Monday, May 20, 2024
Monday, May 20, 2024

జిసిసి ద్వారా కొనుగోలు చేస్తున్న అటవీ ఉత్పత్తులు ధరలు పెంపు

డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం: గిరిజన సహకార సంస్థ (జిసిసి) పరిధిలో కొనుగోలు చేస్తున్న అటవీ ఉత్పత్తల ధరలను జిసిసి గతవారం పెంచిందనీ గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ తెలిపారు.గిరిజన ప్రజల అభివృద్ధికోసం జిసిసి ఎండి తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాక్ బీ తేనె 200 రూపాయలు నుండి 250/- రూపాయిలకు,ముషిడిక పిక్కలు కేజీ.70/- రూలు నుండి 90/- రూపాయలకు పెంచిందన్నారు. దీనిని
గిరిజన రైతులు ఉపయోగించుకోవాలని, ఆయన కోరారు. అదే విధంగా కుంకుడు కాయలు బాగా ముదిరినవాటికి 35/- రూ. ధర ఇచ్చారని తెలిపారు. చింతపండు దిగుబడి ఈఏడాది అంత ఆశాజనకంగాలేదని, దీనివలన గిరిజన రైతులకు ఆర్ధికంగా కొంత ఇబ్బంది కలిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సీజనులో దొరికే కుంకుడుకాయలు, కొండచీపుర్లు, ముషిడిక పిక్కలు సేకరించి గిరిజనులు దీని ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. గతఏడాది ఇచ్చిన ఖరీఫ్ లో గిరిజన రైతులకు ఇచ్చిన రుణాలు ఈనెలాఖరులోగా చెల్లించిన యెడల వారికి కొత్తగా రుణాలకు ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఈఏడాది అటవీ వ్యవసాయ ఉత్పత్తులు రూ.9.20కోట్లు లక్ష్యం పెట్టగా ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకు కొనుగోలు చేశామని తెలిపారు. ప్రతీఏటా గిరిజనులకు మద్దతు ధర ప్రకారం చెల్లింపులుజరుపుతామని,
ఈఏడాదికూడా చెల్లింపులు అదే విధముగా చెల్లిస్తున్నామని తెలిపారు.
ఈఏడాది డివిజన్ పరిధిలో అన్ని విభాగాలు కలిసి సుమారు
రూ. 56కోట్ల లక్ష్యంకుగాను రూ.60కోట్లు లక్ష్యం సాధించామని తెలిపారు.
ప్రస్తుతము అటవీవిస్తీర్ణం తగ్గిపోవటం వల్ల ప్రస్తుతం పంటలు దిగుబడి కూడా తగ్గిందన్నారు. కావున గిరిజన రెతులకు జిసిసి, విఓవికె ల సమన్వయంతో గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.దీనివలన ప్రత్యామ్నాయాలు అయిన చిరుధాన్యాలు, పసుపు, కందులు, రాగులు వంటి వాటిపై
శ్రద్ధ పెడుతున్నారని తెలిపారు. గిరిజనుల జీవనోపాదిని పెంపొందించేందుకు గిరిజన సహకార సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లా ఎన్నికల అధికారి అదేశాలు సూచనలు మేరకు గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు,సిబ్బందికి, గిరిజనులకు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img