విశాలాంధ్ర,పార్వతీపురం : బ్రిటిష్ వారిని గడగడ లాడించిన అల్లూరి సీతారామరాజు విప్లవవీరుడిగా చరిత్రలో నిలిచారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు.గురువారం కళాశాలలో అల్లూరు సీతారామరాజు 127వ జయంతి వేడుకలను నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు అంటే విప్లవయోధుడని, సంగ్రామభేరి, స్వాతంత్ర్య నినాదం, సమరగీతం, ఉద్యమజ్వాలని తెలిపారు.అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడన్నారు. కేవలం 27ఏళ్ళ వయసులోనే బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించారని తెలిపారు. ఈకార్యక్రమంలో కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ శాంతకుమారి, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ ఇంచార్జిలు,కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.