Monday, October 3, 2022
Monday, October 3, 2022

ర్యాంకుల్లో దూసుకెళ్లిన శార్దూల్‌

లండన్‌ : భారత్‌-ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఒల్లీ పోప్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పోప్‌ 49వ స్థానంలో ఉండగా, శార్దూల్‌ బ్యాటింగ్‌ విభాగంలో 59వ ర్యాంక్‌కు ఎగబాకాడు. బౌలింగ్‌ విభాగంలో 49వ ర్యాంక్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు ర్యాంకింగ్స్‌ ఇలా ఉన్నాయి : టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. కానీ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కారణంగా ర్యాంకింగ్‌ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి 30 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఇక బుమ్రా టాప్‌-10లోకి చేరాడు. ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బ్యాట్స్‌మెన్‌ జాబితాలో జో రూట్‌ 903 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌ (908), ఆల్‌రౌండర్ల విభాగంలో జాసన్‌ హౌల్టర్‌ (434) టాప్‌ ర్యాంకుల్లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img