Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కేంద్రం దిగజారుడు రాజకీయాలు

ఎం. లక్ష్మీరాజ్యం

ప్రకృతి ప్రకోపానికి గురై శవాల దిబ్బగా మారిన కేరళలోని వయనాడ్‌ జిల్లా మారుమూల కుగ్రామాలలో ఎటు చూసినా వినాశనమే. బురద, శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల అధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభావిత వ్యక్తులలో ఎక్కువ మంది గ్రామీణ కార్మికులు, చిన్న రైతులు, ముఖ్యంగా చెట్ల పెంపకంలో నిమగ్నమై ఉన్నవారు. అక్కడి పరిస్ధితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సహాయ కార్యక్రమాలు వేగవంతమైన తీరును సమీక్షించేందుకు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (కేఎస్‌డీఎంఎ) ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. కంట్రోల్‌ రూం కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. ఈ ఆపద సమయంలో సంఫీుభావం తెలపడం, సహాయక చర్యలకు మద్దతు, ప్రజల శోకంలో పాలుపంచుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఎంతో ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం అందించిన చరిత్ర కేరళకు ఉంది. అయితే, విపత్తుతో అల్లాడుతున్న కేరళకు ఎలాంటి సహాయ ప్రకటన చేయకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో దిగజారుడు రాజకీయాలు చేసింది. బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో వాయనాడ్‌ విపత్తుపై జరిగిన ప్రత్యేక చర్చలో విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి కేరళకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఉభయ సభల్లో జరిగిన చర్చపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ రెండు డిమాండ్లపై నోరుమెదపకపోగా కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకునేందుకు, సహాయచర్యలు చేపట్టేందుకు రంగంలో దిగాల్సిన బీజేపీ నాయకులు విపత్తును రాజకీయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం అత్యంత విచారకరం. పార్లమెంట్‌లో అమిత్‌ షా సమాధానం ఇస్తూ, కేరళను ముందుగానే హెచ్చరించినా తగినవిధంగా స్పందించలేదనీ, ప్రజలను ఖాళీ చేయించలేదని తప్పుడు ప్రకటనలు చేశారు. విపత్తు జరిగే అవకాశం ఉందని ప్రకృతి విపత్తుపై కేరళ రాష్ట్రాన్ని వారం ముందే హెచ్చరించామని అమిత్‌ షా వాస్తవ విరుద్ధ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను కేరళ సీఎం, ఆరోగ్య మంత్రి ఖండిరచారు. జులై 23న తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేరళకు పంపాం. ప్రజలను తరలించేందుకు కేరళ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణ హెచ్చరిక వ్యవస్థ భారత్‌లో ఉంది’ అని షా చెప్పారు. జులై 27, 28, 29 తేదీల్లో కేరళకు ఎలాంటి హెచ్చరికలు చేశారో అమిత్‌షా వివరించలేదు. ఉభయ సభల్లో చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యులు కేరళకు సంఫీుభావం తెలిపే బదులు రాజకీయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను అమిత్‌ షా ప్రోత్సహించడం విచారకరం.
వాయనాడ్‌ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌పై అమిత్‌ షా నోరుమెదకపోవడం విచారకరం. ఆయన తీరుతో 2018లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం అనుసరించిన విధానాన్ని పునరావృతం కానీయకుండా కేంద్రం చూస్తుందన్న అందరి ఆశలు అడియాశలయ్యాయి. అమిత్‌ షా ప్రకటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సున్నితంగా తిరస్కరించారు. వాయనాడ్‌లో విపత్తుపై కేంద్రం ముందుగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించలేదు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు అలర్ట్‌ రాలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. అమిత్‌ షా ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం నుంచి వచ్చిన అన్ని సందేశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండచరియలు విరిగిపడటానికి సంబంధించి ఎలాంటి ముందస్తు అలర్ట్‌ జారీ చేయలేదు. జిల్లా యంత్రాంగం ఆరెంజ్‌ హెచ్చరికలు ఇచ్చింది. దీని ఆధారంగా వయనాడ్‌ యంత్రాంగం నివారణ చర్యలను చేపట్టింది. అనేక మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది’ అని వీణా జార్జ్‌ వెల్లడిరచారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి అన్న విజయన్‌ వ్యాఖ్యలు సముచితంగా ఉన్నాయి. వయనాడ్‌్‌ విషాదం దేశాన్ని విస్మయ పరిచిందనీ, ఈ వ్యవహారంపై రాజకీయాలు తగవని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సంయమనంతో ఉండి సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహణలో తోడ్పాటు అందించాల్సిన బీజేపీ నాయకులు విపత్తును కూడా రాజకీయం చేస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం విచారకరం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వయనాడ్‌ ఉదంతంపై పార్లమెంట్‌లో మాట్లాడిన తీరు సరైంది కాదు. ఆయన ప్రసంగం అత్యంత దారుణంగా ఉంది. ఇది యావత్‌ దేశానికి, కేరళకు అత్యంత విషాద ఘటన అయినందున అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న తేజస్వి సూర్యను అమిత్‌ షా చూస్తూ ఊరుకోకుండా వారించాల్సింది. కేంద్రం వినాశకర, విచ్ఛిన్నకర రాజకీయాలను, ద్వేషభావాన్ని పక్కనపెట్టి ఈ ఘోర విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణం ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ నేత వీ మురళీధరన్‌ కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి కేరళ మూల్యం చెల్లిస్తోందన్న ఆయన వ్యాఖ్యలు విచారకరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img