Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఉమర్‌ ఖాలిద్‌కు వర్తించని చట్టాలు

అనన్య వర్మ

వస్త్ర ధారణను బట్టే ఎవరు ఏ మతం వారో చెప్పొచ్చునని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్న చిట్కా అందించారు. ఖాలిద్‌ ఆ యువకుడు తల మీద ముస్లింలు పెట్టుకునే చిన్న టోపీ పెట్టుకోడు. అతనికి దేవుడి మీద నమ్మకం లేదు. సింగ్భంలోని ఆదివాసీల మీద జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.యు.) నుంచి పీహెచ్‌డి చేసిన చరిత్ర అధ్యయనశీలి. కానీ అతని పేరు ఉమర్‌ ఖాలిద్‌ కనక, అది ముస్లింల పేరు కనక మూడున్నరేళ్ల పై నుంచి కింది కోర్టు నుంచి పైకోర్టు దాకా ఏ కోర్టు మెట్లెక్కినా బెయిలు దొరకలేదు. న్యాయస్థానాల తీర్పులు కేవలం చట్టం, రాజ్యాంగం, న్యాయంపైనే ఆధారపడి ఉండవు. ఆ తీర్పుల వెనక కనిపించని ప్రభుత్వ నిర్దేశాలుంటాయి. ఎందుకంటే ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ముస్లింలు దౌర్జన్యానికి దిగుతారు. వారు జాతి వ్యతిరేకులు. ప్రధాన జన జీవన స్రవంతికి ప్రమాదకారులు.
2020 నాటి ఈశాన్య దిల్లీ మతకలహాల కేసులో 2020 సెప్టెంబర్‌లో అరెస్టు అయిన దగ్గర్నుంచి ఉమర్‌ఖాలిద్‌కు బెయిలు దొరకనే లేదు. బెయిలు హక్కు, జైలు అత్యవసరమైతేనే అని విరామం లేకుండా ప్రవచించే సుప్రీంకోర్టులో ఆయన కేసు విచారణకు వచ్చినా 14 సార్లు వాయిదాలతోనే సరిపోయింది. విసుగొచ్చి ఆయన తరఫున వాదిస్తున్న ప్రసిద్ధ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ ఈ బెయిలు అర్జీని ఉపసంహరించుకుంటామని మళ్లీ కింది కోర్టుకెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంటామని గత 14 వ తేదీన చెప్పాల్సి వచ్చింది. బెయిలు మంజూరు అవుతుందా కాదా అన్నది వేరే విషయం. కానీ వాయిదాలు తప్ప విచారణ లేనప్పుడు ఇంతకన్నా చేసేదేముంటుంది. 2023 మే నుంచి వాయిదాలే వాయిదాలు.
2020 సెప్టెంబర్‌ 14 నుంచి జైలులోనే ఉన్నాడు. ఆయన మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరొధక చట్టం కింద కేసులు మోపారు. ఈ చట్టం కించ బెయిలు రావడం కష్టమని తెలుసు కానీ మరీ ఇంత ఆలస్యం కావడం న్యాయం ఆలస్యం కావడమే కాదు, పనిగట్టుకుని న్యాయం దక్కకుండా చేయడమే. విచిత్రం ఏమిటంటే న్యాయమూర్తులు ఎ.ఎస్‌.బొపన్న, హిమాకొహ్లీ ఈ కేసులో ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి 2023 మే 18 న ఆరు నెలల వ్యవధి ఇచ్చింది. ఉమర్‌ చాలా క్రియాశీలంగా ఉండేవాడే కాదు. మనసులో ఎంత అశాంతి ఉన్నా నిబ్బరంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. జైలు జీవితం ఆయనలో సహానుభూతి పెంచింది. సహనం నేర్పింది. ఆచితూచి మాట్లాడడం అలవడిరది. ఆయన రాతల్లోనూ ఇది కనిపిస్తోందంటారు జైలులో ఆయనను కలుసుకునే అవకాశం వచ్చిన వారు.
ఉమర్‌ ఖాలీద్‌తో పాటు దిల్లీ పోలీసులు అథర్‌ఖాన్‌, ఆసిఫ్‌ ఇక్బాల్‌తన్‌హా, దేవాంగన కలిత, గుల్షిఫా ఫాతిమా, ఇష్రత్‌ జహాన్‌, ఖాలిద్‌ సైఫీ, మీరాన్‌ హైదర్‌, మహమ్మద్‌ ఫైజాన్‌ ఖాన్‌, నతాషా నర్వాల్‌, సఫూరా జర్గర్‌, సలీంఖాన్‌, సలీంమాలి, షాధాబ్‌ అహమద్‌, సర్జీల్‌ ఇమాం, షిఫా-ఉర్‌-రహమాన్‌, తస్లీం అహమద్‌, తాహిర్‌ హుసైన్‌ లాంటి మరో 17 మందిపై ఇవే రకమైన కేసులు నమోదు చేశారు. వీరిలో కొందరికి అదృష్టవశాత్తు బెయిలు మజూరు అయింది.
స్వాతంత్రోద్యమంలో మారు మొగిన ‘‘ఇంఖ్విలాబ్‌ జిందాబాద్‌’’, ‘‘విప్లవకర ఆహ్వానం’’ లాంటి ఉమర్‌ నోటివెంట వెలువడిన మాటలు న్యాయమూర్తులను భయపెడ్తున్నట్టున్నాయి. ఇవి కేవలం అన్యాయాన్ని వ్యతిరేకించేలా, పలకరింపుల్లా లేవని న్యాయమూర్తులు భావించారు. ఉన్నత న్యాయవ్యవస్థలో పీఠాసీనులైన వారు అప్పుడప్పుడు విచారణలో ఉన్న ఖైదీలు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గడంపై విస్మయం వ్యక్తం చేస్తుంటారు. కానీ ఆచరణలో మాత్రం వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటారేమో! దిల్లీ అల్లర్ల వ్యవహారంలో పోలీసులు 1300 మందిని అరెస్టు చేశారు. వీరి మీద మొత్తం 758 కేసులు మోపారు. దిల్లీ అల్లర్లకు మూలం 2019 డిసెంబర్‌ 12 న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా అసలు కారణం అన్న విషయాన్ని గానీ, దుష్ట చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు అనిగానీ అంగీకరించే వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి 2014 డిసెంబర్‌ 31 లోగా భారత్‌ వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు పార్సీలు, క్రైస్తవులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని పౌరసత్వ సవరణ చట్టంలో పేర్కొన్నారు. ఇందులో ముస్లింలను మాత్రం మినహాయించడం వెనక ఉన్న కుట్రను గమనిం చని వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ముస్లింలను వేరు చేసి చూడడం గత పదేళ్ల కాలంలో చాలా మందికి అలవాటైపోయింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన ఉమర్‌ ఖాలిద్‌ను ఏళ్ల తరబడి జైలులో ఉంచడం ఈ అభిప్రాయంతో ఉన్నవారికి అన్యాయంగా కనిపించదు. వివక్షా పూరితమైన ఈ చట్టాలు 2020 ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో అమలులోకి వచ్చాయి. దిల్లీ అల్లర్లకు ముందు బీజేపీ నాయకులు కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్‌, ప్రవేశ్‌ మిశ్రా ఎంతటి రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చారో గ్రహించే వారు మాత్రం తక్కువ. ‘‘దేశ్‌ కే గద్దారోంకో… గోలీ మారో సాలొంకో’’ అని వారు చేసిన నినాదాలు చాలా మందికి అభ్యంతరకరం కాకపోవడం హిందుత్వ ఎంతగా విస్తరించిందో అనడానికి నిదర్శనం. అంతకు ముందు 2019 డిసెంబర్‌ 15న పోలీసులు జామియా మిల్లియా ఇస్లామియాలోకి ప్రవేశించి ఆడ మగా తేడా లేకుండా చితకబాదినా కుహనా దేశభక్తులకు అభ్యంతరకరం కాలేదు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఉమర్‌ ఖాలిద్‌ లాంటి వారు గొంతెత్తడం దేశద్రోహం అయిపోయింది. యు.ఎ.పి.ఎ. కింద బెయిలు రావడం కష్టం కావచ్చు. కానీ నిషేధం ఏమీ కాదు. 2021 లో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందను కున్నప్పుడు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయవచ్చునని తేల్చి చెప్పింది. అలా మంజూరు చేసిన సందర్భాలున్నాయి. ఖైదీకి కూడా హక్కులుంటాయి. విచారణలో ఉన్న ఖైదీకి మరిన్ని హక్కులుంటాయి. ఒక సందర్భంలో ఉమర్‌ ఖాలిద్‌ చేతులకు బేడీలువేసి కోర్టుకు తీసుకు రావడం ఈ హక్కులను ఉల్లంఘించడమే. పట్టించుకునేవారు ఎవరు అన్నదే ప్రశ్న.
కొందరు న్యాయమూర్తులు ఒక్కోసారి చాలా తర్కబద్ధంగా వ్యవహరిస్తారు. ఆసిఫ్‌ ఇక్బాల్‌ తన్‌ హా, నటాషా నర్వాల్‌, దేవాంగనా కలితకు 2021 లో బెయిలు మజూరు చేసినప్పుడు న్యాయమూర్తి భంబానీ చాలా తర్కబద్ధంగా వ్యవహరించారు. కానీ ఉమర్‌ ఖాలిద్‌ కు బెయిలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం అదే న్యాయమూర్తి బిగుసుకుపోయారు. ఉమర్‌ ఖాలీద్‌ను దేశద్రోహిగా నిలబెట్టాలని రాజ్య వ్యవస్థ నిర్ణయించుకున్నప్పుడు ఏ తర్కమూ పని చేయదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img