రక్త బంధం ట్రస్ట్ సభ్యులు
విశాలాంధ్ర- ధర్మవరం : పోలీస్ శాఖ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రక్త బంధము ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.గత నాలుగు సంవత్సరాలుగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది.గత రెండు సంవత్సరాలు ధర్మవరం వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదానం చేస్తూ, మరికొందరితో రక్తదానం చేయిస్తూ పలుగురికి ఆదర్శంగా నిలవడం జరిగింద అన్నారు.ప్రస్తుతం నంద్యాల జిల్లా నందికొట్కూరుకి బదిలీపై వెళ్తున్నారని తెలియడంతో రక్త బంధం ట్రస్టు సభ్యులు వెళ్లి సిఐ ను కలిసి సన్మానం చేయడం జరిగింది అన్నారు. అన్నారు.భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని వారు తెలిపారు.సిఐ సుబ్రహ్మణ్యం రక్త బంధం ట్రస్ట్ సభ్యులతో మాట్లాడుతూ రజిని హెల్పింగ్ హాండ్స్, చారిటబుల్ ట్రస్ట్ , రక్త బంధం ట్రస్టు సేవా కార్యక్రమాలు చాలా బాగా చేయడం జరుగు తున్నదని అన్నారు. భవిష్యత్తులో ప్రతి కష్ట, నష్టం లోను మా వంతుగా సహాయ సహకారం ఉంటుందని వారు తెలిపారు.