Monday, October 3, 2022
Monday, October 3, 2022

ఆఖరి ఓవర్లో త్యాగి అద్భుతం

దుబాయ్‌ : ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో రాజస్థాన్‌ బౌలర్‌ కార్తీక్‌ త్యాగి, రెండు వికెట్లు పడగొట్టడంతోపాటు కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి పంజాబ్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. చివరిదాకసాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉండగా.. పంజాబ్‌ ఒక్క పరుగు కూడా చేయలేదు. దీంతో విజయం రాజస్థాన్‌ సొంతమైంది. రాజస్థాన్‌ నిర్దేశించిన 186 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. మయాంక్‌ అగర్వాల్‌ (67: 43 బంతుల్లో 7 ఫోర్టు, 2 సిక్స్‌లు) అర్థసెంచరీతో మెరవగా, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(49: 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 119 పరుగుల వరకు వికెట్‌ పడకుండా ఆడిన రాహుల్‌-అగర్వాల్‌..వెంటవెంటనే వీరిద్దరూ అవుట్‌ కాగా తరువాత వచ్చిన ఎయిడెన్‌ మార్‌క్రమ్‌(26 నాటౌట్‌: 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), నికోలస్‌ పూరన్‌ (32: 22 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) వికెట్‌ పడకుండా జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. చివరి ఓవర్లో 4 పరుగులు కావాల్సి ఉండగా రాజస్థాన్‌ బౌలర్‌ కార్తీక్‌ త్యాగి అద్భుతం చేశాడు. ఒకే ఒక్క పరుగు ఇచ్చి పూరన్‌తో పాటు దీపక్‌ హుడా(0)ను అవుట్‌ చేసి పంజాబ్‌కు భారీ షాకిచ్చాడు. దీంతో విజయం రాజస్థాన్‌ సొంతమైంది. త్యాగి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
సంజూ శాంసన్‌కు రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్‌ టోర్నీ రెండోదశలో తొలిమ్యాచ్‌ విజయాన్ని ఆస్వా దిస్తున్న రాజస్థాన్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు ఐపీఎల్‌ నిర్వాహ కులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్‌ మార్గదర్శ కాల ప్రకారం లీగ్‌లో తొలిసారి ఓవర్‌ రేటు నిబంధనలను ఉల్లం ఘిస్తే.. సదరు జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే.. రూ.24 లక్షలతో పాటు తుదిజట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. మూడోసారి ఇదే తప్పు చేస్తే రూ.30 లక్షల జరిమానా సహా మ్యాచ్‌ నిషేధం.. తుది జట్టులోని ఆటగాళ్లకు రూ.12 లక్షల జరిమానా లేదా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img