విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని గుట్ట కింద పల్లి ఆర్ డి టి స్పోర్ట్స్ గ్రౌండ్లో ఆర్డిటి ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి స్కూల్ క్రికెట్ అండ్ కబాడీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కోచ్ లు రాజశేఖర్, పృద్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తిగల పాఠశాలలు ఈనెల 20వ తేదీలోగా క్రికెట్ అండ్ కబాడీ వేర్వేరుగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9985929285కు గాని,(క్రికెట్ కోచ్ రాజశేఖర్), 9966492540 కు (కబాడీ కోచ్ పృద్వి) సంప్రదించగలరని తెలిపారు. ఈ అవకాశాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.