Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి

డా॥ కత్తి పద్మారావు

భారతదేశంలో శాస్త్రీయ భావజాలంపై ఒక నిర్మాణాత్మకమైన ప్రత్యామ్నాయ హిందూ పౌరాణిక వ్యవస్థ దాడి చేస్తుంది. మొత్తం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ధ్వంసంచేసి భూ కేంద్ర సిద్ధాంతాలతో కూడిన జ్యోతిష్యం, మూఢవిశ్వాసాలతో కూడిన భావజాలం రంగాల్ని విస్తృతం చేస్తున్నారు. దానివల్ల భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం అన్నీ సంక్షోభంలో పడుతున్నాయి. మానవుని పుట్టుక, నిర్మాణం మీదే ఇంకా సందిగ్ధ భావను విస్తృతం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం విస్తరిల్లి భారతీయ భౌతిక శాస్త్రం అత్యున్నతంగా ప్రజ్వరిలించింది. ఇతర దేశాల వారు సాంఖ్య దర్శనంలోని అనేక అంశాలను తీసుకుని వారి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సాంఖ్యం బుద్ధుణ్ణి తర్కబద్ధమైన ఆలోచనకు పురికొల్పింది. జ్ఞానం ధ్యానం నుండి వచ్చేది కాదని అది తర్కబద్ధ మైనదని హేతువివేచనా పూర్ణమని ఆయన గ్రహించాడు. సాంఖ్య దర్శనం భారతీయ తత్వ శాస్త్రాలలో హేతుబద్ధమైనది, భౌతిక వాదంతో కూడినది. ఈ దర్శనాన్ని రచించిన ‘కపిలుడు’ నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించాడు. ఈ దర్శనం మీద పరిశోధన చేసిన ‘కీత్‌’ ‘‘ప్రపంచం మొత్తంలో భౌతిక వాదానికి సాంఖ్య దర్శనం ప్రేరణ శక్తి’’ అని అన్నాడు. శాస్త్ర జ్ఞానానికి జ్ఞాన సంపద, హేతు దృష్టి, కార్యాచరణ శీలత, గ్రహణశక్తి, విశ్లేషణా శక్తి, అవసరం. అయితే ఇప్పుడు శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా మూఢనమ్మకాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. భౌతిక వాదాన్ని, భౌతిక శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా వర్ణధర్మాన్ని యజ్ఞ, యాగ, కర్మకాండపై నమ్మకాన్ని, కులాచరణను కలిగి ఉండటం వల్ల శాస్త్ర జ్ఞాన బోధ పెదవుల నుండే జరుగుతుంది. కానీ అది మేధస్సుకు పదును పెట్టలేకపోతుంది. అందుకే ఇప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, కాశీ విశ్వేశ్వర, అమర్‌నాథ్‌ దేవాలయాల యాత్రకు శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే పదార్థ వాదం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన భావజాలం నుండి బయటపడ లేక పదార్థం వెనుక కూడా ఏదో అదృశ్య శక్తి ఉన్నదని బోధించే దశలో ఉండటం వల్ల విశ్వవిద్యాయాల్లో ద్వైదీకృత భావజాలం పరిఢవిల్లుతుంది.
అంతేకాక ఇదే పండితులు రాజ్య హింసకు సంబంధించిన భగవద్గీతను ప్రవచించడం కూడా మనకు ఆశ్చర్యం కల్గిస్తుంది. పుక్కిట పురాణాలుగా ఉన్న భారత, భాగవత, రామాయణకథలను సినిమాలుగా, టి.వి.సీరియల్స్‌గా భ్రమణం చేయడం వల్ల శాస్త్ర జ్ఞానం నుంచి ఆవిర్భవించిన ఒక పరికరం ఎలా పుట్టిందో భారతీయ విద్యార్థులు చెప్పలేక పోతున్నారు. అందువల్ల కొన్ని కోట్ల రూపాయలు మన విశ్వ విద్యాలయాలు బోధనకు ఖర్చు పెడుతున్నా అందు నుండి ప్రపంచాన్ని కదిలించే ఒక్క నూత్న అంశం, కొత్త సిద్ధాంతం బయటకు రావడంలేదు. శాస్త్ర జ్ఞాన లోపం వల్ల ఉత్పత్తి క్రమం కూడా భారతదేశంలో తగ్గిపోతుంది. శాస్త్ర, సాంకేతికజ్ఞానంవల్ల చైనా, జపాన్‌, జర్మనీల్లో ఉత్పత్తి పెరిగింది. మనం నైతిక శక్తిని బోధించే బౌద్ధాన్ని విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో రాజకీయ పాఠశాలల్లో విస్తృతంగా బోధించక పోవడం వల్ల నైతిక శక్తి భారత దేశంలో తగ్గిపోతూ వస్తుంది. అవినీతిపరులు పెరగడం, దేశాన్ని దోచుకొని ఇతర దేశాల్లో దాచుకునే వారు పెరగడం, దేశీయ ఉత్పత్తులకు పునాదైన సాంకేతిక జ్ఞానశూన్యత వల్ల మూఢాచారాలు పెరగడం, రాళ్ళూ, రప్పలకు బుర్రలు తాకట్టు పెట్టడంవల్ల పేరుకి నూట నలభై కోట్లమంది ఉన్నా కూడా ఆలోచించేవాళ్ళు ఇరవైకోట్ల కంటే తక్కువే ఉన్నారని మనకి అర్థమవుతుంది. మనం ఉత్పత్తి పరికరాలకంటే కూడా దేవుళ్ళు, దేవతల్ని, బాబాల్ని, స్వాముల్ని, యోగుల్ని, దోపిడీదారుల్ని, పరాన్నభుక్కులను ఎక్కువ సృష్టిస్తున్నారు. ఆకలి తీర్చే ఆహారోత్పత్తి మూల శక్తులైనవారిని హీనంగాచూస్తూ భావదారిద్య్ర ఆవేశపరులను పెంచుతున్నారు. మనం తినే ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? దానికి మూల కారణమైన సూర్యరశ్మి, నీరు, నేల, శ్రమకి సంబంధించిన సమస్యలతో జ్ఞానం బాగా లోపించింది. శ్రామికున్ని హీనంగా చూస్తూ విగ్రహాలను కొనియాడటం వల్ల అబద్ధపు ప్రవచనాలకు బుర్రలు తాకట్టులోకి వెళ్తున్నాయి. రాగ ద్వేషాలను, కుల, మత వైరుధ్యాలను పెంచే సంఘర్షనోన్మాద, యుద్ధ్దోన్మాదాన్ని పెంచే కల్పిత యుద్ధ గాథల ప్రవచనాల వల్ల, దృశ్యాల వల్ల భారతదేశం నిరంతరం కుల,మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. బౌద్ధ భారత నిర్మాణం వల్ల నైతిక శక్తి పెరుగుతుంది. పగతో పగ చల్లారదు. ప్రేమ వల్లే పగ చల్లారుతుంది అనే ధమ్మ పథం సూత్రాలు నేడు అవసరం. స్థిర మతిత్వంతో, సంయమనంతో, కోప రహితుడిగా ఉండి నిబ్బరంగా, నిజాయితీగా ఉండే విజ్ఞానవంతుడు వరదల ధాటికి మునగని దీవి’ లాంటి వాడని అటువంటి స్థిరత్వాన్ని శాస్త్రజ్ఞులు సాధించాలని బౌద్ధబోధనలు చెబుతున్నాయి. శాస్త్రజ్ఞానం దేశ, ప్రపంచ విధ్వంసానికి దారితీయకూడదు. ప్రపంచ, దేశ అభివృద్ధికి శాస్త్ర జ్ఞానం ఉపకరణమవ్వాలి. ఈ రోజున ఎక్కడ చూసినా మతఘర్షణలు పెరుగుతున్నాయి. కులోన్మాదం పెరుగు తుంది. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవారు కూడా శాస్త్రీయ లౌకిక బోధనలు చేయ వలసిన దగ్గర మత, వర్ణవివక్షను పురికొల్పే బోధనలుచేయడం ఆశ్చర్యం కల్గిస్తుంది. ఈరోజు శాస్త్రజ్ఞానం ప్రకారం మనిషి శరీరంలోని పుర్రె గానీ, చర్మ వర్ణం గానీ, జుట్టు గానీ, స్వరపేటిక గానీ, మరే ఇతర శరీర భాగంలో కానీ జాతి వ్యత్యాసాలు కన్పించడం లేదు. పుట్టుకలో గానీ, మరణంలో గానీ మానవులందరూ ఒకేరకంగా ఉన్నారు. ఒకేకులంలోని వ్యక్తులు కూడా అనేకవృత్తులు చేపడుతున్నారు. కానీమనసుల్లో వర్ణ బేధాలు, కుల బేధాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల తమను తాము మనుషులుగా గుర్తించలేక పోతున్నారు. గొప్ప జీవశాస్త్రజ్ఞానమున్నవాళ్ళు కూడా మంత్రగాళ్లకు, జ్యోతిష్యు లకు దిన, వారఫలాలకు లొంగిపోతున్నారు. వ్యవసాయదారులు, వర్తకులు, విద్యావంతులు కూడా ఈ మంత్రగాళ్ళకు బానిసలవుతున్నారు. అందువల్ల శాస్త్రజ్ఞానం జీవితంలో ఫలించడం లేదు. అవినీతిద్వారా సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి దేవునిహుండీల్లో వేస్తున్నారు. అన్నిహుండీలు నల్లధనం పోగు చేసేవిగా మారాయి. మనిషి పవిత్రత, అపవిత్రత అనేది ప్రవర్తనవల్ల రుజువు కావాలి కానీ దేవుడికిఇచ్చే కానుకలు వల్ల కాదు. దొంగలు, అవినీతి పరులు, అప్పుచేసి ఇతర దేశాలకు పారిపోయే వారంతా గొప్ప భక్తులుగా చెలామణీ అవు తున్నారు. నిజమైన శాస్త్రజ్ఞులకు సరైన గుర్తింపు, ఆదరణ లేదు.
మన శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి తెచ్చిన ఫలితాలతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం వచ్చింది. భారత రాజ్యాంగం 51వ ఆర్టికల్‌ ప్రకారం శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ప్రజా జీవన సమృద్ధికి ప్రేరణ జరుగుతుంది. ఉత్పత్తి, జ్ఞానం, విద్య సాంకేతికతల సమన్వయంతో భారతదేశం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అపుడే డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం జీవితాల్లో ప్రతిఫలిస్తుంది.
సామాజిక ఉద్యమ నాయకులు, 9849741695

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img