Friday, May 3, 2024
Friday, May 3, 2024

2024 ఎన్నికల్లో మహిళల కీలకపాత్ర

కళ్యాణి శంకర్‌

2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లపాత్ర అత్యంత కీలకం కానుంది. పార్లమెంటు, చట్టసభల్లో మహిళలకు మూడిరట ఒక వంతు రిజర్వేషన్‌ వంటి అనుకూలమైన చట్టాలు అమలయితే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. కీలకంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు వివిధరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజా నివేదిక ఆధారంగా 2024 ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతం అధికంగా ఉండటం ఈ ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. 2047 ఎన్నికల నాటికి మహిళా ఓటర్ల శాతం 55శాతానికి, పురుషుల శాతం 45శాతం ుంటుంది. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పి నట్లుగా సామాజిక పురోభివృద్ధికి రాజకీయ అధికారమే కీలకం. ముఖ్యంగా మహిళలు నిర్ణయాలుచేసే ప్రక్రియలో ఉంటేనే వారికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలపై లింగవివక్షత నిర్మూలనకోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత సెప్టెంబరులో మహిళా సాధికారతకోసం పార్లమెంటు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలో మహి ళలకు 33శాతం రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన ఘనత తమదేనని కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ప్రకటించుకుంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి, భారతదేశానికి కేవలం ఒకరు మహిళా ప్రధానమంత్రిగా, 15 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా మాత్రమే స్థానం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రులుగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసే మహిళల సంఖ్య పెరిగింది. 1950ల నుండి మహిళా ప్రాతినిధ్యం ఏడురెట్లు పెరిగింది. లోక్‌ సభలో మహిళల ప్రాతినిధ్యం 5శాతం నుండి 15 శాతా నికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్‌ పార్లమెంటరీ యూనియన్‌ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టసభ సభ్యులలో మహిళలు దాదాపు 26శాతం మంది ఉన్నారు. రువాండాలో, మహిళలకు 60శాతం కంటే ఎక్కువ సీట్లు కైవశం చేసుకున్నారు. 2008లో, రువాండా అత్యధిక మహిళా మెజారిటీ పార్లమెంటును కలిగినన మొదటి దేశంగా నమోదైంది. భారతదేశ పార్లమెంటులో మహిళలు 14శాతం మాత్రమే ఉన్నారు. వీరిలో లోక్‌సభలో 78 మంది, రాజ్యసభలో 24 మంది మహిళా సభ్యులు ఉన్నారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యానికి సంబం ధించి 193 దేశాలలో భారతదేశం 149వ స్థానంలో ఉంది. మనదేశంలోని ప్రతి రాష్ట్రంలో 16శాతం కంటే తక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 1993 ఎన్నికలలో, పంచాయితీ సీట్లలో మూడిరట ఒక వంతు మహిళలకు రిజర్వ్‌ చేయడమైంది, అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి పెరిగింది. క్షేత్రస్థాయిలో దాదాపు లక్ష మంది మహిళలు సర్పంచ్‌లుగా పనిచేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 47 కోట్ల మంది మహిళలు కాగా కొత్తగా నమోదైన 2.63 కోట్ల మంది ఓటర్లలో 1.41 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కేరళ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగా లాండ్‌లో ఎక్కువ మంది మహిళలు తమ ఓటు నమోదు చేసుకున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందినప్పటికీ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 421 మంది అభ్యర్థులకు గాను బీజేపీ కేవలం 67 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. అయితే మమతా బెనర్జీ, నితీష్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి ముఖ్యమంత్రులు మహిళా సాధికారతను ప్రోత్సహించారు. లింగ వివక్షను తొలగించ డానికి, రాజకీయ పార్టీలు మహిళా సాధికారత కోసం మరింత మంది మహిళా అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టవలసిన అవసరం ఉంది. తమ కుటుంబాలకు చెందిన మహిళలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజకీయ నాయ కులు ప్రయతిస్తున్నారు. అనేక పార్టీలు మహిళా ఓటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా మహిళలకు అభ్య ర్థుల జాబితాలో ప్రాతినిధ్యం కల్పించడంలేదు. మహిళా రిజర్వేషన్‌ చట్టం ద్వారా నిర్దేశించిన విధంగా పార్టీలు తమ టిక్కెట్లలో కనీసం మూడిరట ఒక వంతు మహిళ లకు ప్రాతినిధ్యం కల్పించవలసి ఉంది. రాజకీయ కుటుంబాలకు ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించాలి. దేశంలో రాజకీయ పార్టీలు వివిధ పథకాలు, ప్రయోజనాలతో మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కర్ణాటక లో కాంగ్రెస్‌ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 2,000 నగదు ప్రోత్సాహకం. హిమాచల్‌ ప్రదేశ్‌లో 18-60 ఏళ్ల వయస్సున్న మహిళలకు నెలవారీ 1,500. దిల్లీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష అందజేస్తుంది. పైగా మహిళలకు నెలకు 1,000 చొప్పున వివిధ రాజకీయ పార్టీలు వివిధ పథకాలు, ప్రయోజనాలతో మహిళా ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ నెలవారీ పారితోషికాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆప్‌,కాంగ్రెస్‌లు నెలకు రూ.1000 వంటి ప్రోత్సాహ కాలను అందిస్తున్నాయి. 1,000 నెలవారీ చెల్లింపుతో పాటు లక్ష రూపాయలు వార్షిక భృతి కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి.. మహిళల పట్ల రాజకీయ జవాబు దారీతనం అనేది నిర్ణయం తీసుకోవ డంలో లింగ సమ తుల్యాన్ని సాధించడం, రాజకీయ పార్టీ లలో మహిళలు ప్రాతినిధ్యం, పార్టీ వేదికలలో లింగ సమానత్వ సమస్యలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సమానత్వం ప్రారంభమవు తుంది. వీటన్నింటికీ విద్య అతి ముఖ్యమైనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img