Monday, April 22, 2024
Monday, April 22, 2024

వైకుంఠ నారాయణస్వామి ఆలయ నిర్మాణానికి. రూ.10 వేలు విరాళం

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: నంబుల పూలకుంట మండల కేంద్రంలోని నడిమి బోటు కొండపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వైకుంఠ నారాయణ స్వామి ఆలయం అభివృద్ధికి శనివారం పెడబల్లి గ్రామానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి రూ.10 వేలను విరాళంగా అందజేశారు. వైకుంఠ నారాయణస్వామి ఆలయ నిర్మాణానికి వైకుంఠ నారాయణస్వామి సేవా ట్రస్టు సభ్యులు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని పెడబల్లి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి రూ.10వేలు విరాళం అందజేసి, ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి తెలియచేసినట్లు వైకుంఠ నారాయణస్వామి సేవా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోతున్న వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిర్మాణానికి వివిధ గ్రామాల పెద్దలు, రైతులు,నాయకులు మండల వాసులు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేయాలని వైకుంఠ నారాయణస్వామి సేవా ట్రస్ట్ సభ్యులు కోరారు. కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, విశ్వనాథరెడ్డి వైకుంఠ నారాయణస్వామి సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img