test
Monday, May 27, 2024
Monday, May 27, 2024

గిల్‌… జిగేల్‌..!

అర్ధసెంచరీతో రాణించిన శుభ్‌మన్‌
రాజస్థాన్‌ లక్ష్యం 172

షార్జా : ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ వికెట్‌ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుందని, అందుకే ఫీల్డింగ్‌ తీసుకున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తెలిపాడు. జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపాడు. లివింగ్‌ స్టోన్‌, ఉనాద్కత్‌, రావత్‌, మోరీస్‌ జట్టులోకి రాగా.. లూయిస్‌, శ్రేయస్‌ గోపాల్‌, మిల్లర్‌ ఉద్వాసనకు గురయ్యారని చెప్పాడు. ఇక కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, సౌథీ స్థానంలో ఫెర్గూసన్‌ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ను వెంకటేష్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డు వేగం పెంచారు. 8 ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్‌ వికెట్‌ కోల్పోకుండా 50 పరుగులు పూర్తిచేసుకుంది. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్న క్రమంలో రాహుల్‌ తివాతియా బౌలింగ్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ డిఫెన్స్‌ ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. 35 బంతుల్లో 3I4, 2I6లతో 38 పరుగులు చేశాడు వెంకటేష్‌. దీంతో 79 పరుగులకు కేకేఆర్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్‌ రాణా (12, 1I4, 1I6) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఫిలిప్స్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఆరు పరుగులు చేసి మోరిస్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్‌ వెనుదిరిగాడు. 44 బంతుల్లో 4I4, 2I6లతో 56 పరుగులు చేశాడు. అనంతరం రాహుల్‌ త్రిపాఠి(21) చేతన్‌ సకారియా బౌలింగ్‌లో బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (14 నాటౌట్‌), ఇయాన్‌ మోర్గాన్‌ (13 నాటౌట్‌) సమష్టిగా ఆడి స్కోరును 171వరకూ తీసుకెళ్లారు. మొత్తంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కేకేఆర్‌ 171 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలింగ్‌లో మోరిస్‌, చేతన్‌ సకారియా, రాహుల్‌ తివాతియా, ఫిలిప్స్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img