Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

న్యాయమూర్తుల్లో వెలుగు దివ్వె

సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల పదవీ విరమణ సమా వేశాల్లో చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు. అనేక మంచి సలహాలు ఇస్తారు. కానీ వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఈ హితోక్తులను ఎంత మేరకు అనుసరిం చారో తెలుసుకోవడం ఓ పెద్ద పరిశోధనే. ఈ సమావేశాల్లో మాట్లాడే ప్రధాన న్యాయమూర్తులు మొదలైన వారు వెళ్లిపోతున్న న్యాయమూర్తిని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. ఈ రెండు అంశాలూ అన్ని సందర్భాలలో నిజం కాక పోవచ్చు. ఒక్కొక్క సారి ఈ రెండూ నిజాలే కావచ్చు. అలాంటి అరుదైన సంఘటనే గత ఆగస్టు 12వ తేదీన రోహింటన్‌ నారిమన్‌ వీడ్కోలు సభలో జరిగింది. నారిమన్‌ భారత న్యాయ వ్యవస్థలో సింహం లాంటివాడని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ అన్నారు. పదవిలో ఉన్నప్పుడూ ఆ తరవాత కూడా నారిమన్‌ వ్యవహార సరళి సింహం లాగే ఉంది.
ఆయన కొలీజియం సభ్యుడిగా ఉన్నప్పుడు అకీల్‌ ఖురేషీని సుప్రీం కోర్టు న్యాయమూర్తిని చేయాలని పట్టుబట్టారు. ఆ పట్టుదల ఎంతగా ఉందంటే ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ నాయకత్వంలోని కొలీజియం ఖురేషీ పేరు మినహాయించి అయిదుగురు న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేయడానికి నారిమన్‌ ఉద్యోగ విరమణ చేసిందాకా ఆగాల్సి వచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన తరవాత కూడా న్యాయమూర్తి నారిమన్‌ నీళ్లు నమలకుండా తన అభిప్రాయాలను చెప్తూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు విశ్వనాథ్‌ పసాయత్‌ స్మారకోత్సవ కమిటీ ఏర్పాటుచేసిన సభలో గత ఆదివారం న్యాయమూర్తి నారిమన్‌ మాట్లాడుతూ దేశద్రోహ చట్టాన్ని, కిరాతకమైన చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టాన్ని (యు.ఎ.పి.ని) రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే పౌరులు స్వేచ్ఛగా గాలి పీల్చుకో గలుగుతారన్నారు. ఇలాంటి చట్టాల వల్లే మన దేశం న్యాయ వ్యవహారాల్లో 142వ స్థానంలో ఉన్నా మన్నది ఆయన వాదన. స్వాతంత్య్రం వచ్చి74ఏళ్లు అయినా వలసవాద చట్టాల పీడ వదిలించుకోలేకపోతున్నాం. చైనా, పాకిస్తాన్‌తో యుద్ధం చేయవలసి వచ్చిన నేపథ్యంలో యు.ఎ.పి.ఎ. చట్టం చేశాం. దేశ ద్రోహ చట్టం అని అందరికీ తెలిసిన భారత శిక్షా స్మృతిలోని 124ఎ సెక్షన్‌ అయితే బ్రిటిష్‌ కాలం నాటిది. గత జులైలో దేశద్రోహ నిబంధన మీద విచారణ జరుపుతున్న సమయంలో న్యాయమూర్తులు ఇలాంటి చట్టాలు అవసరమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడితోనే ఆగిపోయారు. ఈ చట్టాలు పని తెలియని, అత్యుత్సాహపరుడైన వడ్రంగి చేతిలోని రంపం లాంటిదని రోహింటన్‌ నారిమన్‌ అభిప్రాయ పడ్డారు.
ఏడేళ్లపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న నారిమన్‌ ఇచ్చిన కీలక మైన తీర్పులను చూస్తే ఆయన ఎంత నిబద్ధత గలవారో అర్థం అవుతుంది. గోప్యత ప్రాథమిక హక్కని చెప్పింది, పోలీసులు విచ్చలవిడిగా అరెస్టులు చేయడానికి వీలు కల్పించే సమాచార హక్కు చట్టంలోని 66ఎ సెక్షన్‌ను కొట్టి పారేసింది, వయోజనుల మధ్య పరస్పర అంగీకారం ఉంటే స్వలింగ సంపర్కం నేరం కాదని స్పష్టం చేసింది, శబరిమల ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ వెళ్లొచ్చునని తీర్పు చెప్పింది రోహింటన్‌ నారిమనే. న్యాయమూర్తి నారిమన్‌ తండ్రి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారిమన్‌. రోహింటన్‌ నారిమన్‌ 35 ఏళ్ల పాటు న్యాయవాదిగా ఉన్నారు. 37ఏళ్లకే ఆయనను అప్పటి ప్రధానన్యాయమూర్తి ఎం.ఎన్‌. వెంకటా చలయ్య సీనియర్‌ అడ్వొకేట్‌గా ప్రకటించారు. దీని కోసం నిబం ధనలను సవరించారు. మామూలుగా అయితే 45ఏళ్లలోపు వారిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అనరు. న్యాయవాదులుగా ఉండి సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు అయిన వారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారే. సంతోష్‌ హెగ్డే, కుల్దీప్‌సింగ్‌, ఎస్‌.ఎం. సిక్రీ, లావు నాగేశ్వరరావు మాత్రమే న్యాయవాదులుగా ఉండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. నారిమన్‌ కూడా ఆ జాబితాలోనే చేరుతారు.
రోహింటన్‌ నారిమన్‌ యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో కొంత కాలం సోలిసిటర్‌ జనరల్‌గా పని చేశారు. అప్పటి న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌తో విభేదాలవల్ల రాజీనామా చేశారు. 13,500 కేసుల పరి ష్కారంతో ఆయనకు సంబంధం ఉంది. అందులో 500 తీర్పులు నారిమన్‌ స్వయంగా రాశారు. మరణ శిక్షలపై రివ్యూ పిటిషన్లను సాధారణంగా న్యాయమూర్తుల చేంబర్లలోనే విచారిస్తారు. న్యాయమూర్తి నారిమన్‌ మాత్రం బహిరంగంగా కోర్టు హాలులోనే విచారించాలనే వారు. ఎన్‌ కౌంటర్‌ కేసులను దర్యాప్తు చేసే అధికారులకు 16 మార్గదర్శకాలు నిర్దేశించారు. చరిత్ర, సాహిత్యం, తత్వ శాస్త్రం, పాశ్చాత్య సంగీతం నారిమన్‌కు అభి మాన అంశాలు. ఆయన ప్రతిభ అపారమైంది. నిఖార్సైన నిజాయితీ పరుడు. జూనియర్‌ జడ్జీగా ఉన్నప్పుడు సైతం కీలకమైన తీర్పులే వెల్లడిరచారు. సివిల్‌ చట్టాలు, రాజ్యాంగ వ్యవహారాల్లో దిట్ట. నారిమన్‌ పార్సీ మతస్థుడే కాదు పురోహితుడు కూడా. ముక్కు సూటితనమే ఆయన లక్షణం. సుప్రీంకోర్టులో పది మంది ఉత్తమ న్యాయమూర్తుల, పది మంది ఉత్తమ న్యాయవాదుల జాబితా తయారు చేస్తే రెండిరట్లోనూ నారిమన్‌ పేరు ఉండక తప్పదు.
`అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img