Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గ్రామీణభారతం ప్రగతికి సోపానం

పల్లెలో ప్రగతికి సోపానాలు. నిజమైన భారతదేశం పల్లెలలోనే ఉందని మహాత్ముడు ఏనాడో ఉద్ఘాటించాడు. పల్లె తల్లి వంటిదనే నానుడి ఏనాటిదో తెలియదు కాని ఇది అక్షరసత్యం. నగరాల్లో జీవిస్తున్నా పల్లెల గొప్పదనాన్ని విస్మరించరాదు. పచ్చని పైర్లతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరించే ప్రకృతిమాత చల్లని దీవెనలు పల్లెల స్వంతం. పల్లెలే ప్రగతికి సోపానాలు. సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిన తరుణంలో పల్లెలన్నీ నగరీకరణ, ప్రపంచీకరణ పేరుతో కట్టలు తెంచుకుని పరుగులుపెడుతున్న నేపథ్యంలో మానవుల మధ్య సంబంధాలు కూడా అంతే వేగంతో దిగజారి పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి స్వేచ్ఛ, ప్రైవసీ పేరుతో న్యూక్లియర్‌ కుటుంబాలుగా అవతరిస్తున్నాయి. పల్లెలన్నీ నాగరికత పేరుతో నగర వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే పల్లె వాతావరణం గతకాలపు వైభవంగా చరిత్రలో కలిసిపోయింది. పల్లెజనం తమ అస్థిత్వాన్ని విడనాడి, నగరాలవైపు వలసపోతున్నది. గ్రామా లంటే కంటగింపుగా మారాయి. కృత్రిమ వాతావరణంలో, కాంక్రీటు అరణ్యాలలో అధునాతన కట్టడాలలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న నేటి పోకడలను చూస్తుంటే భయమేస్తుంది. జనసంద్రంలా మారిన నగర వాతావరణంలో ఇమడ లేని జనం కూడా ఒకప్పటి పల్లెవాతా వరణాన్ని గుర్తుచేసుకునేలా శుభకార్యాలు, పర్వదినాలపేరుతో, మార్నింగ్‌వాకింగ్ల పేరుతో పార్కుల్లో నలుగురితో కలిసిపోయి ఆత్మీయంగా పలకరించు కుంటూ, చక్కని సంబంధాలను నెలకొల్పుకుంటున్నారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా అలనాటి భారతీయ సంస్కృతిని, కలుపుగోలుతనాన్ని గుర్తు చేసుకుంటూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం గమనార్హం. పల్లెలేమో నాగరికత మోజుతో విలువలను విధ్వంసం చేసుకుంటున్నాయి. పల్లెలను వీడి నగరాలవైపు పరుగుతీయడం బాధాకరం.
దేశంలో జనాభా పెరుగుతున్నది. పెరిగిన జనాభాతో పాటుగా, పోటా పోటీగా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా వనరుల కల్పనకూడా కష్టమౌతున్నది. విద్యావకాశాలు మెరుగుపడ్డాయి. చదువుకున్న యువతకు చదువుకు తగ్గరీతిలో ఉపాధి అవకాశాలు కలగడం లేదు. నిరుద్యోగ యువత ఉద్యోగవేటలో నగరాల్లో తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. మురికివాడలు పెరిగిపోయాయి. చాలీ చాలని సంపాదనతో రేయింబవళ్లు శ్రమచేస్తూ, భారమైన బ్రతుకులతో బయటకు చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు. హాయిగా ఉండే పల్లెల్లో పనులు చేయడం నామోషీగా భావించడం వలనే ఇలాంటి అస్థవ్యస్థ పరిస్థితులు దాపురిస్తున్నాయి.
సుంకవల్లి సత్తిరాజు, సెల్‌: 9704903463

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img