Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఐపీఎల్‌`22 కొత్త నిబంధనలు

పాత జట్లు నలుగుర్ని రిటైన్‌ చేసుకోవచ్చు.. : కొత్త టీమ్స్‌ ముగ్గుర్ని ఎంచుకోవచ్చు!

ముంబై: ఐపీఎల్‌ను పది జట్ల విస్తృతి కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నం సూపర్‌ సక్సెస్‌ అయింది. కొత్తగా వచ్చిన రెండు జట్లతో బోర్డు పంట పండిరది. అక్షరాల రూ. 12,715 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని భారత కార్పొరేట్‌ సంస్థ గోయెంకా గ్రూప్‌(ఆర్‌పీఎస్‌జీ) రూ.7,090 కోట్లకు, లక్నో టీమ్‌ను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్‌ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్‌) రూ. 5,625 కోట్లు కుమ్మరించి దక్కించుకున్నాయి. గతవారమే కొత్త జట్ల వివరాలను బీసీసీఐ వెల్లడిరచింది. ఇక కొత్త టీమ్స్‌ కోసం టెండర్‌ ప్రక్రియ ముగియడంతో బోర్డు ఇప్పుడు మెగా వేలం ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటెన్షన్‌ పాలసీని పూర్తి చేసే పనిలో పడిరది. బోర్డు రూపొందించిన ఈ పాలసీకి సంబంధించిన వివరాలను ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ ఓ కథనంలో వెల్లడిరచింది. ప్రస్తుతానికి మెగావేలం తేదీలను ఖారారు చేయక పోయినప్పటికీ ఆటగాళ్ల రిటెన్షన్‌పై బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ పాలసీ ప్రకారం మెగా వేలానికి ముందు పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఓవర్‌ సీస్‌ ప్లేయర్‌ లేదా ఇద్దరు భారత ప్లేయర్లు.. ఇద్దరు ఓవర్‌ సీస్‌ ప్లేయర్లను ఎంచుకోవచ్చు. ఇక భారత ఆటగాళ్ల విషయంలో క్యాప్‌, అన్‌ క్యాప్‌ ప్లేయర్లా? అనేది ఫ్రాంచైజీల ఇష్టం. ఇక కొత్తగా వచ్చిన రెండు జట్లు మాత్రం పాత జట్లు వదిలేసిన ఆటగాళ్లు, మెగా వేలానికి అందుబాటులో ఉన్న ప్లేయర్ల పూల్‌ నుంచి నేరుగా ముగ్గురిని ఎంచుకోవచ్చు. ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపి ఈ ముగ్గురిని నియమించుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్‌ ముగిసిన తర్వాతే మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఈ రిటెన్షన్‌ పాలసీ గురించి ఫ్రాంచైజీలతో ఐపీఎల్‌ నిర్వాహకులు చర్చలు జరపారని సమాచారం. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే బీసీసీఐ ఈ పాలసీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img