Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రుణానందలహరి

చింతపట్ల సుదర్శన్‌

ఆకాశవీధిలో, రోడ్లమీద ట్రాఫిక్‌ను జామ్‌ చేసే గేదెల్లా విచ్చలవిడిగా తిరుగాడుతున్నవి నల్లమబ్బులు. అవి ఒకదాన్కొకటి ఢీకొడితే తడిసి ముద్దయిపోవల్సిందే, ఈ షాపు వాడిరకారాలేదు. అనుకుంటూ అసహ్యంగా తోకూపుతూ బోనులో చిరుతలా అటూఇటూ తిరగసాగింది డాగీ.అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోడానికి నిరాహారదీక్షలూ, నిరసనలూ, జైలుభరోలు, బందులు బదులుగా ప్రతిపక్షాలు ‘ప్రెస్‌మీట్లూ’, ‘బూతు స్టేట్‌ మెంట్లూ’ ఇస్తున్నారు కనుక ఈ షాపు ‘బంద్‌’ కారణంగా మూతపడలేదు. తెరవబడు తుందిలే అన్న ధీమాలోఉన్న కుక్కపేగులు రకరకాలరాగాలు అందు కుంటున్నప్పుడు అటుగావచ్చింది మరోకుక్క దాని నోటిలో ఓ ప్లాస్టిక్‌ కవరుంది.
ఏరోయ్‌! ఏంటిది? ఎక్కడ్నించి కొట్టుకొచ్చావు అన్నది డాగీ. ఓనరు ఊరెళ్లినట్టున్నాడు. ఇవాళ మటన్‌షాపు ‘క్లోజ’ని పై రోడ్డుకి వెళ్లా. ఓ కోన్‌ కిస్కా గొట్టంగాడు కుడిచేత్తో ఫోన్‌ పట్టుకుని ఎడమచేత్తో కవరు సంగతి పట్టించుకోలేదు. ఏం జరిగిందో వాడికి అర్థం అయ్యేలోపు అందుకుని వచ్చేశా అంటూ కవర్‌ని బోర్లేసింది, ఆ వచ్చిన కుక్క. అబ్బ! ఎంత ఫుడ్డో. భలేచాన్సు కొట్టావులే. బాగా ఆకలిగాఉంది ఓ ఎముక అప్పుగా ఇవ్వరాదూ అంది డాగీ. అప్పా! అంటే ఏమిటి? చెప్తా. తేరగా దొరికిందికదా అని మాయదారి మనుషుల్లా మొత్తం మెక్కావో ‘స్టమక్‌ పెయిన్‌’ వచ్చేను. అప్పు అంటే నువ్వు నాకు ఒకటి ఇచ్చావనుకో రేపో, ఆ మర్నాడో నీది నీకు వడ్డీ పుచ్చుకు కొడతా. నువ్వు ఇచ్చిందానికి మరోటి కలిపి ఇస్తా. నీ ముఖంలో ప్రపంచ బ్యాంక్‌ కనిపిస్తున్నది ప్లీజ్‌! యివ్వవా అంది డాగీ.
సరేలే! మనిషి భాష తెల్సిందానివి నువ్వు. మన మాతృభాషలో అడిగితే ఇవ్వకుండా ఉంటానా అప్పు అని ఓ ఎముక డాగీకి అందించింది. స్వజాతి మీద అభిమానంతో మరో కుక్క. సాయంత్రం కావస్తుంటే ‘అప్పే చేయని వాడు గాడిద’ అంటూ హుశారుగా పాడుకుంటూ అరుగు ఎక్కింది డాగీ.
ఏంటిది ‘బ్రో’ నా మీద పాటా బినాకా గీత్‌ మాలా అంది అప్పటికే అరుగుమీద సెటిలైన గాడిద. సారీ ‘బ్రో’ ఇవ్వాళ అప్పుచేసి పప్పు కూడు కాదు. నాన్‌వెజ్‌ కూడు తినాల్సివచ్చింది. అప్పుల అప్పారావు నయ్యాను కదా అందుకే పాట పాడా అంది డాగీ కాళ్లు బార్లా చాపుకు కూచుంటూ. అలాచెప్పు అప్పు తప్పు అని తెలిసీ చేసేవాళ్లు మనుషులే కాని గాడిదలవరు గాడిదలవకుండా ఉంటానికే అప్పులు చేసేది కొందరైతే, తిన్నది చాలక, చాలినాఅరక్క అప్పులుచేసే వాల్లు కొందరు. బాగుంది బాగుంది అంధకార మలమినప్పుడు అప్పులకై వెతకాలి. అప్పు చేతకానివాడు అధికారం చెయ్యలేడు అంది డాంకీ. తెలుగు రాష్ట్రాల్లోని మనుషుల్లో మూడొంతుల మది ‘వాట్సప్పు’ల పుణ్యమాని కవులైపోయారు. ఇక మీరిద్దరే మిగిలారు కానీండి రుణ ప్రపంచం, రుణ ప్రపంచం, రుణ ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు రిజర్వు బ్యాంకుకు పోదాం పోదాం అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి.
అన్నా వచ్చావా? మందో మాకో తెచ్చుకున్నావా? అని అడిగింది డాగీ. ఎవరికి తెలియని ఏవో బ్రాండులు వచ్చాయి. లేబళ్లు వేరే అయినా సారా ఒకటే అయితేనేం ధరలు చుక్కలచుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. కొనడానికి అప్పిచ్చేవాడేడీ అన్నాడు అబ్బాయి. రాష్ట్రమే అప్పుల నదిలో తిప్పల పడవై మునిగి తెలుతుంటే నీకు అప్పిచ్చే వైద్యుడే దొరకలేదా అంది డాంకీ. నాలాగా అప్పుతీసుకుని వడ్డీతో సహా చెల్లించాల్సిన అవసరం లేని రాజులకే చెల్లుతుంది ప్రజల సొమ్ము రాళ్లపాలు చెయ్యడం. అప్పు ఉంటే నాలాంటి బక్క ప్రేవుల జీవికి నిద్రేపట్టదు అన్నాడు అబ్బాయి. అవును అందిన కాడికి అప్పులు చేసి బ్యాంకులు దివాలా తీయించి విదేశాలకు చెక్కేస్తే ఘరానా బాబులకు అప్పు అనగా ‘జుజుబీ’ అన్నమాట. పోనీ అక్కడెక్కడో రేషన్‌ బియ్యానికి బదులు డబ్బులిస్తున్నార్ట. తెచ్చుకు తాగచ్చుగా అంది డాగీ. అది మన రాష్ట్రం కాదుకదా. మనవాళ్లు కూడా చౌక బియ్యానికి బదులు ఓ ఫుల్లూ, బిస్లరీ ఇస్తే సరిపోతుంది. మంచి మనిషికి మంచి రోజులు రాకపోవులే అన్నాడు అబ్బాయి నవ్వుతూ.
నీలాంటివాళ్లు అప్పుచేస్తే పీకపట్టుకుంటారు అప్పులోళ్లు. మరి ప్రభుత్వాలు అప్పుచేస్తే ఎవరి పీక పట్టుకుంటారు అనడిగింది డాంకీ. ఇంకెవరిది ప్రజల పీకే. మన సర్కారు ప్రతి మంగళవారాన్ని ‘అప్పుల డే’ గా పాటిస్తున్నది. ఈ మధ్యే రెండువేలకోట్లు అప్పుతెచ్చింది కాని తెచ్చినోడికి ఏ బరువూ భారమూ ఉండదు. ఆర్చేది, తీర్చేదిప్రజలే. పన్నులే అన్నా డబ్బాయి. అదేంటన్నా తెచ్చినోడికి జవాబుదారీ లేదా అంది డాగీ. ఎలా ఉంటుంది ఏ ఇరవైఏళ్ల కోసమో, ఏదో ఎనిమిదో శాతం వడ్డీతో తెచ్చిన వాడు ఉండాలిగా అప్పటికి. ఎప్పటికీ చిక్కేది చిక్కుల్లో పడేది ప్రజలే కదా అంది డాంకీ. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అప్పో సొప్పో చెయ్యకతప్పదు మరి. ఉక్కుఫ్యాక్టరీ అమ్మకుండాఉండాలా, అనేకఉద్యోగాలు ఇవ్వాలా, రోడ్లు వెయ్యాలి నీళ్లూ కరెంటూఇవ్వాలి అసలు ఇంకా ఎన్నొన్నోచెయ్యాలి ప్రత్యేక హోదా కోసం విమానాల్లో రాకపోకలు సాగించాలా వద్దా అంది డాగీ.
అబ్బో దంచావులే ఊక. అప్పులు తెచ్చేది రాష్ట్రం అభివృద్ధికి కాదోయ్‌ ప్రజలు దివాళా తీయడానికి. అవునోయ్‌ సంక్షేమ పథకాల అమలుకోసం, ఉచితంగా ఉచితాలు ఇవ్వడంకోసం అంటే ఓట్లు దోచుకోవడం కోసమే. అప్పుచేసి పబ్బం గడుపుకొని మళ్లీ మళ్లీ అప్పుచేసే అధికారం కోసమే ఆ ఆత్మానందంకోసమే! అర్జంటుగా వెళ్లి అప్పు సంపాదించాలి అంటూ అరుగు దిగాడబ్బాయి. అప్పులుచేసే ప్రభుత్వాలు గాడిదలకు రోజూ ఉచితంగా న్యూస్‌ పేపర్‌ అందిస్తే బాగుణ్ణు అంది గాడిద. అప్పుచేసి తిన్నానివ్వాళ. మనిషినీ కాను. అధికారమూ లేదు, రేపు ఎలాగైనా అప్పు తీర్చేయాలి అంది డాగీ నిద్రపోవడానికి ‘ట్రై’ చేస్తూ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img