Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

లోక్‌సభ ఎన్నికల్లోకీలకం మహిళా ఓటర్లే

సుశీల్‌ కుట్టి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్య మహిళా ఓటర్లే. మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇది మరింత ఎక్కువనే చెప్పవచ్చు. అయితే బెంగాల్‌లో మహిళల హక్కులు, మహిళల సంరక్షకులు ప్రధాని నరేంద్ర మోదీనా లేక తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత ఇద్దరిలో ఎవరనేది నిరూపించే యుద్ద సమయం ఆసన్నమైంది. బెంగాల్‌లో సందేశ్‌ ఖాలిలో టీఎంసీ నాయకుడు షేక్‌ షాజహాన్‌ ప్రమేయం ఉన్న సందేశ్‌ఖాలీ నిర్వహించిన అత్యాచారాలు, దహనాలు, దోపిడీ, హత్యలు భూములను ఆక్రమించుకోవడం వంటి సంఘటనలు తారాస్థాయికి చేరిన ప్రస్తుత సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1, 2 తేదీల్లో బెంగాల్‌ సందర్శన చేపట్టడం విశేషం. అయితే మహిళలపై షాజహాన్‌ చేసిన అకృత్యాలపై ప్రభుత్వ అప్రతిష్టను తగ్గించుకునేందుకు మమత ఒక రోజు ముందు అతనిని అరెస్టుచేయడం పెద్దనాటకం. ప్రధాని మోదీ, మమతా ఇద్దరికీ సందేశ్‌ఖలీలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను ఎన్నికల వ్యూహంగా మలుచుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లు ప్రధాన చర్చగా ఉన్నారు. కేవలం వంటగ్యాస్‌ విషయంలో మాత్రమే మహిళా ఓటర్లను బీజేపీ ఆకర్షించలేదని, మోదీ ఇచ్చిన హామీలను ఎట్టిపరిస్థితుల్లోనూ నెరవేర్చలేరని బీజేపీ ఎన్నికల ఎత్తుగడలో భాగం అని మమత విమర్శిస్తున్నారు. మహిళలు మోదీ అసలు స్వభావాన్ని గుర్తించకుండా బీజేపీకి ఓటు వేస్తే మాత్రం వెన్నులో కత్తి దించడం వంటిదే. వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే తదనంతరం పశ్చాత్తాపపడే పరిస్థితి మహిళలకు దాపురిస్తుందని మమత ప్రచారసభల్లో తరచూ ప్రస్తావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ భయానక పరిణామాలపై మమత ఒకింత ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 50శాతం మహిళా ఓటర్లున్నారు. మొత్తంగా కాకపోయినా ఈ ఎన్నికల్లో మెజారిటీ మహిళా ఓటర్లను ప్రధానంగా ఆకర్షించేందుకు బీజేపీ గాలం వేస్తోంది. అక్కడి మహిళల ఓట్లని రాబట్టుకోవటం బీజేపీకి పెద్ద్ద టాస్క్‌గా ఉంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు ప్రధాన కారణం బీజేపీి మాత్రమే కాదు, కాంగ్రెస్‌, వామపక్షాల ప్రమేయం కూడా ఉంది. అయితే మమత సరైన సమయంలో షేక్‌ షాజహాన్‌ను వదిలించుకునే ప్రయత్నం చేయడం ఎన్నికల ఎత్తుగడలో భాగమే. ప్రధానమై నది నరేంద్ర మోదీని తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించడం మమత లక్ష్యం. మోదీ తిరిగి అధికారంలోకి వస్తే ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలను పెంచడంతో పాటు కనీసం, గ్యాస్‌ ధరల గురించి స్త్రీలు మాట్లాడేందుకు కూడా వీలులేని పరిస్థితి కల్పిస్తారని మమత మహిళా ఓటర్లను భయపెడుతున్నారు. మోదీ పాలనలో మహిళలు వంటచెరకు సేకరించడం కూడా ఆందోళన కలిగించే అంశమని ఆమె ర్యాలీలో విమర్శిస్తున్నారు. మేము మాత్రం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తాము … బీజేపీ మళ్లీ గెలిస్తే, గ్యాస్‌ ధరను రూ.1,500-2,000 వరకు పెంచవచ్చు. మీరు వంట కోసం మళ్లీ ఆవు పేడ, కలపను సేకరించే పరిస్థితి వస్తుందని మమత తన ప్రసంగాల్లో హెచ్చరిస్త్తున్నారు. వాస్తవం ఏమిటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో పెరిగిన ధరల గురించి దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మతపరమైన విద్వేష పరిస్థితులను మమత లేవనెత్తుతున్నారు. విద్వేషం తలెత్తడానికి కాషాయదళాలే కారణమన్నారు. గ్యాస్‌, హౌసింగ్‌ రెండూ మహిళా ఓటర్లకు ముఖ్యమైనవి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మహిళా ఓటర్లు మరో ఐదేళ్లలో పురుష ఓటర్లను అధిగమిస్తారని, తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాలలో, మహిళలు అగ్రగామిగా లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నొక్కి చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img