Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

అడ్వకేట్ సంపత్ కుమార్ హత్య కేసును ఛేదించిన ధర్మవరం వన్ టౌన్ పోలీసులు

కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హత్యను 13 రోజుల్లో చేదించిన వైనం.

నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన వైనం

55 లక్షలకు హత్యకు అంగీకార ఒప్పందం

రూ.7,05,000 రికవరీ చేసిన వైనం

విశాలాంధ్ర -ధర్మవరం : కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, హిందూపురం అడ్వకేట్ బిర్రు సంపత్ కుమార్ హత్య కేసును 13 రోజుల్లోనే వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో డిఎస్పి శ్రీనివాసులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 29వ తేదీన హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో సంపత్ కుమార్ ని హత్య చేసి, శవాన్ని కారులో డిక్కీలో తీసుకుని వచ్చి ధర్మవరం చెరువు వద్ద పడవేసి వెళ్లడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. ఈనెల 11వ తేదీ ఉదయం కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి క్రాస్ వద్ద, వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది సహాయంతో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ధర్మవరం రెండవ మరుగు వద్ద మే 29వ తేదీ అర్ధరాత్రి హత్య చేసి పడేసి పోయిన సంఘటనను, పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని చేదించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం వన్ టౌన్ సిఐ శ్రీనివాసులు బృందాలుగా ఏర్పడి హత్యకు గల కారణాలను, హత్య చేసిన ముద్దాయిలు రామాంజనేయులు, రంగం రవీంద్ర, భూమా లోకేష్, కావలి శ్రీకాంత్, జంపుల శ్రీనివాసులు నాయుడులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మృతుడు లాయర్ సంపత్ కుమార్ తండ్రి రాజశేఖర్ హిందూపురం టౌన్ లో గల స్నేహితుడు శ్రీకాంత్ కి, ఈ కేసులో ముద్దాయిలైన కృష్ణారెడ్డి అతని కుమారుడు నాగార్జున రెడ్డి వారి మధ్య స్థలం తగాదా ఉన్న విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు గొడవలు జరిగిందని తెలిపారు. అప్పుడే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇరువు వర్గాలపై పలు కేసులు కూడా నమోదు కావడం జరిగిందని తెలిపారు. సదరు విషయాలపై అవమానంగా భావించిన లాయర్ కృష్ణారెడ్డి అతని కుమారుడు నాగార్జున రెడ్డి ఎలాగైనా స్నేహితుడు శ్రీకాంత్ను, లాయర్ సంపత్తు కుమార్ ను చంపాలని కుట్ర పండడం జరిగిందన్నారు. ముదిరెడ్డిపల్లి కు చెందిన రామాంజనేయులు, అతని అనుచరులైన రంగం రవీంద్ర, భూమా లోకేష్, కావలి శ్రీకాంత్, జంపుల శ్రీనివాసుల నాయుడుతో ఈ కిరాయికి హత్య చేయమని అడ్వాన్స్గా ఐదు లక్షలు చంపకముందు ఇవ్వడం జరిగిందన్నారు. మే 29వ తేదీ రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో హిందూపురం మండలం కోటిపి గ్రామము నుండి కర్ణాటక రాష్ట్రం చింతలపల్లికి పోవు తారు రోడ్డు పక్కన ఉన్న కాలువ దగ్గరకు పిలుచుకొని పోయి, లిక్కరు త్రాగించి కొడవలి, బాకు, బీరు బాటిల్ సీసాతో పొడిచి, నరికి చంపేసి, కారు డిక్కీలో వేసుకొని ధర్మవరం టౌనులో రెండవ మరుగు చెరువు వద్ద పడేసి పోవడం జరిగిందని తెలిపారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తితో మే 30వ తేదీ ఉదయం అనంతపురం బళ్లారి రోడ్డులో పది లక్షల తీసుకొని, అనంతపూర్ లో కారు వదిలి పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, బృందాలుగా ఏర్పడి సాక్షాధారాలను సేకరించి, ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో ఒక షిఫ్ట్ డిజైనర్ కారు, ఏడు సెల్ ఫోన్లు, రెండు పిడిబాకులు, మూడు కొడవళ్ళు, నగదు 7,05,000 రూపాయలు ముద్దాయిల నుండి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అడ్వకేట్ సంపత్ కుమార్ ని చంపడానికి 55 లక్షలు సెటిల్మెంట్ చేసుకున్నారని, 15 లక్షలు వారికి అందిందని తెలిపారు. ఈ కేసులో ఇంక ను పరారీలో ఉన్న ముద్దాయిలను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img