Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతుకు ఎకరాకు 10వేలు సాగుసాయం అందించాలి

కె.వి.వి.ప్రసాద్‌

దేశంలో సగటున ప్రతి రైతు రూ.74,121లు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2,45,554 రూపాయలు రుణభారంఉన్నది. రైతు కుటుంబాల సగటు ఆదాయం 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా రూ.12,955 మాత్రమే. రాష్ట్రంలో రైతుఆదాయం సగటున రూ.6,920లు. దేశవ్యాప్త గణాంకాలు పరిగణలోకి తీసుకుంటే ఆదాయంలో అట్టడుగు స్థాయినుండి 2వ స్థానంలో మన రైతు ఉన్నాడు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్ధానం చేశారు. ఆయన హామీ మేరకు 2022 మార్చి నాటికి రైతు నెలసరి ఆదాయం రూ.21,146లు కావాల్సి ఉన్నది. కానీ ప్రధాని ప్రకటించినట్లు రైతు ఆదాయం పెరగకపోగా, రైతు మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నాడు. డా॥ ఎం.ఎస్‌.స్వామి నాధన్‌ సిఫార్సుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు సి2G50శాతం ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించాల్సి ఉన్నది. అయితే గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఎ2Gఎఫ్‌.ఎల్‌G50శాతం మోదీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. రైతాంగానికి ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైనది.
దేశీయ స్ధూల ఉత్పత్తి (జి.డి.పి.)లో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 51శాతం నుండి 19శాతం తగ్గిపోయినా అత్యధిక శాతం ప్రజలు ఆధారపడిన రంగం వ్యవసాయ రంగమే. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా 1991 నుండి 2011 మధ్యకాలంలో సుమారు 150 లక్షలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాలకు వెళ్ళారని జాతీయ జనగణన సర్వే తెలిపింది. ప్రతి రోజూ 2వేల మందికి పైగా వ్యవసాయం గిట్టుబాటు కాక గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసలు పోతున్నారు. ప్రతిరోజూ 28మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ప్రతి 50 నిముషాలకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటే రైతాంగంపై ఏ పాటి శ్రద్ద పాలకులు చూపిస్తున్నారో అవగతమౌతున్నది. 1997 నుండి ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికులు చిన్న, సన్నకారు కౌలు రైతులే ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు సుమారు లక్ష మందికి పైగా రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మన రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి హయాంలో 3 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
రైతాంగం అప్పుల ఊబిలోకి చేరడం, ఆత్మహత్యలకు పాల్పడటానికి పాలక ప్రభుత్వాలే కారణం. రైతాంగ ఉత్పత్తులకు మద్దతు ధరలు కల్పించకపోవడం వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలలో కోతలు విధించడం ప్రధాన కారణాలు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టి.ఐ.ఎస్‌.ఎస్‌) వారి ఆధ్యయనం ప్రకారం 1996`2008 మధ్య కాలంలో వివిధ పంటల మద్దతు ధరలు వాస్తవానికి విరుద్ధంగా 38శాతం తక్కువగా ఉన్నాయని తెలిపింది. వివిధ ఆధ్యయనాల ప్రకారం భారత రైతాంగం మద్దతు ధరలు లభించక ఏటా సగటున 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. రైతు అష్టకష్టాలు పడుతూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొంటూ పండిరచిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించక, ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలు లభిస్తే వ్యవసాయం నుండి నిష్క్రమిస్తామని 40శాతం మంది రైతులు తెలిపినట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే వివరాలు తెలియచేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన అనంతరం రైతు పరిస్థితి పెనంమీద నుండి పొయ్యిలో పడిన చందంగా మారింది. 2020 జూన్‌ 5న కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఆర్దినెన్స్‌ రూపంలో తెచ్చింది. ఈ చట్టాలు వ్యవసాయరంగంపై తీవ్రప్రభావం చూపుతుందన్న ఆందోళనలతో రైతులు నిర్వహించిన ఉద్యమప్రభావంతో చట్టాలు రద్దుచేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించినా మద్దతుధరల గ్యారంటీచట్టం తెచ్చేందుకు ససేమీరా అంటున్నారు.
మరో ప్రక్క రైతాంగాన్ని ఉద్దరిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500లు మొత్తంగా రూ.13,500 రైతుభరోసా పేరుతో ఇస్తున్నట్లు అర్భాటంగా ప్రకటించు కుంటున్నారు. అయితే పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుల ప్రకారం వారు ఇచ్చే రూ.13,500లు పావుఎకరా సాగుకు కూడా సరిపోవనేది రైతుల అభిప్రాయం. ఈ స్ధితిలో రైతులను వ్యవసాయంలో నిలిపేందుకు అప్పులతో సతమతమౌతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగుసాయం పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల సాగుసాయం అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండు చేస్తున్నది. దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వం ఒత్తిడి తేచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఆగస్టు 7వ తేదీన విజయవాడలోని ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది.
కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న దృష్ట్యా రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండా రైతు ఎజెండాగా మారాలని వ్యవసాయంలో రైతులను నిలిపేందుకు తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో రైతు అంశాలకు ప్రాధాన్యత కల్పించాలని రైతాంగం కోరుతున్నది.
ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img