా మోహన్‌ భగవత్‌కు తెలియదంటే నమ్మలేము. స్వయం సేవకుల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img