Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పతకానికి అడుగు దూరంలో..!

చరిత్ర సృష్టించిన భావినాబెన్‌ పటేల్‌
క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళ

టోక్యో: భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భావినాబెన్‌ పటేల్‌ టోక్యో పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. సెమీస్‌లోకి దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్‌ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్‌ క్లాస్‌4 మ్యాచ్‌లో 3-0తో తిరుగులేని విజయం సాధించిన భావినాబెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో ఒలివీరాను 12-10, 13-11, 11-6తో ఓడిరచేందుకు భావినాబెన్‌కు 23 నిమిషాలు అవసరమయ్యాయి. ఆ తర్వాత ప్రపంచ నంబర్‌ 2, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. ప్రత్యర్థి రాంకోవిక్‌ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడిరచింది. ఫలితంగా భారత్‌కు తొలి పతకం అందించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. భావినాబెన్‌ తన తర్వాతి పోరులో చైనాకు చెందిన మియావో రaాంగ్‌తో తలపడనుంది. మియావోను ఓడిస్తే భారత్‌కు పతకం ఖాయమైనట్టే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా ప్రత్యర్థి దేహం వైపు బంతిని పంపించడమే నా ప్రధాన వ్యూహం. నా కోచ్‌ ఇదే చెప్పాడు. నేను ఖచ్చితత్వంతో ఆ ప్రణాళికను అమలు చేశాను. నా తర్వాతి ప్రత్యర్థి ప్రపంచ రెండో ర్యాంకర్‌. అందుకే నేను ఆ మ్యాచ్‌ను పూర్తి ఏకాగ్రతతో ఆడాలి. గెలిచేందుకు ప్రయత్నించాలి’ అని భవినా తెలిపింది. క్లాస్‌4 అంటే…
క్లాస్‌`4 విభాగం అంటే… క్రీడాకారులకు దేహం దిగువ భాగం పనిచేయదు. వారు చక్రాల కుర్చీకే పరిమితమై ఆడాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img