Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

గుండె పట్ల తగిన జాగ్రత్తలు వెంటనే తీసుకోవాలి..

సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి

విశాలాంధ్ర ధర్మవరం:: గుండెపట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలను వెంటనే తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా కోర్టు ఆవరణములో అనంతపురం కిమ్స్ సవేరా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరమునకు ముఖ్యఅతిథిగా జడ్జి గీతావాణి పాల్గొన్నారు. ఈ శిబిరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లాయర్ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో జి ఆర్ బి ఎస్/బీపీ/ ఈసీజీ/ 2డి ఎకో ఉచితంగా నిర్వహించారు. కిమ్స్ సవేరా హాస్పిటల్ ప్రత్యేక వైద్య నిపుణులచే గుండె నొప్పి,, చాతి నొప్పి,, గుండె దడ, ఆయాసం, కళ్ళు తిరగడం,, గుండెలో మంట కలగడం, చాతిలో బ రువుగా ఉండడం, నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి వాటికి వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సలహాలను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం జడ్జిలతో పాటు న్యాయవాదులు కోర్టు సిబ్బంది కలిసి 110 మందికి వైద్య చికిత్సలను అందించడం జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు లాయర్ సుబ్బారావు తెలిపారు. ఇటువంటి శిబిరాలు నిర్వహించడం పట్ల సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి, పిడిమ్. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శివపార్వతి, ఏటీఎం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి లు తమ సంతోషాన్ని తెలిపారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు సీనియర్, జూనియర్ న్యాయవాదులు,, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img